QuotesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/mannchimaata9ddf6b1b-9272-493b-91d4-fc6fb1bc4b02-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/mannchimaata9ddf6b1b-9272-493b-91d4-fc6fb1bc4b02-415x250-IndiaHerald.jpgజీవితంలో ప్రతి ఒక్కరూ స్వతహాగా పైకి ఎదగాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అందుకు తగ్గట్టుగానే వారి ఆలోచనలను కార్యరూపం దాలుస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఇతరులను ఉదాహరణగా తీసుకొని తమ జీవితంలో పైకి ఎదగాలని అనుకుంటే , మరి కొంతమంది వ్యక్తిగతంగా ఎదగడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఇక మరి కొంతమందేమో ఏం చేయాలో తెలియక , ఎలా చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే , ముఖ్యంగా ఎవరైతే వ్యక్తిగతంగా జీవితంలో పైకి ఎదగాలని ఆలోచిస్తున్నారో, అలాంటి వారి కోసమే ఇప్పుడు కొన్ని సూత్రాలను మీ ముందుకు తీసుకువచ్చాము. మీ జీవMANNCHIMAATA{#}Yevaruమంచిమాట : జీవితంలో వ్యక్తిగతంగా ఎదగాలంటే ఏమి చేయాలి..?మంచిమాట : జీవితంలో వ్యక్తిగతంగా ఎదగాలంటే ఏమి చేయాలి..?MANNCHIMAATA{#}YevaruWed, 09 Jun 2021 14:00:00 GMT
జీవితంలో ప్రతి ఒక్కరూ స్వతహాగా పైకి ఎదగాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అందుకు తగ్గట్టుగానే వారి ఆలోచనలను కార్యరూపం దాలుస్తూ ఉంటారు. అయితే కొంతమంది  ఇతరులను ఉదాహరణగా తీసుకొని తమ జీవితంలో పైకి ఎదగాలని అనుకుంటే , మరి కొంతమంది వ్యక్తిగతంగా ఎదగడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఇక మరి కొంతమందేమో ఏం చేయాలో తెలియక , ఎలా చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే , ముఖ్యంగా ఎవరైతే వ్యక్తిగతంగా జీవితంలో పైకి ఎదగాలని ఆలోచిస్తున్నారో, అలాంటి వారి కోసమే ఇప్పుడు కొన్ని సూత్రాలను మీ ముందుకు తీసుకువచ్చాము. మీ జీవితంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే నిజమైన సూత్రాలు. అవేంటో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చదివి తెలుసుకుందాం..


1. మీరు ఏం చేయాలనుకుంటున్నారో నిర్మొహమాటంగా,  సూటిగా చెప్పేయండి. ఇలా చెప్పడం వల్లే మీరు ఏమనుకుంటున్నారో ఇతరులకు తెలుస్తుంది. తద్వారా మీ మార్గాలకు అడ్డు రాకుండా ఉంటారు.

2. ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చేయవద్దు. ఎవరో బాధ పడతారని , తప్పని తెలిసినప్పటికీ  అది చేయడం అది నేరం.

3. మీలో ఉన్న నైపుణ్యాన్ని మీరు పూర్తిగా నమ్మాలి. అప్పుడే మీ మీద మీకు పూర్తి విశ్వాసం కలుగుతుంది.

4. అందరూ ఆనందంగా ఉండే లాగా చూసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి నవ్వులు పంచాలి కానీ ఎదుటి వారికి చులకన అయ్యేలాగా ఉండకూడదు.

5. మీ గురించి మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకో కూడదు. అంతేకాదు ఇతరుల వద్ద కూడా మిమ్మల్ని మీరు కించపరచకుండా ఉండాలి.

6. లేదు.. కాదు.. అని చెప్పేందుకు మొహమాటం పడవద్దు. ఈ రెండు ఎప్పటికైనా మీరు జీవితంలో ఎదగడానికి సహాయ పడతాయి.

7. మీ కల ఏదైనప్పటికీ సహకారం చేసుకునే వరకు విడువకూడదు.

8. మీపై మీరు పూర్తిగా నమ్మకంతో ఉండాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్ముకుంటారో అప్పుడు జీవితంలో ఎదుగుతారు.

9. అందరిని మనసుతో స్వీకరించాలి.. బలవంతంగా కాదు. ఎవరు ఏమన్నా సరే మన వాళ్లే కదా అని సర్దుకుపోవాలి.


ఈ సూత్రాలను పాటించినట్లయితే వ్యక్తిగతంగానే కాకుండా  అందరిలోనూ గౌరవమర్యాదలు నిలుపుకోవచ్చు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్నటికీ చెరగని సంగీత కిరణం ఈ ‘స్వాతి కిరణం’

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>