PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan7504ee23-0d93-4d87-8e05-636f8fcc19f9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan7504ee23-0d93-4d87-8e05-636f8fcc19f9-415x250-IndiaHerald.jpgజగన్ సైలెంట్ గా ఉంటారు. కానీ ఆ మౌనంలోనే ఎన్నో వ్యూహాలకు పదును పెడతారు. మరి జగన్ చాణక్యం ఏ స్థాయిలో లేకపోతే ఏపీలో చంద్రబాబుని విపక్షంలోకి నెట్టగలిగారు. అందువల్ల జగన్ ఆలోచనలను ఎవరూ తక్కువ అంచనా వేయడంలేదు. jagan{#}Jaganజగన్ తేల్చాల్సినవి చాలా ఉన్నాయి... ?జగన్ తేల్చాల్సినవి చాలా ఉన్నాయి... ?jagan{#}JaganWed, 09 Jun 2021 19:58:30 GMTజగన్ సైలెంట్ గా ఉంటారు. కానీ ఆ మౌనంలోనే ఎన్నో వ్యూహాలకు పదును పెడతారు. మరి జగన్ చాణక్యం ఏ స్థాయిలో లేకపోతే ఏపీలో చంద్రబాబుని విపక్షంలోకి నెట్టగలిగారు. అందువల్ల జగన్ ఆలోచనలను ఎవరూ తక్కువ అంచనా వేయడంలేదు.

ఆయన గుంభనంగా ఉంటారు. బయటకు ఎక్కువగా మాట్లాడరు. దాంతో జగన్ మీద అంతా విమర్శలు చేస్తూంటారు. ఇదిలా ఉంటే చాలా కాలం తరువాత జగన్ ఢిల్లీ టూర్ కి వెళ్తున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన అంటే దాని మీద ఎన్నో కధనాలు. ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదో కూడా తెలియనంతగా అవి ఉంటాయి.

జగన్ ఢిల్లీలో ల్యాండ్ అయిన దగ్గర నుంచి ఆయన పక్కనే ఉండి అన్నీ చూసినట్లుగా రాసేసే వారూ ఉన్నారు. తమకు తోచినట్లుగా వార్తలు వండేసి నెగిటివ్ గా ఫోకస్ చేసే వారూ ఉన్నారు. ఇక జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అంటే బెయిల్ రద్దు పిటిషన్ మీద చర్చించడానికి అంటూ అపుడే కధనాలు మొదలైపోయాయి. జగన్ రఘు రామ క్రిష్ణం రాజు విషయంలో కూడా ఏదో ఒకటి గట్టిగా తేల్చుకుంటారు అన్న వారూ ఉన్నారు.

మరో వైపు జగన్ బీజేపీతో రాజకీయ బంధాలను కాపాడుకోవడానికి, తన పైన ఉన్న కేసుల నుంచి బయటపడడానికి అంటూ కూడా ఆయన వ్యతిరేక మీడియా కధనాలు రాస్తోంది. మరి ఇవన్నీ పక్కన పెడితే ఒక రాష్ట్ర అధినేతగా జగన్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కలవడం మంచిదే కదా. అదే సమయంలో ఆయన ఏపీకి ఏ మాత్రం మేలు చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చినా కూడా మంచిదే కదా.  తటస్థులలో ఈ రకమైన ఆలోచనలు ఉన్నాయి.

అయితే ఎంత చెప్పుకున్నా జగన్ ఒక రాజకీయ పార్టీ అధినేత. అందువల్ల జగన్ ఢిల్లీ టూర్ లో స్వామి కార్యం, స్వకార్యం ఉంటాయని అనే వారూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టునకు నిధులతో పాటు, ఆర్ధికంగా కునారిల్లిన ఏపీని ఆదుకోమని కేంద్ర పెద్దలను కోరే అవకాశం ఉంది అంటున్నారు. అదే సమయంలో జగన్ తనను ఏడాదికి పైగా వేధిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు వ్యవహారం తేల్చేస్తారు అన్నది మాత్రం గట్టిగా వినిపిస్తోంది. రెండేళ్ళుగా ఏ ఒక్క ప్రతిఫలం ఆశించకుండా బీజేపీకి జగన్ మద్దతు ఇస్తున్నారు. మరి దాని కోసమైనా రెబెల్ ఎంపీ మీద యాక్షన్ ఉంటుందని వైసీపీ నేతలు ఆశిస్తున్నారు. జగన్ ఢిల్లీ టూర్ ఈసారి చాలా ప్లాన్డ్ గానే సాగనుందిట. మరి జగన్ ఏ రకమైన విజయాలతో తిరిగి వస్తారో చూడాలి. ఆయన లెక్కలు అన్నీ తేల్చుకుంటే ఇక ఏపీలో విపక్షం ఎన్ని విమర్శలు చేసినా లాభం లేనట్లే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ రెండు కంపెనీల మీద సీబీఐ కేసులు!

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??

ఎన్టీఆర్ భారీ అంచనాలతో తీసిన సాంబ మూవీకి 17 ఏళ్ళు...

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>