PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/children-covid-treatment0a0e5deb-68d8-4690-b05b-639b84489d4c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/children-covid-treatment0a0e5deb-68d8-4690-b05b-639b84489d4c-415x250-IndiaHerald.jpgథర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో చిన్నారుల చికిత్సకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ కొవిడ్ చికిత్స ప్రొటోకాల్ పేరుతో వెలువడిన సూచనలన్నీ కేవలం పెద్దల చికిత్సకోసం మాత్రమేనని చెబుతున్న నిపుణులు.. చిన్నారుల చికిత్సకోసం ప్రత్యేకంగా గైడ్ లైన్స్ విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్ఎస్) వీటిని విడుదల చేసింది. children covid treatment{#}central government;oxygen;Parents;Director;Teluguపిల్లలకు సీటీస్కాన్లు, స్టెరాయిడ్స్ వద్దు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..పిల్లలకు సీటీస్కాన్లు, స్టెరాయిడ్స్ వద్దు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..children covid treatment{#}central government;oxygen;Parents;Director;TeluguThu, 10 Jun 2021 14:17:52 GMTథర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో చిన్నారుల చికిత్సకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ కొవిడ్ చికిత్స ప్రొటోకాల్ పేరుతో వెలువడిన సూచనలన్నీ కేవలం పెద్దల చికిత్సకోసం మాత్రమేనని చెబుతున్న నిపుణులు.. చిన్నారుల చికిత్సకోసం ప్రత్యేకంగా గైడ్ లైన్స్ విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్ఎస్) వీటిని విడుదల చేసింది.

రెమిడిసెవిర్, స్టెరాయిడ్స్ వద్దు..
చిన్నారుల కొవిడ్ చికిత్సలో రెమిడిసెవిర్ ఇంజక్షన్లు కానీ, స్టెరాయిడ్స్ కానీ ఉపయోగించొద్దని స్పష్టం చేసింది డీజీహెచ్ఎస్. పెద్దల్లోనే స్టెరాయిడ్స్ కొన్ని దుష్ఫలితాలనిచ్చాయని, చిన్నారులకు అవి వాడాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే పరిస్థితి తీవ్రతను బట్టి స్టెరాయిడ్స్ వాడొచ్చని సూచించింది. ఇక కరోనా చికిత్సలో రెమిడిసెవర్ ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్రం కూడా ఆస్పత్రులకు రెమిడిసెవిర్ పంపిణీ ఆపేసింది. ఇప్పుడు చిన్నారుల చికిత్సలో ఈ ఇంజక్షన్ వాడొద్దని స్పష్టం చేసింది.

ఆహారంతోనే ఆరోగ్యం..
కరోనా సోకినా లక్షణాలు లేని పిల్లలకు అసలు చికిత్స అవసరం లేదని, వారికి బలవర్థకమైన ఆహారం పెట్టాలని డీజీహెచ్ఎస్ మార్గదర్శకాల్లో పేర్కొంది. స్వల్ప లక్షణాలుంటే కేవలం పారాసెట్మాల్ మాత్రలు వాడాలని సూచించింది. ఇన్ఫెక్షన్ ఎక్కువయితే ఆక్సిజన్ అందించాలని, అత్యవసరమైతేనే స్టెరాయిడ్ చికిత్స ప్రారంభించాలని చెప్పింది. కొవిడ్ చికిత్సలో యాంటీమైక్రోబయల్స్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదని చెప్పింది.

థర్డ్ వేవ్ అలర్ట్..
సెకండ్ వేవ్ మొదలైన సమయంలో చాలా రాష్ట్రాలు నిర్లక్ష్యం చేశాయి, ఆ తర్వాత మూల్యం చెల్లించుకున్నాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ విషయంలో ఆ తప్పులు జరగకూడదని రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చిన్నారులకోసం ఆస్పత్రులు, బెడ్లు సిద్ధం చేస్తున్నారు. చిన్నారులు కొవిడ్ బారిన పడితే.. తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలన్నదానిపై కూడా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బుల్లి పిట్ట : ఇకపై జియో సెల్ ద్వారా ఫోన్ రీఛార్జ్..

నిజామాబాద్ లో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌.. !

వైరల్ న్యూస్ : కరోనా టీకా వేయించుకుంటే ఒంట్లో కరెంట్ పుడుతుందా.?

ఒంగోలులో పోటాపోటీగా వైసీపీ నేతల ఆనందయ్య మందు పంపిణీ!

బాలయ్యకి బాబు విషెస్..

మనీ : అంతర్జాతీయంగా అత్యంత సంపన్నులు.. పన్నుల చెల్లింపు వివరాలివే..

ముంబైలో ‘ఆరెంజ్ అలర్ట్’.. మరో ఐదు రోజులు భారీ వర్షాలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>