PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodela7cd41973-2c98-4008-8ec2-b6a409054fa5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodela7cd41973-2c98-4008-8ec2-b6a409054fa5-415x250-IndiaHerald.jpgజగన్ అధికారంలోకి రాగానే అనేకమంది టీడీపీ నాయకుల లక్ష్యంగా రాజకీయం చేసిన విషయం తెలిసిందే. గతంలో తనని ఎవరైతే అవమానించారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని టార్గెట్ చేసుకుని, జగన్ ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు జగన్ ప్రభుత్వం చుక్కలు చూపించింది. అలాగే కొందరిని జైలుకు కూడా పంపింది.kodela{#}Kodela Siva Prasada Rao;TDP;YCP;Jagan;Governmentజగన్....కోడెల వారసుడుని లైట్ తీసుకున్నారా?జగన్....కోడెల వారసుడుని లైట్ తీసుకున్నారా?kodela{#}Kodela Siva Prasada Rao;TDP;YCP;Jagan;GovernmentFri, 11 Jun 2021 04:00:00 GMTజగన్ అధికారంలోకి రాగానే అనేకమంది టీడీపీ నాయకుల లక్ష్యంగా రాజకీయం చేసిన విషయం తెలిసిందే. గతంలో తనని ఎవరైతే అవమానించారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని టార్గెట్ చేసుకుని, జగన్ ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు జగన్ ప్రభుత్వం చుక్కలు చూపించింది. అలాగే కొందరిని జైలుకు కూడా పంపింది.


అయితే జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు గుప్పించింది. అలాగే ఆయనపై పలురకాల కేసులు కూడా పెట్టారు. ఆఖరికి అసెంబ్లీలో వస్తువులు సైతం ఇంటికి తీసుకొచ్చి వాడుకుంటున్నారని కేసులు పెట్టారు. ఇదే సమయంలో టీడీపీ అధికారంలో ఉండగా కోడెల తనయుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మీలు అక్రమాలకు పాల్పడ్డారని కేసులు కూడా పెట్టారు.


పశువుల పోషణ కోసం టీడీపీ ప్రభుత్వం పెట్టిన పథకంలో కోడెల కుమార్తె అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అటు సత్తెనపల్లిలో కోడెల తనయుడు కె ట్యాక్స్ పేరిట ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అటు రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కోడెల తనయుడు పలువురిని మోసం చేసినట్లు కూడా తెలిసింది. ఒకటి అని కాదు దాదాపు ఐదారు కేసుల్లో కోడెల తనయుడు ముద్దాయిగా ఉన్నారు. అలాగే పలు కేసుల్లో బెయిల్ కూడా తెచ్చుకున్నారు.


ఇక తనపై ఆరోపణలు, కుమార్తె, కుమారుడు చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్న నేపథ్యంలో కోడెల రాజకీయంగా ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. అయితే కోడెల చనిపోయాక, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీపైన వైసీపీ నేతలు విమర్శలు చేసిన సందర్భాలు లేవు. అలాగే ప్రభుత్వం కూడా కోడెల ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు కూడా కనిపించలేదు. కోడెల చనిపోయిన దగ్గర నుంచి, ఆయన వారసులపై జగన్ ప్రభుత్వం పెద్దగా ఎటాక్ చేయలేదు. ప్రస్తుతం కోడెల తనయుడు శివరాం,  సత్తెనపల్లిలో టీడీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. మొత్తానికైతే కోడెల వారసుడుని జగన్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.  




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కమ్మ ఎమ్మెల్యేకు నెగిటివ్ పెరుగుతుందా?

పితాని సైడ్ అయిపోయినట్లేనా!

ఆ రాజుగారికి బెర్త్ ఖాయమేనట!

జగన్ బాటలో చినబాబు వెళ్తారా? సెట్ చేస్తారా?

కేశినేనికి పోటీగా దాసరి దిగాల్సిందేనా?

జగన్ ఏపీ సీఎం అయిన మొదట్లో విద్యుత్ ఒప్పందాలపై గట్టిపట్టు పట్టారు. అవసరమైతే ఆ ఒప్పందాలు సమీక్షిస్తామన్నారు. దీనిపై చాలా రచ్చ జరిగింది. ఇప్పుడు జగన్ అమిత్ షా భేటీ విషయంలో ఇది మరోసారి ప్రస్తావనకు వచ్చిందట.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ గురువారం రాత్రి దాదాపు గంటన్నర సేపు భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలను సీఎం హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకు వచ్చారు.

అమిత్‌షాతో జగన్‌ గంటన్నరసేపు.. ఏం మాట్లాడారంటే..?

జగన్ అధికారంలోకి రాగానే అనేకమంది టీడీపీ నాయకుల లక్ష్యంగా రాజకీయం చేసిన విషయం తెలిసిందే. గతంలో తనని ఎవరైతే అవమానించారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని టార్గెట్ చేసుకుని, జగన్ ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు జగన్ ప్రభుత్వం చుక్కలు చూపించింది. అలాగే కొందరిని జైలుకు కూడా పంపింది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>