PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp5315fe7d-bab9-4382-aef0-388a0bc881ea-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp5315fe7d-bab9-4382-aef0-388a0bc881ea-415x250-IndiaHerald.jpgఏపీలో నెక్స్ట్ జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కొట్టేయాలని చాలామంది ఎమ్మెల్యేలు చూస్తున్న విషయం తెలిసిందే. మరో ఆరు నెలల్లో జరిగే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ఎమ్మెల్యేలుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు జగన్ పదవి ఇవ్వడం గ్యారెంటీ అని ప్రచారం జరుగుతుంది.ysrcp{#}Kshatriya;Y. S. Rajasekhara Reddy;Congress;Hanu Raghavapudi;రాజీనామా;Cabinet;MLA;YCP;narasapuram;Narsapur;prasad;Minister;Jagan;West Godavari;Jr NTRఆ రాజుగారికి బెర్త్ ఖాయమేనట!ఆ రాజుగారికి బెర్త్ ఖాయమేనట!ysrcp{#}Kshatriya;Y. S. Rajasekhara Reddy;Congress;Hanu Raghavapudi;రాజీనామా;Cabinet;MLA;YCP;narasapuram;Narsapur;prasad;Minister;Jagan;West Godavari;Jr NTRFri, 11 Jun 2021 02:00:00 GMTఏపీలో నెక్స్ట్ జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కొట్టేయాలని చాలామంది ఎమ్మెల్యేలు చూస్తున్న విషయం తెలిసిందే. మరో ఆరు నెలల్లో జరిగే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ఎమ్మెల్యేలుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు జగన్ పదవి ఇవ్వడం గ్యారెంటీ అని ప్రచారం జరుగుతుంది.


అందులో ముఖ్యంగా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుకు కేబినెట్‌లో చోటు దక్కడం ఖాయమని ఎప్పటినుంచో పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ప్రసాద్ రాజు, జగన్‌తో అత్యంత సన్నిహితంగా ఉంటారు. జగన్ కోసం 2012లో ఎమ్మెల్యే పదవిని సైతం త్యాగం చేశారు. 2009లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసాద్, తర్వాత వైఎస్సార్ మరణం, జగన్ పార్టీ పెట్టడంతో, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చేశారు.


ఈ క్రమంలోనే 2012లో జరిగిన నరసాపురం ఉపఎన్నికలో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆచంట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో మళ్ళీ నరసాపురంలో పోటీ చేసి ప్రసాద్ వైసీపీ తరుపున గెలిచారు. అయితే మొదట్లోనే ప్రసాద్‌కు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా జిల్లాలో ఉన్న ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజుకు పదవి దక్కింది. కానీ ఈ సారి మాత్రం చెరుకువాడ ప్లేస్‌లోకి ముదునూరి వస్తారని టాక్. మరో ఆరు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయి. జగన్ మరోసారి కులాలు, జిల్లాలు, పనితీరు ఆధారంగా మంత్రి పదవులు ఇవ్వనున్నారు.


ఈ క్రమంలోనే చెరుకువాడ ప్లేస్‌లో ప్రసాద్ రాజుకు ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో పార్టీకి కాస్త ఇబ్బంది తలెత్తింది. జిల్లాలో ఉన్న క్షత్రియ సామాజికవర్గానికి వైసీపీపై వ్యతిరేకిత పెరుగుతుంది. ఇప్పుడు మంత్రిగా రంగనాథరాజు ఉన్నా సరే, అంతగా పార్టీకి బెన్‌ఫిట్ వచ్చినట్లు కనిపించడం లేదు. అదే నరసాపురం పరిధిలో మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రసాద్ రాజుకు పదవి వస్తే, కాస్త లబ్ది చేకూరుతుందని తెలుస్తోంది. మొత్తానికైతే ప్రసాద్ రాజుకు కేబినెట్ బెర్త్ ఫిక్స్ అయినట్లే ఉంది.   





జగన్ బాటలో చినబాబు వెళ్తారా? సెట్ చేస్తారా?

కేశినేనికి పోటీగా దాసరి దిగాల్సిందేనా?

జగన్ ఏపీ సీఎం అయిన మొదట్లో విద్యుత్ ఒప్పందాలపై గట్టిపట్టు పట్టారు. అవసరమైతే ఆ ఒప్పందాలు సమీక్షిస్తామన్నారు. దీనిపై చాలా రచ్చ జరిగింది. ఇప్పుడు జగన్ అమిత్ షా భేటీ విషయంలో ఇది మరోసారి ప్రస్తావనకు వచ్చిందట.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ గురువారం రాత్రి దాదాపు గంటన్నర సేపు భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలను సీఎం హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకు వచ్చారు.

అమిత్‌షాతో జగన్‌ గంటన్నరసేపు.. ఏం మాట్లాడారంటే..?

గుంటూరు జిల్లాలో కమ్మ సామాజికవర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులే పలు నియోజకవర్గాల్లో డామినేషన్ చేస్తుంటారు. అలా కమ్మ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో వినుకొండ కూడా ఒకటి. గత కొన్నేళ్లుగా ఈ నియోజకవర్గంలో కమ్మ నేతల ప్రభావం ఎక్కువ ఉంది.

ఏపీలో నెక్స్ట్ జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కొట్టేయాలని చాలామంది ఎమ్మెల్యేలు చూస్తున్న విషయం తెలిసిందే. మరో ఆరు నెలల్లో జరిగే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ఎమ్మెల్యేలుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు జగన్ పదవి ఇవ్వడం గ్యారెంటీ అని ప్రచారం జరుగుతుంది.

ఆంధ్రాలో భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు...

జగన్ వెళ్ళక వెళ్ళక ఢిల్లీ వెళ్ళారు. మామూలుగా అయితే ముఖ్యమంత్రులకు పని ఉంటే ఢిల్లీకి వెళ్తారు. కేంద్ర పెద్దలతో భేటీలు వేస్తారు. చంద్రబాబు అయితే తన అయిదేళ్ళ పదవీ కాలంలో 29 సార్లు ఢిల్లీ వెళ్ళానని చెప్పుకున్నారు. జగన్ అయితే రెండేళ్ళలో 11 సార్లు ఢిల్లీ వెళ్ళారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>