PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/marriage-c7d7d34d-e36d-4df0-ae8f-df5f0a8f1e6e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/marriage-c7d7d34d-e36d-4df0-ae8f-df5f0a8f1e6e-415x250-IndiaHerald.jpgపూర్వం కాలంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. డెబ్భై ఏళ్ల ముసలి వాళ్లకు ఎనిమిదేళ్ల చిన్న పిల్లలను ఇచ్చి పెళ్ళి చేసేవారు. ఇక అప్పట్లో కన్యాశుల్కం కూడా ఉండేది. ముసలి వాళ్ళు ఆడపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి వారిని కొనుకొనేవారు. సమాజంలో బాల్య వివాహాలను రూపుమాపేందుకు అనేక మంది సంఘసంస్కర్తలు దీనిపై పోరాటం చేశారు.marriage {#}District;Smart phone;mandalam;wednesday;marriage;job;local language;Ishtam30 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల బాలిక వివాహానికి యత్నం..!30 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల బాలిక వివాహానికి యత్నం..!marriage {#}District;Smart phone;mandalam;wednesday;marriage;job;local language;IshtamThu, 10 Jun 2021 10:28:55 GMTపూర్వం కాలంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. డెబ్భై ఏళ్ల ముసలి వాళ్లకు ఎనిమిదేళ్ల చిన్న పిల్లలను ఇచ్చి పెళ్ళి చేసేవారు. ఇక అప్పట్లో కన్యాశుల్కం కూడా ఉండేది. ముసలి వాళ్ళు ఆడపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి వారిని కొనుకొనేవారు. సమాజంలో బాల్య వివాహాలను రూపుమాపేందుకు అనేక మంది సంఘసంస్కర్తలు దీనిపై పోరాటం చేశారు. ఇక కాలానుగుణంగా వంటి నుండి రాజ్యాలను పాలించే స్థాయికి ఎదిగిపోయారు స్త్రీలు. ఇక నేటి సమాజంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు బాలల సంరక్షణ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు.

తాజాగా 30 ఏళ్ల వ్యక్తికి 9వ తరగతి చదువుతున్న బాలికతో వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ వివాహం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. దీంతో బాలల సంరక్షణ అధికారులకు ఫోన్ చేసి సార్‌.. నేనింకా చిన్నపిల్లను. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఉందని తెలిపింది. ఇక నేను చెప్పినా పెద్దలు వినడం లేదని బాలిక వాపోయింది. అంతేకాక  పైగా 30 ఏళ్ల వ్యక్తికి, అదీ మొదటి భార్యతో విడాకులైన వ్యక్తికి ఆమెను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారని వెల్లడించింది. ఈ వివాహాన్ని దొంగచాటుగా చేయాలని పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఇక నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా ఆపండి.. ఇదీ పద్నాలుగేళ్ల బాలిక తనకు వివాహం చేయాలని పెద్దలు యత్నించిన క్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసింది అమ్మాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట శివారు గార్లగడ్డ తండాకు చెందిన ఓ బాలిక 9వ తరగతి చదువుతుంది. ఇక వరంగల్‌ అర్బన్‌ జిల్లా వాసి, ఇప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకున్న 30 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించుకున్నారు. ఆ బాలిక తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. చదువుకుంటానని ఆ బాలిక మొరపెట్టుకున్నా పెద్దలు వినకుండా నిశ్చితార్థం చేశారు.

ఇక ఆ బాలిక తన స్నేహితురాలితో చైల్డ్‌లైన్‌కు సంబంధించి 1098 ఫోన్‌ చేయమని సలహా ఇచ్చింది. ఇక ఈ విషయాన్ని స్థానిక ఎంపీటీసీ వీరన్న కూడా బాలల సంరక్షణ అధికారులకు తెలిపాడు. ఇక విషయం తెలుసుకున్న పెద్దలు బుధవారం బాలిక అమ్మమ్మ గ్రామమైన గీసుకొండ మండలంలోని నందనాయక్‌ తండాలో గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేయడానికి సిద్ధమవుతుండగా బాలల పరిరక్షణ విభాగం అధికారులు పెళ్లి తంతును ఆడుకొని అమ్మాయిని కాపాడారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీఎం టూర్ మతలబు ఏంటి?

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా వ్యాక్సిన్ ఫీచర్?

సెంటర్ ఏదైనా స్లోగన్ ఒక్కటే..జై బాలయ్య! జై జై బాలయ్య !!

తెలుగు యాంకర్ కు తమిళ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ?

బాలయ్య బర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా..

నేడు సూర్య‌గ్ర‌హ‌ణం...భార‌త్ పై ఎలాంటి ప్ర‌భావం ఉంటుంది..?

జూన్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>