SmaranaDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/smarna-raguvan-dipth-5f135f28-bdc1-4077-9954-bd52c1cd0b9d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/smarna-raguvan-dipth-5f135f28-bdc1-4077-9954-bd52c1cd0b9d-415x250-IndiaHerald.jpgమన సినీ ఇండస్ట్రీలో నాటి నుండి నేటి వరకు విలన్ పాత్రలో నటించి, ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఎంతోమంది నటులు అకస్మాత్తుగా కొన్ని కారణాల చేత కనుమరుగై పోతున్నారు. ఇలా వచ్చి.. అలా నటించి.. ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఎంతో మంది నటులు, ముఖ్యంగా విలన్ పాత్రలో నటించి, ప్రేక్షకుల చేత చివాట్లు పెట్టించుకున్న నటులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇది చూస్తేనే అర్థమైపోతుంది వాళ్లు వారి పాత్రలో లీనమైపోయి ఎలా నటించారోనని..ప్రేక్షకులను భయపెట్టినా, ప్రేక్షకులను సంతోషపెట్టినా నటుల యొక్క కళా ప్రావీణ్యం బయటపడుతుంది. ఇక అలాంటSMARNA;RAGUVAN DIPTH {#}anjali;raghuvaran;rohini;Kerala;palakkad;December;Kanchana;Okkadu;Chennai;Mister;marriage;Cinema;Teluguస్మరణ :నటుడు రఘువరన్ చనిపోవడానికి కారణం ఇదే..స్మరణ :నటుడు రఘువరన్ చనిపోవడానికి కారణం ఇదే..SMARNA;RAGUVAN DIPTH {#}anjali;raghuvaran;rohini;Kerala;palakkad;December;Kanchana;Okkadu;Chennai;Mister;marriage;Cinema;TeluguThu, 10 Jun 2021 07:00:00 GMT
మన సినీ ఇండస్ట్రీలో నాటి నుండి నేటి వరకు విలన్ పాత్రలో నటించి, ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఎంతోమంది నటులు అకస్మాత్తుగా కొన్ని కారణాల చేత కనుమరుగై పోతున్నారు. ఇలా వచ్చి.. అలా నటించి.. ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఎంతో మంది నటులు, ముఖ్యంగా విలన్ పాత్రలో నటించి, ప్రేక్షకుల చేత చివాట్లు పెట్టించుకున్న నటులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇది చూస్తేనే అర్థమైపోతుంది వాళ్లు వారి పాత్రలో లీనమైపోయి ఎలా నటించారోనని..ప్రేక్షకులను భయపెట్టినా,  ప్రేక్షకులను సంతోషపెట్టినా నటుల యొక్క కళా ప్రావీణ్యం బయటపడుతుంది. ఇక అలాంటి వారిలో రఘువరన్ కూడా ఒకరు. ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలకు ప్రతినాయకుడిగా నటించి, అందరి చేత మన్ననలు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు.

రఘువరన్ డిసెంబర్ -11- 1958 వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన కోలెంగూడె అనే ప్రాంతంలో కస్తూరి, వేలాయుధన్ దంపతులకు జన్మించారు. 1986లో మిస్టర్ భరత్ అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత చైతన్య, న్యాయానికి సంకెళ్ళు, పసివాడి ప్రాణం, జేబుదొంగ, కాంచన సీత, శివ, అంజలి ,కిల్లర్, ప్రేమికుడు, ముత్తు, ఎవడైతే నాకేంటి, ఒకే ఒక్కడు , రక్షకుడు, అరుణాచలం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో  నటించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇలా తెలుగు ,తమిళ్ ,కన్నడ, మలయాళం భాషలలో సుమారు 150 చిత్రాలకు పైగా నటించారు.


ఆ తరువాత ఈయన నటి రోహిణి ని పెళ్లి చేసుకొని, వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈయన చివరిసారిగా 2008లో వచ్చిన నితిన్ ఆటాడిస్తా మూవీ తో సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇక ఈయన సినీ కెరీర్లో ఇదే చివరి సినిమా. ఈయన చిత్రాలలో బాగా విజయవంతంగా రాణిస్తున్న సమయంలో ,ఈయన అనుకోని కారణాల చేత మద్యానికి.. మాదకద్రవ్యాలకు .. ఇలా ఎన్నో చెడు అలవాట్లకు బానిస అయ్యారు. ఈయన మద్యానికి బానిస కావడం వల్ల కాలేయం కూడా చెడిపోయింది. మార్చి- 19 - 2008 లో చెన్నై లో గాఢనిద్రలో ఉన్నట్టుగానే గుండెపోటుతో మరణించారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొదటి రాత్రే యువతికి షాక్.. వరుడు ఆ విషయం బయట పెట్టేసాడు?

జూన్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

ఈటలపై నాన్చుడు అస్త్రం ప్రయోగించనున్న కేసీఆర్..?

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??

ఎన్టీఆర్ భారీ అంచనాలతో తీసిన సాంబ మూవీకి 17 ఏళ్ళు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>