PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul6ce39aad-f3e2-478b-86c6-b9e068eb4eb3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul6ce39aad-f3e2-478b-86c6-b9e068eb4eb3-415x250-IndiaHerald.jpgకోవర్టు ఆపరేషన్‌.. సహజంగా ఇది యుద్దాల్లో పోరాటాల్లో వాడే పదం. ఒక వర్గం తరపున పని చేస్తూ.. వేరే వర్గంలోకి వెళ్లి.. అక్కడి ఆనుపానులన్నీ కనిపెట్టడాన్ని కోవర్టు ఆపరేషన్ అంటారు. గతంలో నక్సలైట్ల ఉద్యమం సమయంలోనూ ఈ పదం బాగా వినిపించేది. ఇప్పుడు ఈ పదం ఎక్కువగా రాజకీయాల్లోనే వినిపిస్తోంది. రాజకీయ పార్టీలు అన్నాక జంపింగులు ఉంటూనే ఉంటాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతలు వెళ‌ుతూనే ఉంటారు. ఇలా నేతలు పార్టీలు మారేందుకు అనేక కారణాలు ఉంటాయి. అల్టిమేట్‌గా ఏ పార్టీలో భవిష్యత్ బావుందనుకుంటే.. ఆ పార్టీలోకి వెrahul{#}Mohandas Karamchand Gandhi;Party;Assembly;Bharatiya Janata Party;Congress;Cabinet;rahul;Rahul Sipligunj;prasadరాహుల్ గాంధీ బీజేపీలోకి కోవర్టులను పంపుతున్నాడా..?రాహుల్ గాంధీ బీజేపీలోకి కోవర్టులను పంపుతున్నాడా..?rahul{#}Mohandas Karamchand Gandhi;Party;Assembly;Bharatiya Janata Party;Congress;Cabinet;rahul;Rahul Sipligunj;prasadThu, 10 Jun 2021 06:00:00 GMTకోవర్టు ఆపరేషన్‌.. సహజంగా ఇది యుద్దాల్లో పోరాటాల్లో వాడే పదం. ఒక వర్గం తరపున పని చేస్తూ.. వేరే వర్గంలోకి వెళ్లి.. అక్కడి ఆనుపానులన్నీ కనిపెట్టడాన్ని కోవర్టు ఆపరేషన్ అంటారు. గతంలో నక్సలైట్ల ఉద్యమం సమయంలోనూ ఈ పదం బాగా వినిపించేది. ఇప్పుడు ఈ పదం ఎక్కువగా రాజకీయాల్లోనే వినిపిస్తోంది. రాజకీయ పార్టీలు అన్నాక జంపింగులు ఉంటూనే ఉంటాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతలు వెళ‌ుతూనే ఉంటారు.

ఇలా నేతలు పార్టీలు మారేందుకు అనేక కారణాలు ఉంటాయి. అల్టిమేట్‌గా ఏ పార్టీలో భవిష్యత్ బావుందనుకుంటే.. ఆ పార్టీలోకి వెళ్లేందుకు మొగ్గుచూపుతుంటారు. అయితే..ఇప్పుడు యూపీలో జరిగిన ఓ భారీ జంపింగ్‌ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. యూపీలో వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసలే ఇప్పటికే యూపీలో బీజేపీ పరిస్థితి అంత బాగా లేదు.

ఇలాంటి సమయంలో యూపీ నుంచి కాంగ్రెస్ కీలక నేత జితిన్ ప్రసాద బీజేపీలో చేరాడు. ఈ జితిన్ ప్రసాద అంత తక్కువ వాడేమీ కాదు.. యూపీఏ హయాంలో రెండు సార్లు కేబినెట్ మంత్రిగా పని చేశాడు. అందులోనూ రాహుల్ గాంధీకి సన్నిహితుడుగా బాగా పేరున్న నాయకుడు. యూపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే బ్రాహ్మణ నేత జితిన్ ప్రసాద. అలాంటి వాడు.. యూపీలో కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదని బీజేపీలోకి వెళ్లాడు. జితిన్ ప్రసాద్ రాహుల్ గాంధీకి బాగా క్లోజ్. ఇద్దరూ కలిసి వాకింగ్ కూడా చేస్తూ ఉంటారని.. టూర్ లకు కూడా వెళ్తూ ఉంటారని అంటారు.

అలాంటిది జితిన్ ప్రసాద కాంగ్రెస్ ని ఎందుకు వదిలేశాడు. నిజంగానే రాజకీయ భవిష్యత్ కోసం వెళ్తున్నాడా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. కొంపదీసి జితిన్ ప్రసాదను బీజేపీలోకి కోవర్టుగా రాహుల్ గాంధీ పంపుతున్నారా అన్న అనుమనాలు కూడా వస్తున్నాయి. ఏమో ఏమైనా జరగొచ్చు.. గతంలోనూ ఇలాంటి కోవర్టు ఆపరేషన్లు కొన్ని పార్టీల్లో జరిగాయి. అవి విజయ వంతం కూడా అయ్యాయి. మరి ఇదీ అలాంటిదేనా.. లేక నిజంగానే జితిన్ ప్రసాద రాహుల్ గాంధీకి హ్యాండిచ్చాడా.. అన్నది భవిష్యత్తులోనే తేలుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జూన్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

ఈటలపై నాన్చుడు అస్త్రం ప్రయోగించనున్న కేసీఆర్..?

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??

ఎన్టీఆర్ భారీ అంచనాలతో తీసిన సాంబ మూవీకి 17 ఏళ్ళు...

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>