PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china6845736f-60bd-42d5-a568-5a3e4256d426-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china6845736f-60bd-42d5-a568-5a3e4256d426-415x250-IndiaHerald.jpgచైనా ప్రతి రోజు ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. పక్కదేశాలపై ఆధిపత్యం చూపించే ప్రయత్నంలో చైనా చేసే వింత చేష్టలతోనో, లేదంటే ఇతర దేశాల జల, వాయు, భూ భాగాల్లోకి తన బలగాలను పంపండం వంటి కారణాలతో చైనా వార్తల్లో ఉంటుంది. అవేవీ కాకపోతే ఇతర దేశాలపై తన వ్యాఖ్యలతోనైనా వార్తల్లోకి ఎక్కుతోంది. అయితే గత కొన్ని రోజులు..china{#}Japan;Parliament;Governmentజపాన్‌పై చైనా ఫైర్..మా విషయాల్లో జోక్యం వద్దు..జపాన్‌పై చైనా ఫైర్..మా విషయాల్లో జోక్యం వద్దు..china{#}Japan;Parliament;GovernmentThu, 10 Jun 2021 18:52:28 GMTబీజింగ్: చైనా ప్రతి రోజు ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. పక్కదేశాలపై ఆధిపత్యం చూపించే ప్రయత్నంలో చైనా చేసే వింత చేష్టలతోనో, లేదంటే ఇతర దేశాల జల, వాయు, భూ భాగాల్లోకి తన బలగాలను పంపండం వంటి కారణాలతో చైనా వార్తల్లో ఉంటుంది. అవేవీ కాకపోతే ఇతర దేశాలపై తన వ్యాఖ్యలతోనైనా వార్తల్లోకి ఎక్కుతోంది. అయితే గత కొన్ని రోజులుగా చైనా, తైవాన్ విషయం ప్రపంచ దేశాల మధ్య చర్యనీయాంశంగా ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా జపాన్ అధ్యక్షుడు యోషిహిడే సుగా మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, తైవాన్ దేశాలు విజయం సాధించాయని అన్నారు. దాంతో యోషిహిడే మాటలపై చైనా స్పందించింది. అంతేకాకుండా తైవాన్‌ను ప్రత్యేక దేశంగా సంభోదించిన జపాన్‌ అధ్యక్షుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ ప్రత్యేక దేశం కాదని, తనలోని అంతర్భాగమేనని చైనా పేర్కొంది. అంతేకాకుండా చైనా అంతర్గత విషయాలలో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని, తన సమస్యలను తాను పరిష్కరించుకోగలనని చెప్పింది. ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖా ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ కూడా స్పందించారు. జపాన్ ప్రధాని వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయని, తైవాన్ తమ అంతర్గత భాగమని, దానిని ప్రత్యేక దేశంగా వ్యాఖ్యానించకూడదన్న ఒప్పందాన్ని జపాన్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు.


అయితే ప్రస్తుతం జపాన్‌లో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రపంచంలోని కరోనా పరిస్థితులపై చర్చించారు. ఇందులో భాగంగానే జపాన్ అధ్యక్షుడు తైవాన్‌ను ప్రత్యేక దేశంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇతరత్రా విషయాలపై కూడా చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే తైవాన్ విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదని, తన అంతర్గత విషయాలలో ఎవరూ వేలు పెట్టదని ఇప్పటికే చైనా పలుసార్లు పలికింది. అయితే తైవాన్ చైనాలో భాగం కాదని, తాను ప్రత్యేక దేశం అని తైవాన్ ప్రభుత్వం అనేక సార్లు పేర్కొంది. మరి ఇప్పుడు తైవాన్‌ను ప్రత్యేక దేశంగా వ్యాఖ్యానించిన జపాన్ నోరు మూయిస్తున్న చైనాపై తైవాన్ ప్రభుత్వం ఏమని స్పందిస్తుందో వేచి చూడాలి.



ఆనందయ్య మందుకి రాజకీయ గ్రహణం.. ఎప్పుడు వదులుతుందో మరీ?

తైవాన్‌ను ప్రత్యేక దేశంగా సంభోదించిన జపాన్‌ అధ్యక్షుడిపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆ ఎమ్మెల్యేలని జగన్ లైన్‌లో పెట్టాల్సిందేనా!

త్వ‌ర‌లో బీజేపీలోకి భారీగా చేరిక‌లు - బండి సంజ‌య్‌

ఆ విషయంలో గౌతమ్ రెడ్డి టార్గెట్ అయిపోయారుగా!

టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస‌న అమెరికా..?

ఈటల రాజీనామా వారికి ప్లస్ అయిందా ?

మొహుల్ చోక్సీ విషయంలో భారత్ కి గుడ్ న్యూస్?

ముంబైలో ‘ఆరెంజ్ అలర్ట్’.. మరో ఐదు రోజులు భారీ వర్షాలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>