International
oi-Syed Ahmed
ఉద్యోగాలు, ఉపాధి, నివాసం కోసం భారతీయులు అమెరికాకు వలస వెళ్లడం దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. అయితే అక్కడికి వెళ్తున్న భారతీయులు ఎంత మేర సురక్షితంగా ఉంటున్నారు, స్వేచ్ఛగా నివసిస్తున్నారంటే మాత్రం కచ్చితమైన సమాధానం దొరకదు. ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా చెప్పుకుంటున్నా వర్ణ వివక్ష విషయంలో మాత్రం ఇప్పటికీ అమెరికా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. అదీ దాక భారతీయులపై వారికి ఎప్పుడూ చిన్నచూపే. తాజాగా ఓ యూఎస్ సర్వేలో సైతం ఇదే తేలింది.
అమెరికాలో నివసించే భారతీయ అమెరికన్ల వైఖరులపై తాజాగా నిర్వహించిన సర్వేలో సగం మంది భారతీయులు అంటే ప్రతీ ఇద్దరిలో ఒకరు ఈ వివక్ష ఎదుర్కొంటున్నట్లు స్పష్టమైంది. అందులోనూ వర్ణ వివక్ష ఎదుర్కొంటున్న వారే ఇందులో ఎక్కువగా ఉన్నారని సర్వేలో తేలింది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో వర్ణ వివక్ష కొత్త రూపులో సాగుతున్నట్లు తెలిపారు.

గతేడాది సెప్టెంబర్‌లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ సర్వేలో 1200 మంది భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. ట్రంప్ హయాంలో నల్ల జాతీయులపై వివక్షపై పోరు జరుగుతున్న తరుణంలో ఈ సర్వే సాగింది. ఇందులో పాల్గొన్న వారంతా తాము ఏదో రకంగా వివక్ష ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. మూడేళ్ల క్రితం అమెరికా జనాభాలో భారతీయుల సంఖ్య 4.2 మిలియన్లుగా తేల్చారు. తాజాగా భారతీయ అమెరికన్ కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా కూడా ఎన్నికయ్యారు.
English summary
The most recent Indian American Attitudes Survey (IAAS) has found that one out of two Indian Americans felt discriminated against in the United States in the past year.
Story first published: Thursday, June 10, 2021, 17:13 [IST]