PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/atchannaidu2b59c9d0-9e0d-4171-8a8d-09b32a20b122-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/atchannaidu2b59c9d0-9e0d-4171-8a8d-09b32a20b122-415x250-IndiaHerald.jpgఅచ్చెన్నాయుడు...ఏపీ టీడీపీకి అధ్యక్షుడు. అధ్యక్ష స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు ఎప్పుడు ఒకే రకమైన రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యాక చంద్రబాబుకు, సొంత పార్టీ లీడర్ల మద్ధతు చాలా తక్కువైపోయిన విషయం తెలిసిందే. జగన్ దెబ్బకు చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయారు. కానీ అచ్చెన్నాయుడు మాత్రం నిత్యం బాబుకు సపోర్ట్‌గా నిలుస్తూనే వచ్చారు.atchannaidu{#}Telugu Desam Party;ATCHANNAIDU KINJARAPU;CBN;TDP;Andhra Pradesh;Jagan;Partyఅచ్చెన్న ఎప్పుడు చూసిన అదే పనా...బోర్ కొట్టదా?అచ్చెన్న ఎప్పుడు చూసిన అదే పనా...బోర్ కొట్టదా?atchannaidu{#}Telugu Desam Party;ATCHANNAIDU KINJARAPU;CBN;TDP;Andhra Pradesh;Jagan;PartyThu, 10 Jun 2021 01:00:00 GMTఅచ్చెన్నాయుడు...ఏపీ టీడీపీకి అధ్యక్షుడు. అధ్యక్ష స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు ఎప్పుడు ఒకే రకమైన రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యాక చంద్రబాబుకు, సొంత పార్టీ లీడర్ల మద్ధతు చాలా తక్కువైపోయిన విషయం తెలిసిందే. జగన్ దెబ్బకు చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయారు. కానీ అచ్చెన్నాయుడు మాత్రం నిత్యం బాబుకు సపోర్ట్‌గా నిలుస్తూనే వచ్చారు.


అలాగే జగన్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే మధ్యలో అచ్చెన్న ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో జైలుకెళ్లి బెయిల్ మీద బయటకొచ్చారు. బయటకొచ్చాక అచ్చెన్నకు చంద్రబాబు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇక అధ్యక్ష స్థానంలోకి వచ్చాక అచ్చెన్నాయుడు ఏం చేయాలి....పార్టీని బలోపేతం చేయాలి. ఎక్కడికక్కడ నాయకులని యాక్టివ్ చేసి, వైసీపీకి ధీటుగా పనిచేసేలా చేయాలి. 175 నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌ని కాపాడుకుంటూ, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. పార్టీలోకి యువతని తీసుకురావాలి...ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రావడానికి అచ్చెన్న బాగా కష్టపడాలి.


కానీ ఇవేమీ అచ్చెన్న చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక, అచ్చెన్న చేస్తున్న ఒకే పని, జగన్‌పై విమర్శలు చేయడం. ఆ రోజు, ఈరోజు అనే తేడా లేకుండా నిత్యం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా అచ్చెన్న ముందుకెళుతున్నారు. ఇలా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం పక్కనబెట్టేసి ఎంతసేపు జగన్‌పై విమర్శలు చేయడం వల్ల ప్రజలకు కూడా బోర్ కొడుతుంది.


పైగా నిత్యం విమర్శలు చేయడం వల్ల జగన్‌పై సానుభూతి పెరుగుతుంది. అది తెలుగుదేశం పార్టీకి లాభం జరగడం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇప్పటినుంచైనా అచ్చెన్న తన వర్షన్ మార్చుకుని, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడితే బెటర్. లేదంటే అచ్చెన్న ఎప్పుడు చూసిన జగన్‌ని తిట్టే పనిలో ఉంటే, ప్రజలకు అచ్చెన్న బోర్ కొట్టేస్తారు. అలాగే పార్టీకి డ్యామేజ్ జరగడం ఖాయం. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటలపై నాన్చుడు అస్త్రం ప్రయోగించనున్న కేసీఆర్..?

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??

ఎన్టీఆర్ భారీ అంచనాలతో తీసిన సాంబ మూవీకి 17 ఏళ్ళు...

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>