PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sarath-pawar-gave-a-sweet-warning-to-shiv-senae876bd6e-004a-4752-8048-1258cabfef8f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sarath-pawar-gave-a-sweet-warning-to-shiv-senae876bd6e-004a-4752-8048-1258cabfef8f-415x250-IndiaHerald.jpgమహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఇటీవల ప్రధాని మోడీతో భేటి అయిన విషయం తెలిసిందే. ఈ వార్త మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం కూడా అయింది. శివసేన పార్టీ బీజేపీతో జతకట్టేందుకే ఉద్దవ్, మోడీ భేటీ అయ్యారా అని, ఎన్‌సీపీ నేతలకు శివసేనకు అంతర్గత కలహాలు ఏమైనా వచ్చాయా అన్న సందేహాలు కూడా వచ్చాయి. అదే సమయంలో తాను నవాజ్..modi{#}Indira Gandhi;Sharad Pawar;Uddhav Thackeray;Maharashtra;Shiv Sena;Congress;Prime Ministerశివసేన మాట తప్పదు.. గతాన్ని గుర్తుచేసిన శరద్ పవార్..శివసేన మాట తప్పదు.. గతాన్ని గుర్తుచేసిన శరద్ పవార్..modi{#}Indira Gandhi;Sharad Pawar;Uddhav Thackeray;Maharashtra;Shiv Sena;Congress;Prime MinisterThu, 10 Jun 2021 18:09:04 GMTముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఇటీవల ప్రధాని మోడీతో భేటి అయిన విషయం తెలిసిందే. ఈ వార్త మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం కూడా అయింది. శివసేన పార్టీ బీజేపీతో జతకట్టేందుకే ఉద్దవ్, మోడీ భేటీ అయ్యారా అని, ఎన్‌సీపీ నేతలకు శివసేనకు అంతర్గత కలహాలు ఏమైనా వచ్చాయా అన్న సందేహాలు కూడా వచ్చాయి. అదే సమయంలో తాను నవాజ్ షరీఫ్ దగ్గరికి వెళ్లలేదని, ప్రధాని మోడీ వద్దకే వెళ్లానని ఉద్దవ్ అనడం, వెంటనే దానిపై శివసేన అధికారిక పత్రిక వివరణ ఇవ్వడం జరిగాయి.

అయితే తాజాగా ఉద్దవ్, మోడీ భేటిపై ఎన్‌సీపీ నేత శరద్ పవార్ స్పందించారు. ఈ విషయంపై మాట్లాడిన శరద్ పవార్ శివసేనకు గతాన్ని గుర్తుచేశారు. ‘ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇందిరా గాందీపై కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తి కనబరిచారు. ఆ సమయంలో శివసేన వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు బాల థాకరే అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రధాని ఇందిరా గాంధీకి ఓ మాట ఇచ్చారు. తాను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీ చేయనని ఆయన అన్నారు. ఆ మాటను శివసేన తప్పలేదు. ఇప్పుడ కూడా శివసేన తన మాటను నిలబెట్టుకుంటుంది. ఇకపై కూడా ఆ మాటపైనే ఉంటుంది. ఈ ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వమే పరిపాలిస్తుంది. ఆ తరువాత కూడా శివసేన తమతోనే ఉంటుంద’ని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.


అయితే శరద్ పవార్ వ్యాఖ్యలు వింటే శివసేన పార్టీకి గతాన్ని గుర్తు చేసి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు అర్థం అవుతోంది. ఉద్దవ్, మోడీ భేటీ కారణంగా తమ పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లదని శరద్ తేల్చి చెప్పారు. అంతేకాకుండా మహారాష్ట్రలో శివసేన తమ పార్టీని ఎన్నటికి విడిచి పెట్టదని, ఈ ఐదేళ్ళ తరువాత కూడా తమ పార్టీలు రెండు కలిసే ఉంటాయని శరద్ పవార అన్నారు.



నా శవం కూడా ఆ పార్టీలో చేర‌దు!

మోదీ పదవికి గండమే ... నెక్స్ట్ పీఎం అతనే ?

ఆర్డర్లు,డెలివరీలే కాదు.. వాక్సినేషన్ లో కూడా అమెజాన్ అదే స్పీడ్?

శ్రీకాంత్ కి మరువలేని సాయం చేసిన బాలకృష్ణ..?

మళ్ళీ పాత ట్రిక్స్ మొదలు పెట్టిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్!

బెంగాల్ లో షాకిచ్చిన ఆకర్ష్.. యూపీలో కలిసొస్తుందా..?

టీకా ప్రక్రియపై జాతీనుద్దేశించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అనేక అబద్దాలు చెప్పారన్న విమర్శలు వస్తున్నాయి. తన లోపాలు కప్పిపుచ్చుకునేందుకు ఆయన భారతీయ టీకా చరిత్రనే మార్చేశారన్న విమర్శలు వస్తున్నాయి.

వ్యాక్సీన్లపై మోడీ దేశానికి అబద్దాలు చెప్పారా..?

రాహుల్ గాంధీ బీజేపీలోకి కోవర్టులను పంపుతున్నాడా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>