PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/eetala-rajendare3d81143-856b-4b73-b2ae-6343a5a36617-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/eetala-rajendare3d81143-856b-4b73-b2ae-6343a5a36617-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కరోనా నియంత్రణలో భాగంగా అధికార పార్టీ మరియు ప్రభుత్వ అధికారులు తలమునకలై ఉన్నారు. మరో వైపు త్వరలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవలే మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి అలాగే తెరాస పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. EETALA RAJENDAR{#}KCR;Akkineni Nagarjuna;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;రాజీనామా;Government;MLA;Minister;Press;Party;Huzurabadఈటల రాజీనామా వారికి ప్లస్ అయిందా ?ఈటల రాజీనామా వారికి ప్లస్ అయిందా ?EETALA RAJENDAR{#}KCR;Akkineni Nagarjuna;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;రాజీనామా;Government;MLA;Minister;Press;Party;HuzurabadThu, 10 Jun 2021 12:27:29 GMTతెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కరోనా నియంత్రణలో భాగంగా అధికార పార్టీ మరియు ప్రభుత్వ అధికారులు తలమునకలై ఉన్నారు. మరో వైపు త్వరలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవలే మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి అలాగే తెరాస పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నిక షురూ అయింది. ఎప్పుడూ జరుగుతుంది అన్న దానిపై ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చే అవకాశం లేదు. కరోనా పూర్తిగా తగ్గేంత వరకు కష్టమే. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా కరోనా సమయంలో నిర్వహించడం వలన కరోనా వ్యాప్తి ఎలా జరిగిందో మాయి చూశాము. దీన్ని బట్టి కొంచెం ఆలస్యం అవుతుంది అని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈటల రాజేందర్ రాజీనామాపై వివిధ పార్టీల నుండి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వలన అక్కడున్న సమస్యలు మరియు ఎన్నికల ముందు తెరాస పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుతాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదేంటి ఈటల రాజీనామా చేయడం వలన హామీలు నెరవేరుతాయా ? మొన్న ఈటల పెట్టిన ప్రెస్ మీట్ లో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పింఛన్లు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, నిరోద్యోగ భృతి లాంటి ఇచ్చిన ఎన్నో హామీలు నెరవేర్చలేదని తెరాసా పైన కేసీఆర్ పైన విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో ఈటలపై ఉప ఎన్నికలో గెలవడానికి అయినా సరే, ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తారని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పట్టించుకోని ప్రభుత్వం ఉప ఎన్నిక వస్తోందని తెలియగానే, అక్కడి ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చక తప్పదు. ఈ విధంగా ఈటల రాజీనామా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడనుందని సెటైర్లు వేసుకుంటున్నారు ఈటల వర్గీయులు. మరి అనుకున్నట్లుగానే జరుగుతుందా లేదా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వివక్షకు బాధితులు అవుతున్న ఇండియన్ అమెరికన్లు.. షాకింగ్ రిపోర్ట్..?

బుల్లి పిట్ట : ఇకపై జియో సెల్ ద్వారా ఫోన్ రీఛార్జ్..

నిజామాబాద్ లో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌.. !

వైరల్ న్యూస్ : కరోనా టీకా వేయించుకుంటే ఒంట్లో కరెంట్ పుడుతుందా.?

ఒంగోలులో పోటాపోటీగా వైసీపీ నేతల ఆనందయ్య మందు పంపిణీ!

బాలయ్యకి బాబు విషెస్..

మనీ : అంతర్జాతీయంగా అత్యంత సంపన్నులు.. పన్నుల చెల్లింపు వివరాలివే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>