MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli640c36e7-d577-4784-a597-08cd7776c5d5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli640c36e7-d577-4784-a597-08cd7776c5d5-415x250-IndiaHerald.jpgరాజమౌళి తన సినిమా కెరియర్ లో ఇప్పటివరకు ఏ సినిమాకు ఎదుర్కొనన్ని సమస్యలు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో ఎదుర్కుంటున్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని శాసించిన జక్కన్నతో కరోనా ఒక ఆట ఆడుకుంటోంది భారీ బడ్జెట్ భారీ తారాగణంతో ఉన్న సినిమా కావడంతో విడుదల తేదీలు మారుతూనే ఉన్నాయి.ఈ ఏడాది సంక్రాంతికి రావలసిన ఈమూవీ 2021 దసరా కు మారినా ఇంకా కరోనా థర్డ్ వేవ్ భయాల మధ్య ఉండటంతో ఈమూవీ విడుదల అయ్యేది 2022 సమ్మర్ కు అన్న అంచనాలు వస్తున్నాయి. వాస్తవానికి ఇదే విషయాన్ని రాజమౌళి తన టీం మెంబెర్స్ కు పరోక్షంగా చెప్RAJAMOULI{#}Dussehra;Makar Sakranti;Vijayadashami;Nijam;Rajamouli;Tollywood;News;Cinemaథర్డ్ వేవ్ భయాలతో రాజమౌళి కన్ఫ్యూజన్ !థర్డ్ వేవ్ భయాలతో రాజమౌళి కన్ఫ్యూజన్ !RAJAMOULI{#}Dussehra;Makar Sakranti;Vijayadashami;Nijam;Rajamouli;Tollywood;News;CinemaThu, 10 Jun 2021 09:00:00 GMTరాజమౌళి తన సినిమా కెరియర్ లో ఇప్పటివరకు ఏ సినిమాకు ఎదుర్కొనన్ని సమస్యలు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో ఎదుర్కుంటున్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని శాసించిన జక్కన్నతో కరోనా ఒక ఆట ఆడుకుంటోంది భారీ బడ్జెట్ భారీ తారాగణంతో ఉన్న సినిమా కావడంతో విడుదల తేదీలు మారుతూనే ఉన్నాయి.

ఈ ఏడాది సంక్రాంతికి రావలసిన ఈమూవీ 2021 దసరా కు మారినా ఇంకా కరోనా థర్డ్ వేవ్ భయాల మధ్య ఉండటంతో ఈమూవీ విడుదల అయ్యేది 2022 సమ్మర్ కు  అన్న అంచనాలు వస్తున్నాయి. వాస్తవానికి ఇదే విషయాన్ని రాజమౌళి తన టీం మెంబెర్స్ కు పరోక్షంగా చెప్పినట్లు  తెలుస్తోంది.

రాబోతున్న జూలై నుంచి షూటింగ్ లు మొదలైతే 2022 సంక్రాంతికి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కావడం  పెద్ద కష్టమేమీ కాదు. ఈ విషయంలో రాజమౌళి సుముఖంగా లేడని వార్తలు వస్తున్నాయి. దీనికి స్పష్టమైన కారణం తెలియపోయినప్పటికీ తన మనసులో మాత్రం రాజమౌళి ఈ సినిమాను 2022 సమ్మర్ కు ప్లాన్ చేస్తున్నాడు అని అంటున్నారు.  

సంక్రాంతికి ‘ఆర్ ఆర్ ఆర్’ ను విడుదల చేస్తే అదే సమయానికి కరోనా థర్డ్ వేవ్ వస్తే మళ్ళీ  ఉవ్యవహారం మొదటికి వస్తుందని అందుకే ఏకంగా సమ్మర్ కు ప్రిపేర్ కావడం మంచిదని రాజమౌళి ఆలోచన. కరోనా రెండో దశ విషయంలో పరిశొధకుల మాటలు అక్షరాలా నిజం అయ్యాయి. కాబట్టి థర్డ్ వేవ్ విషయంలో కూడ అంచనాలు నిజం అయితే అసలుకు మోసం వస్తుందని రాజమౌళి భావన అని తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా కొంతమంది శాస్త్రవేత్తలు కరోన థర్డ్ వేవ్ వస్తుంది అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు అని చెపుతున్న పరిస్థితులలో ఎటు తేల్చుకోలేని కన్ఫ్యూజన్ లో రాజమౌళి ఉన్నట్లు టాక్. ఇదే జరిగితే సంక్రాంతి సినిమాల రేస్ లో చాల టాప్ హీరోల సినిమాలకు లైన్ క్లియర్ అయ్యే ఆస్కారం ఉంది..  






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సెంటర్ ఏదైనా స్లోగన్ ఒక్కటే..జై బాలయ్య! జై జై బాలయ్య !!

బాలయ్య బర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా..

నేడు సూర్య‌గ్ర‌హ‌ణం...భార‌త్ పై ఎలాంటి ప్ర‌భావం ఉంటుంది..?

జూన్ 10వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

ఈటలపై నాన్చుడు అస్త్రం ప్రయోగించనున్న కేసీఆర్..?

విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>