SatireChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/etelabe6bf6cd-1c5f-4260-b92f-684367e40635-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/etelabe6bf6cd-1c5f-4260-b92f-684367e40635-415x250-IndiaHerald.jpgఈటల రాజేందర్.. ఇప్పడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్. అయితే పేరుకే పేరులో ఈటెలు ఉన్నాయి కానీ.. ఆయన తీసుకునే నిర్ణయాల్లో అంతగా పదను కనిపించడం లేదు. ఆయన గత చరిత్ర చూసి.. వైఎస్సార్ లాంటి నాయకుడిని సైతం ఎదుర్కొన్న తీరు చూస్తే.. అబ్బో ఈటల మామూలోడు కాదు అన్న అభిప్రాయం ఉండేది.. కానీ.. ఎందుకో ఇప్పుడు ఈటల వ్యవహారశైలిలో అంత ఈటెల్లాంటి పదును కనిపించడం లేదు. ఈటె అంటే ఎలా ఉంటుంది. మంచి ఒడుపు చూసి ఈటె విసిరితే ఎంతటి సింహం అయినా నేల కూలాల్సిందే. గురి చూసి కొడితే.. ఎలాంటి భయంకరమైన జంతువైనా నిట్టనిలువునా కూetela{#}Madhanam;Telangana;Y. S. Rajasekhara Reddy;lion;history;Party;KCR;Newsఈటల: 'ఈటె'లా లేదే.. పోటు దిగుద్దా..?ఈటల: 'ఈటె'లా లేదే.. పోటు దిగుద్దా..?etela{#}Madhanam;Telangana;Y. S. Rajasekhara Reddy;lion;history;Party;KCR;NewsThu, 10 Jun 2021 09:21:16 GMTఈటల రాజేందర్.. ఇప్పడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్. అయితే పేరుకే పేరులో ఈటెలు ఉన్నాయి కానీ.. ఆయన తీసుకునే నిర్ణయాల్లో అంతగా పదను కనిపించడం లేదు. ఆయన గత చరిత్ర చూసి.. వైఎస్సార్ లాంటి నాయకుడిని సైతం ఎదుర్కొన్న తీరు చూస్తే.. అబ్బో ఈటల మామూలోడు కాదు అన్న అభిప్రాయం ఉండేది.. కానీ.. ఎందుకో ఇప్పుడు ఈటల వ్యవహారశైలిలో అంత ఈటెల్లాంటి పదును కనిపించడం లేదు.

ఈటె అంటే ఎలా ఉంటుంది. మంచి ఒడుపు చూసి ఈటె విసిరితే ఎంతటి సింహం అయినా నేల కూలాల్సిందే. గురి చూసి కొడితే.. ఎలాంటి భయంకరమైన జంతువైనా నిట్టనిలువునా కూలిపోవాల్సిందే. మరి ఈ ఈటల సంగతి.. ఒకప్పటి సంగతేమో కానీ.. ఇప్పుడు ఈ ఈటెకు అంత పదును కనిపించడం లేదు. మరి వ్యాపారాలు తెచ్చిన ముందరి కాళ్ల బంధనాలో.. ఇంకేమైనా లొసుగులో తెలియదు కానీ.. ఈటల వ్యవహారం అనుకున్నంత దూకుడుగా లేదు.

అసలు కేసీఆర్ లాంటి వాడితో పెట్టుకోవాలంటేనే ఎన్నో ఆలోచించాలి. ఎంతో మథనం చేయాలి. అప్పుడు కానీ.. ఓ నిర్ణయానికి రాకూడదు. అదంతా ఆలోచించే వరకే. కానీ ఓసారి నిర్ణయం తీసుకున్నాక ఈటెలా దూసుకుపోవాల్సిందే. నాన్చితే కుదరదు. ఆ గ్యాప్‌లో కేసీఆర్ వంటి నాయకులు ఎన్ని వ్యూహాలైన పన్నగలడు. మరి ఈటల మాత్రం అంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు.

ముందుగా సొంత పార్టీ పెడతారన్న వార్తలు వచ్చాయి. కానీ.. అంగ బలం, అర్థబలం చాలవనుకున్నారో ఏమో.. మొత్తానికి ఆ నిర్ణయం విరమించుకున్నారు. అంతే కాదు..ఓ బలమైన అండ ఉంటే తప్ప కేసీఆర్ ఎత్తులను నుంచి కాపాడుకోలేం అనుకున్నారేమో అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పోనీ.. ఆ చేరేదైనా వెంటనే చేరారా.. అంటే అదీ లేదు. ఇంకా నాన్చుడే. కేసీఆర్ లాంటి వాడితో పెట్టుకునేటప్పుడు వ్యూహాలు చకచకా ఈటెల్లా లేకపోతే.. కష్టమే. మరి ఈ ఈటల ఎలా నెగ్గుకొస్తాడో చూద్దాం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య 107 అప్డేట్ వచ్చేసింది.. ఇక వేట మొదలు..!

తెలుగు యాంకర్ కు తమిళ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ?

బాలయ్య బర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా..

నేడు సూర్య‌గ్ర‌హ‌ణం...భార‌త్ పై ఎలాంటి ప్ర‌భావం ఉంటుంది..?

జూన్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

ఈటలపై నాన్చుడు అస్త్రం ప్రయోగించనున్న కేసీఆర్..?

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>