WinnersVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe-7308e3b1-b893-4c84-874c-621831bf1acf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe-7308e3b1-b893-4c84-874c-621831bf1acf-415x250-IndiaHerald.jpgచాలా మంది తమ జీవితంలో ఏదో గుర్తింపు కావాలని, పది మంది ముందు గొప్పగా బతకాలని తహతహలాడుతుంటారు. ఆర్థికంగా బాగుండాలని, జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండకూడదని కోరుకుంటూ ఆ భాగ్యం తమకు లేదని బాధపడుతుంటారు. అయితే సంపదలు, ధన ధాన్యాలు ఇలా అనుకోగానే అలా ప్రత్యక్షమయ్యేవి కాదు.VIJAYAM MEEDHE {#}Manamవిజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?విజయం మీదే: డబ్బు గౌరవాన్ని ఇస్తుందా ?VIJAYAM MEEDHE {#}ManamWed, 09 Jun 2021 21:00:00 GMTచాలా మంది తమ జీవితంలో ఏదో గుర్తింపు కావాలని, పది మంది ముందు గొప్పగా బతకాలని తహతహలాడుతుంటారు. ఆర్థికంగా బాగుండాలని,  జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండకూడదని కోరుకుంటూ ఆ భాగ్యం తమకు లేదని బాధపడుతుంటారు. అయితే సంపదలు, ధనధాన్యాలు ఇలా అనుకోగానే అలా ప్రత్యక్షమయ్యేవి కాదు. అందుకు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది.  ఎంతగానో శ్రమించి  సంపాదించాల్సి ఉంటుంది. అయినా ఇవన్నీ ఒక్క రోజులోనో  ఒక నెలలోనో దక్కేవి కావు. ఇందుకు ఒక చక్కటి ప్రణాళిక అవసరం. ఉదాహరణకు.. మీరు ఒక వ్యాపారం ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని అనుకుంటే, చేయబోయే వ్యాపారం ఎత్తు పల్లాలు అన్నింటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

ప్రస్తుతం ఆ వ్యాపారం చేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి.  వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో శ్రమిస్తే కానీ అనుకున్న స్థాయికి చేరుకోలేరు. ఆ విధంగా మీరు అనుకున్న దానిపై లేదా స్థిరపడాలనుకున్న రంగంలో గట్టిగా ప్రయత్నం చేయాలి. ఈ మధ్యలో ఎన్నో కస్టాలు కలగొచ్చు. అడ్డంకులు ఎదురు కావొచ్చు. వాటికీ మీరు భయపడి వెనక్కు తగ్గకుండా ఉండాలి. ఇలా మీరు కోరుకున్న రంగంలో డబ్బులు సంపాదిస్తారు. అలాగని డబ్బే జీవితం కాదు. ఆర్థికంగా బాగుంటేనే అందరూ గౌరవిస్తారు అనుకోవడం అమాయకత్వం.

మన  సత్ప్రవర్తన మనం చేసే మంచి పనులే ఈ సమాజం ముందు మనల్ని గొప్ప వాళ్ళుగా మారుస్తాయి.  ఈ సమాజంలో గొప్పగా బ్రతకాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ గొప్పతనం డబ్బుతోనే వస్తుందనుకోవడం పొరపాటు. కాబట్టి ఉన్న జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి  ప్రయత్నించడం ఉత్తమం. అలా కాకుండా మనకు ఏమీ లేదని బాధపడుతూ ఇతరులతో పోల్చుకుని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. అలా ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ఏమీ సాధించలేరు. ఈ విషయాలన్నీ గ్రహించి ముందుకు సాగండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘుకు 14 రోజుల రిమాండ్‌

తూచ్ ... అదంతా ఉత్తదే .... అసలు మ్యాటర్ ఇదే .... ??

ఎన్టీఆర్ భారీ అంచనాలతో తీసిన సాంబ మూవీకి 17 ఏళ్ళు...

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>