MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rashmi--sudheer-movie-gossip33b7cc6c-c158-4963-81a6-5e35594b976e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rashmi--sudheer-movie-gossip33b7cc6c-c158-4963-81a6-5e35594b976e-415x250-IndiaHerald.jpgసినీ నటి, బుల్లి తెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కి అనూహ్యంగా ఓ సినిమా ఆఫర్ వచ్చిందట. కథ విన్న ఆమె తన కెరీర్ కి చాలా ప్లస్ అవుతుందని భావించి వెంటనే ఓకె చెప్పేసిందట. అది ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రమని తెలుస్తోంది. అందరినీ పోగొట్టుకుని ఒంటరైన ఓ మహిళ ఈ సమాజంలో జరిగే అన్యాయాలను ఎలా ఎదిరించి పోరాడింది.RASHMI - SUDHEER MOVIE GOSSIP{#}sudigali sudheer;Cinema;rashmi gautham;Success;Rashami Desai;Yuva;Romantic;Silver;Teluguరష్మీ - సుధీర్ జంటగా మూవీ ? ఫ్యాన్స్ కు పండగే ?రష్మీ - సుధీర్ జంటగా మూవీ ? ఫ్యాన్స్ కు పండగే ?RASHMI - SUDHEER MOVIE GOSSIP{#}sudigali sudheer;Cinema;rashmi gautham;Success;Rashami Desai;Yuva;Romantic;Silver;TeluguWed, 09 Jun 2021 11:00:00 GMTసినీ నటి, బుల్లి తెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కి అనూహ్యంగా ఓ సినిమా ఆఫర్ వచ్చిందట. కథ విన్న ఆమె తన కెరీర్ కి చాలా ప్లస్ అవుతుందని భావించి వెంటనే ఓకె చెప్పేసిందట. అది ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రమని తెలుస్తోంది. అందరినీ పోగొట్టుకుని ఒంటరైన ఓ మహిళ ఈ సమాజంలో జరిగే అన్యాయాలను ఎలా ఎదిరించి పోరాడింది. అందుకు ఆమెపై ప్రత్యర్ధులు ఎలా దాడికి దిగారు. వారిని ఎదిరించి ఎలా నిలబడి ఈ సమాజానికి ఆదర్శంగా నిలిచింది అన్నది కథగా ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే రష్మీ కెరీర్ కి మంచి బ్రేక్ త్రూ ఇస్తుందని అంటున్నారు.

అయితే ఓ యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టగానే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారట.  ఇందులో సుడిగాలి సుధీర్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ సుధీర్ ఎంట్రీ సెకండ్ హాఫ్ లో ఉండబోతున్నట్లు టాక్. సుధీర్ ది కథను మలుపు తిప్పే కీ రోల్ అట. మరి  ఈ సినిమా విషయంలో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇది ఇలా ఉంటే బుల్లితెర రొమాంటిక్ లవ్ బర్డ్స్ రష్మీ, సుధీర్ ల జంట వెండి తెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. నిజానికి రష్మీ, సుధీర్ ల కాంబినేషన్ లో సినిమా  కోసం  ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. అలాంటిది వీరి కాంబోలో మూవీ వస్తే తప్పక సక్సెస్ అవుతుంది అన్న అంచనాలు ఉన్నాయి.
జబర్దస్త్ షోతో ఎంతగానో పాపులర్ అయిన ఈ  జంట, వెండితెరపై కూడా సందడి  చేసి,  మెస్మరైజ్ చేయాలని తెలుగు ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.  బిగ్ స్క్రీన్ పై కూడా వీరి జంట కనువిందు చేయాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వండర్ ఉమెన్: 10 మందికి జననం..ఎక్కడంటే..?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్

డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!

జూన్ 9వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>