HealthChandueditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedవైద్యో నారాయణో హరి అన్న మాటలు ప్రస్తుత తరుణంలో అక్షరాల నిజమవుతున్నాయి. వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కరోనాతో యుద్ధం చేస్తున్నారు. రాత్రింబవళ్ళు తేడా లేకుండా ఆసుపత్రుల కే పరిమితం అవుతున్నారు. కుటుంబాలను వదిలి.. ప్రజలే తమ కుటుంబ సభ్యులుగా నిత్యం వైద్య సేవలో వుంటున్నారు. పీపీఈ కిట్లలోనే రోజు మొత్తం గడుపుతున్నారు.Doctor{#}hari;hari music;Doctor;war;Rajasekhar Sivaniహ్యాట్సాఫ్ డాక్టర్హ్యాట్సాఫ్ డాక్టర్Doctor{#}hari;hari music;Doctor;war;Rajasekhar SivaniThu, 10 Jun 2021 14:16:00 GMTహ్యాట్సాఫ్ డాక్టర్..
వైద్యో నారాయణో హరి అన్న మాటలు ప్రస్తుత తరుణంలో అక్షరాల నిజమవుతున్నాయి. వైద్యులు తమ ప్రాణాలను సైతం  లెక్కచేయకుండా.. ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కరోనాతో యుద్ధం చేస్తున్నారు. రాత్రింబవళ్ళు తేడా లేకుండా ఆసుపత్రుల కే పరిమితం అవుతున్నారు. కుటుంబాలను వదిలి.. ప్రజలే తమ కుటుంబ సభ్యులుగా నిత్యం వైద్య సేవలో వుంటున్నారు. పీపీఈ కిట్లలోనే రోజు మొత్తం గడుపుతున్నారు. కరోనా రోగులను పలకరించడానికి కూడా కొందరు భయపడుతున్న నేపథ్యంలో.. ప్రతీ రోజు వారి మధ్యే వుంటు.. సేవలందిస్తున్న డాక్టర్ల సేవలు నిజంగా అభినందనీయం. ప్రజా సేవలో ఎంతో మంది డాక్టర్లు కరోనా బారిన్ పడి మరణించిన విషయం విదితమే. అయినప్పటికీ డాక్టర్లు ప్రజా సేవకు ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆప్యంగా పలకరిస్తూ కొవిడ్ రోగుల్లో మానసిక ధైర్యాన్ని నిపుతున్నారు. తమ చుట్టూ ప్రమాదం పొంచి వున్నదని తెలిసిన నమ్మిన వృత్తికి గౌరవమిస్తూ డ్యూటీలు చేస్తున్నారు. నిండు గర్భం లోనూ ఓ వైద్యురాలు కరోనా రోగులకు చికిత్స అందిస్తూ ఆదర్శంగా నిలిచింది.
జమ్మూ కాశ్మీర్లోని కతువాకి చెందిన  డాక్టర్ శివాని ఎనమిది నెలల గర్భంతోనూ వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నది. ప్రస్తుతం ఉన్న పాండమిక్ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను రక్షించడానికి ధైర్యంగా ఓ అడుగు వేసింది. ఇంట్లో వుండి రెస్ట్ తీసుకోవాల్సిన ఆమె... రెస్ట్ లేకుండా ప్రజా సేవలో వుంటున్నది. కొద్దిగా పనిలో ఒత్తిడి వున్నప్పటికీ.. నేడు వున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా తాను పనిలో వుండాల్సిందే అని స్ఫూర్తిని చాటుతున్నది. చిన్న చిన్న పనులకు కూడా కారణాలు వెతుక్కుని ఉద్యోగానికి సెలవు పెట్టేవారు అనేకం. అట్లాంది మరో కొద్దీ రోజుల్లో ఓ బిడ్డకు జన్మనిచే పరిస్థితుల్లో వున్నప్పటికి వృత్తిని గౌరవించి సేవలందిస్తున్న ఆ డాక్టర్ సేవలను అందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా సేవలందిస్తున్ననదుకు నిజంగా ప్రతీ ఒక్కరూ శివాని మేడం కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పిల్లలకు సీటీస్కాన్లు, స్టెరాయిడ్స్ వద్దు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..

బుల్లి పిట్ట : ఇకపై జియో సెల్ ద్వారా ఫోన్ రీఛార్జ్..

నిజామాబాద్ లో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌.. !

వైరల్ న్యూస్ : కరోనా టీకా వేయించుకుంటే ఒంట్లో కరెంట్ పుడుతుందా.?

ఒంగోలులో పోటాపోటీగా వైసీపీ నేతల ఆనందయ్య మందు పంపిణీ!

బాలయ్యకి బాబు విషెస్..

మనీ : అంతర్జాతీయంగా అత్యంత సంపన్నులు.. పన్నుల చెల్లింపు వివరాలివే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandu]]>