PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-1988317dcc-3e2a-48a4-a438-690e39523dde-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-1988317dcc-3e2a-48a4-a438-690e39523dde-415x250-IndiaHerald.jpgన్యూఢిల్టీ: దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వ్యాక్సినేషన్‌కు తగ్గట్టు టీకాల పంపిణీ కూడా జరగాలని కేంద్రం పలు టీకా సంస్థలకు అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా రష్యా స్పుత్నిక్ టీకా భారత్‌కు చేరుకుంది. స్పుత్నిక్-వీ టీకా ఇకపై ఇక్కడే ఉత్పత్తి కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మన దేశంలో టీకాలు ఉన్నప్పటికీ ఇంకా కొరత తీరలేదు. ఇటువంటి సమయాల్లో..covid-19{#}Kerala;Russia;Madhya Pradesh - Bhopal;West Bengal - Kolkata;Kanna Lakshminarayana;Jharkhandటీకాలు వేయడంలో ఆ రాష్ట్రాలే టాప్..టీకాలు వేయడంలో ఆ రాష్ట్రాలే టాప్..covid-19{#}Kerala;Russia;Madhya Pradesh - Bhopal;West Bengal - Kolkata;Kanna Lakshminarayana;JharkhandThu, 10 Jun 2021 16:59:44 GMTన్యూఢిల్టీ: దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వ్యాక్సినేషన్‌కు తగ్గట్టు టీకాల పంపిణీ కూడా జరగాలని కేంద్రం పలు టీకా సంస్థలకు అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా రష్యా స్పుత్నిక్ టీకా భారత్‌కు చేరుకుంది. స్పుత్నిక్-వీ టీకా ఇకపై ఇక్కడే ఉత్పత్తి కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మన దేశంలో టీకాలు ఉన్నప్పటికీ ఇంకా కొరత తీరలేదు. ఇటువంటి సమయాల్లో కొన్ని రాష్ట్రాల్లో టీకాలు వృథా కావడం పెద్ద సమస్యగా మారింది. కానీ కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క చుక్క వ్యాక్సిన్ కూడా వృథా కాలేదు. ఈ రాష్ట్రాలకు చేరిన ప్రతి వ్యాక్సిన్ డోసును సద్వినియోగం చేశాయి. దీంతో వ్యాక్సినేషన్‌లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఒక్క మే నెలలో కేరళ రాష్ట్రం కేంద్రం తమకు ఇచ్చిన కోటాకు మించి 1.10లక్షల వ్యాక్సిన్ డోసులను తమ రాష్ట్ర ప్రజలకు వేసింది. అదే తరహాలో బెంగాల్ ప్రభుత్వం కూడా కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్ల కన్నా 1.61 లక్షల టీకా డోసుల అదనంగా వేసింది. సాధారణంగా వ్యాక్సిన్ వయల్‌ను పూర్తిగా వాడితే 10 డోసులు ఇవ్వగలరు. కానీ సాధారణంగా ఒకటి రెండు డోసులు వృథాగా పోగా 8-9 మందికి ఒక్క వయల్ కచ్చితంగా వస్తుంది. ఈ మేరకు కేంద్రం లెక్క వేస్తుంది. అయితే ప్రస్తుతం కేరళ, బెంగాల్ ఇచ్చిన లెక్కల ప్రకారం కేంద్రం లెక్క వేసే వృథాను కూడా ఈ రాష్ట్రాలు చేయలేదని నిపుణుల అంటున్నారు. తమకు చేరిన ప్రతి వయల్‌ను పూర్తిగా 10 మందికి వాడారు.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు దేశంలో అత్యధిక టీకాలను వృథా చేసిన రాష్ట్రాల్లో ఝార్ఖండ్ ప్రథమ స్థానంలో ఉంది. కేంద్రం లెక్కల ప్రకారం ఝార్జండ్ ఇప్పటి వరకు తనకు ఇచ్చిన వ్యాక్సిన్‌లలో 33.95 శాతం వృథా చేసింది. ఆ తరువాత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 15.79, మధ్యప్రదేశ్ 7.35 శాతం టీకా డోసులు వృథా అవ్వడంతో ఇవి వరుస క్రమంలో ఉన్నాయి. ఇక ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల విషయానికి వస్తే ప్రతి రాష్ట్రంలోనూ 3 శాతం కన్నా ఎక్కువ డోసులు నిరుపయోగం అవుతున్నాయి. మరి దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హీరో రిషి ల‌వ్ స్టోరీ ఆ రోజు స్టార్ట్ అయిందంట‌!

'అఖండ‌'మైన అభిమానులున్న ఈ 'సింహా' ఒక 'లెజెండ్‌'

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

మోదీ పదవికి గండమే ... నెక్స్ట్ పీఎం అతనే ?

మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్..!

మంచిమాట : భార్య ఎప్పుడూ భర్తకు ఏ వైపున ఉండాలి.

బుల్లి పిట్ట : ఇకపై జియో సెల్ ద్వారా ఫోన్ రీఛార్జ్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>