PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagand9c6a96c-464b-4467-add3-eae7f5bb9902-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagand9c6a96c-464b-4467-add3-eae7f5bb9902-415x250-IndiaHerald.jpgఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న‌ కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్, ప్రకాష్‌ జవడేకర్‌లతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో జ‌గ‌న్ చర్చలు జ‌రిపారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ముఖ్య‌మంత్రి విస్తృత చర్చ జ‌రిపిన‌ట్టు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాల్సిన‌ అంశాన్ని గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఎదుట పునరుద్ఘాటించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పోలవరంcm jagan{#}Delhi;Rajahmundry;polavaram;Telangana Chief Minister;Polavaram Project;CM;central government;Juneకేంద్ర మంత్రులకు జగన్ విజ్ఞప్తులు ఇవే... ఇప్పటి వరకు ఎవరెవరిని కలిసినట్టు...?కేంద్ర మంత్రులకు జగన్ విజ్ఞప్తులు ఇవే... ఇప్పటి వరకు ఎవరెవరిని కలిసినట్టు...?cm jagan{#}Delhi;Rajahmundry;polavaram;Telangana Chief Minister;Polavaram Project;CM;central government;JuneThu, 10 Jun 2021 18:01:23 GMTఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న‌ కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్, ప్రకాష్‌ జవడేకర్‌లతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో జ‌గ‌న్ చర్చలు జ‌రిపారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ముఖ్య‌మంత్రి విస్తృత చర్చ జ‌రిపిన‌ట్టు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాల్సిన‌ అంశాన్ని గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఎదుట పునరుద్ఘాటించినట్టు తెలుస్తోంది. అంతే  కాకుండా పోలవరం పీపీఏతోపాటు, కేంద్ర జలమండలి సిఫార్సులతోపాటు, కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహామండలి అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం....రూ. 55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని ముఖ్యమంత్రి కోరారు. 

2022 జూన్ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ–పునరావాస పనులను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలపాలని సీఎం కోరారు. జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం వాటర్‌ సప్లైని కూడా ఇరిగేషన్‌ ప్రాజెక్టులో భాగంగా చూడాలని సీయం జ‌గ‌న్ కేంద్ర మంత్రుల‌ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచి పోలవరం ప్రాజెక్టుకోసం ఖర్చు చేస్తున్నామని, జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్‌ చేయాలని ముఖ్య‌మంత్రి కోరారు.  రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్‌ వైజ్‌ ఎలిజిబిలిటీకి పరిమితం చేయవద్దని కోరారు. 2013 రైట్‌ టు ఫెయిర్‌ కాంపన్‌సేషన్, ట్రాన్స్‌పరెంటీ ఇన్‌ ల్యాండ్‌ అక్విజిషన్, రీహేబ్‌లిటేషన్‌ రీ సెటిల్‌మెంట్‌ చట్టం ప్రకారం పునరావాస పనులకు రీయింబర్స్‌ చేయాలని కూడా ముఖ్య‌మంత్రి కోరారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం తరలించాలని కూడా ముఖ్య‌మంత్రి కోరారు. హైదరాబాద్‌లో ఇప్పుడు సచివాలయ కార్యకలాపాలు లేవని, ప్రాజెక్టు పర్యవేక్షణ, పరిశీలన కోసం సుదూరంలో ఉన్న హైదరాబాద్‌ నుంచి రావడం కష్టం అవుతోందని, అందుకే పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాల‌ని కోరారు. అంతకు ముందు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టులో స్టాకింగ్‌ పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల్లో చిన్న చిన్న అంశాలు మిగిలిపోయాయని వెంటనే పరిష్కరించాలని కోరారు.



ఉత్తర కొరియా అధ్యక్షుడు "కిమ్ జాంగ్" కి అనారోగ్యం ... సాక్ష్యమిదే ?

బాలయ్య ఫ్యాన్స్ కి ఎన్నడూ గుర్తుండిపోయే సినిమాలు ఇవే..

వృద్ధుల‌కు ఆధార్ లేకుండా టీకా వేస్తాం: ఏపీ

సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్, ప్రకాష్‌ జవడేకర్‌లతో సమావేశం అయ్యారు.

ఆ ఎమ్మెల్యేలని జగన్ లైన్‌లో పెట్టాల్సిందేనా!

భారత గడ్డపై ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయిస్తున్న ప్రజ్ఞాశాలి..

"నీట్‌" పై త‌మిళ రాజ‌కీయం

తెలంగాణ‌లో స్కూళ్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. !

జ‌గ‌న్ అవ్వాతాత‌ల‌కు ఇస్తాన‌న్న డ‌బ్బులేవి..? - ఎంపీ ర‌ఘురామ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>