MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahasamudram02b52ad6-3e38-4028-bf49-30f492ce34ed-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahasamudram02b52ad6-3e38-4028-bf49-30f492ce34ed-415x250-IndiaHerald.jpgతెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమాల్లో ‘మహాసముద్రం’ ఒకటి. ఈ సినిమాతో చాలా కాలం తరువాత సిద్దార్థ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరో శర్వానంద్ నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ పక్కా యాక్షన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో సిద్దార్థ విలన్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ ఉంది. కానీ ఇందులో..mahasamudram{#}ajay;jagapati babu;rao ramesh;siddhartha;Tamil;Yevaru;anil music;News;Hero;Posters;Cinemaమహాసముద్రం మళ్ళీ సెట్స్‌పైకి..అనుకున్నట్లే..?మహాసముద్రం మళ్ళీ సెట్స్‌పైకి..అనుకున్నట్లే..?mahasamudram{#}ajay;jagapati babu;rao ramesh;siddhartha;Tamil;Yevaru;anil music;News;Hero;Posters;CinemaThu, 10 Jun 2021 18:02:00 GMTసిద్దార్థ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరో శర్వానంద్ నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ పక్కా యాక్షన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో సిద్దార్థ విలన్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ ఉంది. కానీ ఇందులో శర్వానంద్, సిద్దార్థ పాత్రలపై క్లారిటీ రాలేదు. ఎవరు నెగిటివ్ రోల్ చేస్తున్నారు, ఎవరు హీరోగా నటిస్తున్నారన్నది తేలాలంటే మరింత సమయం ఆగాల్సిందే.
అయితే ఈ సినిమా చిత్రీకరణ కరోనా రెండో వేవ్ కారణంగా ఆగిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. వాస్తవానికి ‘మహాసముద్రం’ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కరోనా మళ్లీ విజృంభించడంతో చిత్రీకరణకు బ్రేకులు పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ విషయంలో ఓ వార్త సినీ వర్గాల్లో తెగ వినిపిస్తోంది. ఇప్పటికే కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సినిమా చిత్రీకరణను కుదిరినంత త్వరగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా ఒక్కసారి ఈ సినిమా షూటింగ్ మొదలైతే శరవేగంతో పూర్తి చేసి చెప్పిన డేట్‌కే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కానీ ఇప్పటి వరకు ‘మహాసముద్రం’ షూటింగ్ రీస్టార్ట్ గురించి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఏమైనా ప్రకటిస్తారేమో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే ఈ సినిమాను అజయ్ భూపతి దర్వకత్వంలో యాక్షన్ డ్రామాగా అనిల్ సుంకర, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అదితిరావు హయాడ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు ‘చుంచుమామ’ పాత్రలో, రావు రమేష్ ‘గూని బాబ్జి’గా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ‘మహాసముద్రం’ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ వైవిధ్యంగా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షించాయి. మరి ఈ సినిమా అనుకున్న సమయానికే వస్తుందా రాదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


బాలయ్య ఫ్యాన్స్ కి ఎన్నడూ గుర్తుండిపోయే సినిమాలు ఇవే..

తారక్ వ్యక్తిత్వంపై ఆ విలన్ సంచలన వ్యాఖ్యలు..?

బాలయ్య బాబు ఫ్యాన్సా మజాకా...దాన్ని కూడా వదలట్లేదుగా!

భారత గడ్డపై ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయిస్తున్న ప్రజ్ఞాశాలి..

హీరో రిషి ల‌వ్ స్టోరీ ఆ రోజు స్టార్ట్ అయిందంట‌!

ఎన్టీఆర్ సినిమాలో వినాయక్ కి నచ్చని సన్నివేశం ఏదో తెలుసా..?

సిద్దమవుతున్న ఎనిమి.. భారీగా ఆఫర్లు..?

ఫ్యాన్స్‌కి సూర్య నగదు సాయం.. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారంటే..?

పూరి మీద కన్నేసిన కరణ్ జోహార్... ఇంకో సినిమా ఫిక్స్ అంట!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>