MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-movie-music-hitcc4f8262-6e99-4dc3-9b42-3831962ffb84-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-movie-music-hitcc4f8262-6e99-4dc3-9b42-3831962ffb84-415x250-IndiaHerald.jpgమణిరత్నం దర్శకత్వంలో 1992లో కె.బాలచందర్ నిర్మించిన చిత్రం రోజా. ఈ సినిమాలో కథానాయకులుగా అరవిందస్వామి , మధు కలసి రొమాంటిక్ అండ్ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అప్పట్లో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. తమిళనాడులో మారుమూల ప్రాంతానికి చెందిన రోజా అనే అమ్మాయి, రిషికుమార్ ను వివాహం చేసుకుంటుంది. ఇక వృత్తి రీత్యా రిషి కుమార్ రోజా ని తీసుకొని ఢిల్లీ కి వస్తారు. అలా ఒకరోజు రిషి కుమార్ ను జమ్మూ కాశ్మీర్ లో రహస్య మిషన్ లో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన తర్వాత తROJA MOVIE MUSIC HIT{#}Mani Ratnam;Chitram;Cinema;Romantic;Thriller;Roja;Kumaar;Delhi;Jammu and Kashmir - Srinagar/Jammu;Terrorists;savitri;Savithri;satya;prakruti;Girl;Wife;Sangeethaమధురమైన గానంతో మనసుకు హత్తుకున్న రోజా..మధురమైన గానంతో మనసుకు హత్తుకున్న రోజా..ROJA MOVIE MUSIC HIT{#}Mani Ratnam;Chitram;Cinema;Romantic;Thriller;Roja;Kumaar;Delhi;Jammu and Kashmir - Srinagar/Jammu;Terrorists;savitri;Savithri;satya;prakruti;Girl;Wife;SangeethaWed, 09 Jun 2021 10:00:00 GMT
మణిరత్నం దర్శకత్వంలో 1992లో  కె.బాలచందర్ నిర్మించిన చిత్రం రోజా. ఈ సినిమాలో కథానాయకులుగా అరవిందస్వామి , మధు కలసి రొమాంటిక్ అండ్ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అప్పట్లో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


తమిళనాడులో మారుమూల ప్రాంతానికి చెందిన రోజా అనే అమ్మాయి, రిషికుమార్ ను వివాహం చేసుకుంటుంది. ఇక వృత్తి రీత్యా రిషి కుమార్ రోజా ని తీసుకొని ఢిల్లీ కి వస్తారు. అలా ఒకరోజు రిషి కుమార్ ను జమ్మూ కాశ్మీర్ లో రహస్య మిషన్ లో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన తర్వాత తన భర్తను వెతకడానికి తీరని ప్రయత్నాలు చేస్తుంది రోజా. ఈ సినిమా మహా భారత ఇతిహాసము అయినా సావిత్రి మరియు సత్య వాన్ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఆధారంగా తెరకెక్కింది.

ఈ చిత్రం స్టోరీ పరంగా మంచి సంచలన విజయాన్ని అందుకుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఏ ఆర్ రెహమాన్ అద్భుతంగా సంగీతాన్ని అందించారు. చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ.. అంటూ ప్రకృతి అందాలను వర్ణిస్తూ అద్భుతంగా గానామృతం చేశారు. ఒక అమ్మాయి  ప్రపంచంలోకి అడుగు పెట్టి, ఆ ప్రపంచ అందాలను చూసి ఎలా మురిసిపోయింది అనేది ఈ పాట సారాంశం. ఇక మరొక పాట పరువం వానగా.. నేడు విరిసేనులే.. అంటూ కాశ్మీర్ అందాలను చూపిస్తూ, ఒక భార్య భర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని వానజల్లు లతోనూ, సముద్రపు అలలతో, నదీ ప్రవాహం తోనూ చక్కగా తెరకెక్కించారు.

నా చెలి రోజావే.. ఈ పాట రిషి కుమార్ కోసం రోజా వెతుకులాటలో ఉన్నప్పుడు ఒకరికొకరు తలచుకొని వారి మనసులో ఉన్న భావాలను వ్యక్త పరుస్తారు. ముఖ్యంగా ఈ మూడు పాటలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అంతేకాకుండా ఉత్తమ సంగీత దర్శకుడిగా 1993లో ఏ ఆర్ రెహమాన్ సిల్వర్ లోటస్ అవార్డును అందుకోవడం తో పాటు ఉత్తమ గేయ రచయితగా వైరముత్తు కూడా ఇదే అవార్డును గెలుపొందారు. అలాగే నేషనల్ అవార్డులతో పాటు ఫిలింఫేర్ అవార్డులు రాష్ట్ర అవార్డు లు కూడా అందుకుంది ఈ చిత్రం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్

డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!

జూన్ 9వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

వైరల్ వీడియో! నీళ్లలో కూల్ గా రిలాక్స్ అవుతున్న పాండాలు ..

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>