PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp9b87b609-37d7-41b4-9b26-3da4c50edc68-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp9b87b609-37d7-41b4-9b26-3da4c50edc68-415x250-IndiaHerald.jpgటీడీపీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటినుంచి, ఆ పార్టీకి చెందిన నేతలు చాలామంది వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. వైసీపీతో ఇబ్బంది అనుకున్నవారు బీజేపీలోకి వెళ్ళగా, మిగతా నాయకులు వరుసపెట్టి వైసీపీలోకి జంప్ చేశారు. గత రెండేళ్లుగా టీడీపీ నేతలు వైసీపీలోకి వెళుతూనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో వలసల కార్యక్రమానికి బ్రేక్ పడింది. కరోనా సమయంలో జంపింగ్‌లు జరగలేదు.tdp{#}Jagan;Andhra Pradesh;Cheque;TDP;YCPటీడీపీలో ఆ వికెట్లు పడటం ఖాయమేనా?టీడీపీలో ఆ వికెట్లు పడటం ఖాయమేనా?tdp{#}Jagan;Andhra Pradesh;Cheque;TDP;YCPThu, 10 Jun 2021 14:59:00 GMTటీడీపీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటినుంచి, ఆ పార్టీకి చెందిన నేతలు చాలామంది వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. వైసీపీతో ఇబ్బంది అనుకున్నవారు బీజేపీలోకి వెళ్ళగా, మిగతా నాయకులు వరుసపెట్టి వైసీపీలోకి జంప్ చేశారు. గత రెండేళ్లుగా టీడీపీ నేతలు వైసీపీలోకి వెళుతూనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో వలసల కార్యక్రమానికి బ్రేక్ పడింది. కరోనా సమయంలో జంపింగ్‌లు జరగలేదు.


అయితే మరికొన్ని రోజుల్లో టీడీపీలో మరికొన్ని వికెట్లు పడతాయని తెలుస్తోంది. అది కూడా టీడీపీకి సపోర్ట్‌గా ఉన్న ఎమ్మెల్సీలు. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి బలం ఉంటే, శాసనమండలిలో టీడీపీకి బలం ఉన్న విషయం తెలిసిందే. ఆ బలంతోనే గత రెండేళ్లుగా జగన్ ప్రభుత్వానికి చెక్ పెడుతున్నారు. అలాగే కీలకమైన మూడు రాజధానుల బిల్లు విషయంలో కూడా బ్రేక్ వేశారు. అందుకే జగన్ మండలి రద్దుకు ప్రతిపాదించి కేంద్రానికి బిల్లు పంపారు.


అయితే ఇప్పటికీ మండలి రద్దు ప్రక్రియ పూర్తి కాలేదు. అసలు ఆ ప్రక్రియ ఇప్పుడు ఎక్కడ ఉందో? పూర్తి అవుతుందో లేదో కూడా తెలియదు. ఇక మండలి ఏపీలో ఇంకా ఉంది కాబట్టి, ఎమ్మెల్సీల ఎంపిక జరుగుతూనే ఉంది. మండలి రద్దు ప్రక్రియ మొదలయ్యాక పలువురు ఎమ్మెల్సీలుగా ఎన్నిక అయ్యారు. అలాగే కొన్ని రోజుల్లో ఇంకా ఎమ్మెల్సీల ఎన్నిక జరగనుంది. టీడీపీకి సంబంధించి దాదాపు 10 మందికి పైనే ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి కానుంది. ఇప్పటికే మండలి ఛైర్మన్ షరీఫ్ పదవీకాలం సైతం పూర్తి అయింది.


దీంతో ఖాళీలు అయిన ఆ ఎమ్మెల్సీ పదవులన్నీ వైసీపీకి దక్కనున్నాయి. అలాగే మండలిలో టీడీపీ బలం తగ్గిపోయి, వైసీపీకి బలం పెరుగుతుంది. ఛైర్మన్ కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తే ఎన్నిక కానున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తి అయిన టీడీపీ నేతలు, మళ్ళీ పదవి ఆశించి, వైసీపీ వైపుకు చూసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్తితులో టీడీపీ వీక్‌గా ఉంది కాబట్టి తమ రాజకీయ భవిష్యత్ బాగుండాలని వైసీపీలోకి జంప్ చేసే ఛాన్స్ ఉంది. మరి చూడాలి రానున్న రోజుల్లో టీడీపీలో ఎన్ని వికెట్లు పడతాయో?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోదీ పదవికి గండమే ... నెక్స్ట్ పీఎం అతనే ?

మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్..!

మంచిమాట : భార్య ఎప్పుడూ భర్తకు ఏ వైపున ఉండాలి.

బుల్లి పిట్ట : ఇకపై జియో సెల్ ద్వారా ఫోన్ రీఛార్జ్..

నిజామాబాద్ లో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌.. !

వైరల్ న్యూస్ : కరోనా టీకా వేయించుకుంటే ఒంట్లో కరెంట్ పుడుతుందా.?

ఒంగోలులో పోటాపోటీగా వైసీపీ నేతల ఆనందయ్య మందు పంపిణీ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>