PoliticsChandueditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/--24befa23-3247-45e1-b9fc-729c463777c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/--24befa23-3247-45e1-b9fc-729c463777c9-415x250-IndiaHerald.jpgఏపి సీఎం జగన్ నేటి ఉదయం హస్తినాకు వెళ్లనున్నారు. పోలవరం సహా పలు రకాల అభివృద్ధి పనులపై చర్చతో పాటు కోవిద్ గురించి అందించాల్సిన సాయం, మూడు రాజధానుల విషయంపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నట్టు వార్తలు వస్తున్నా... అనధికారిక చర్చలే ఎజెండాగా వెళ్తున్నట్టు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గత సోమవారమే వెళ్లాల్సి వున్నా.. కేంద్ర మంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో గురువారానికి టూర్ వాయిదా పడింది. జగన్{#}krishnam raju;Amith Shah;Governor;war;Letter;Narsapuram;YCP;Delhi;polavaram;Polavaram Project;Andhra Pradesh;Minister;central government;CM;Party;Newsసీఎం టూర్ మతలబు ఏంటి?సీఎం టూర్ మతలబు ఏంటి?జగన్{#}krishnam raju;Amith Shah;Governor;war;Letter;Narsapuram;YCP;Delhi;polavaram;Polavaram Project;Andhra Pradesh;Minister;central government;CM;Party;NewsThu, 10 Jun 2021 10:02:00 GMTసీఎం టూర్ మతలబు ఎంటి?
ఏపి సీఎం జగన్ నేటి ఉదయం హస్తినాకు వెళ్లనున్నారు.  పోలవరం సహా పలు రకాల అభివృద్ధి పనులపై చర్చతో పాటు కోవిద్ గురించి  అందించాల్సిన సాయం, మూడు రాజధానుల విషయంపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నట్టు వార్తలు వస్తున్నా... అనధికారిక చర్చలే ఎజెండాగా వెళ్తున్నట్టు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గత సోమవారమే వెళ్లాల్సి వున్నా.. కేంద్ర మంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో  గురువారానికి టూర్ వాయిదా పడింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. సీఐడీ కస్టడీలో వుండగానే తనపై దాడి చేశారని.. కేంద్ర మంత్రుల దృష్టికి రఘురామ కృష్ణం రాజు తీసుకెళ్లారు. దానికి తోడు సీఎం జగన్ బెయిల్ను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. అంతేకాకుండా రాష్ట్రపతితో పాటు గవర్నర్ కు ఆయన లేఖలు రాశాడు. దాంతో ఏపీ లో రాజకీయం రసవత్తరంగా మారింది. సదరు విషయాలన్నింటి పై కేంద్రమంత్రులతో సీఎం చర్చించడానికే ఏపీ సీఎం హస్తినా ప్రయాణమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివాదం ముదురక ముందే.. ముందు జాగ్రత్తగా ఈ చర్చలకు వెళ్లనున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అందుకోసమే వైసీపీ ఎంపీలు అందరు పట్టుబట్టి కేంద్రమంత్రులతో సీఎం సమావేశానికి అప్పాయింట్మెంట్ తీసుకున్నారనేది నిపుణుల మాట. జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్తో భేటీ అయి.. ప్రాజెక్ట్ లపై చర్చిస్తారని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై చర్చిస్తారని చెబుతున్నా.. అమిత్ షా భేటీనే ప్రాధాన్యత గా వెళ్లనున్నట్లు సమాచారం.  రాష్ట్ర అభివృద్ధి విషయమై సీఎం ఢిల్లీ వెళ్తున్నట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కావాలని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి అని విమర్శిస్తున్నారు. ఇదే విషయమై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తున్నది.ఎది ఏమైనా ప్రస్తుతం ఏపీ లో నెలకున్న పరిస్థితుల దృష్ట్యా.. సీఎం జగన్ ఢిల్లీ టూర్ సర్వత్రా ఆసక్తి రేపుతున్నది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సెంటర్ ఏదైనా స్లోగన్ ఒక్కటే..జై బాలయ్య! జై జై బాలయ్య !!

తెలుగు యాంకర్ కు తమిళ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ?

బాలయ్య బర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా..

నేడు సూర్య‌గ్ర‌హ‌ణం...భార‌త్ పై ఎలాంటి ప్ర‌భావం ఉంటుంది..?

జూన్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

ఈటలపై నాన్చుడు అస్త్రం ప్రయోగించనున్న కేసీఆర్..?

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandu]]>