SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality702d93df-0150-46d7-a7d2-61f3085dffd5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality702d93df-0150-46d7-a7d2-61f3085dffd5-415x250-IndiaHerald.jpgశనీశ్వరుడు ఈ సమస్త భూమండలంపై ఉన్న జీవుల కర్మలకు తగిన ప్రతిఫలాన్ని అందించే న్యాయ దేవుడిగా మన హిందూ ధర్మ శాస్త్రంలో చెప్పబడినది. ఈ ప్రపంచానికి వెలుగు పంచే సూర్యుడి యొక్క కుమారులైన శని దేవుడు మరియు యముడు ఇరువురు కూడా న్యాయ దేవుల్లే. SPIRITUALITY{#}dharmaశనిదేవుని ఇలా ప్రసన్నం చేసుకోండి ?శనిదేవుని ఇలా ప్రసన్నం చేసుకోండి ?SPIRITUALITY{#}dharmaWed, 09 Jun 2021 08:00:00 GMTధర్మ శాస్త్రంలో చెప్పబడినది. ఈ ప్రపంచానికి వెలుగు పంచే సూర్యుడి యొక్క కుమారులైన శని దేవుడు మరియు యముడు ఇరువురు కూడా న్యాయ దేవుల్లే. అయితే యముడు మరణాంతరం మనుషుల యొక్క కర్మలను బట్టి వారికి శిక్షలు విధిస్తారు. కానీ శనీశ్వరుడు మాత్రం మనిషి బ్రతికి ఉన్న సమయం లోనే వారి వారి కర్మలను బట్టి తగిన శిక్ష వేస్తారు. మంచి కర్మలకు సుఖ సౌఖ్యాలను అందించే ఇదే దేవుడు చెడు కర్మలకు తగిన శిక్షను విధిస్తాడు, హింసకు గురి చేసి నరకాన్ని చూపించే ఉగ్ర రూపాన్ని కలిగి ఉంటాడు. అందుకే మనుషులు చేసే ప్రతి కర్మను ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి. ముందు వెనక ఆలోచించి తప్పులు దొర్లకుండా ఇతరులకు నష్టం కలగకుండా నడుచుకోవాలి. ఇక శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు,చల్లని చూపు మన కుటుంబంపై ఉండేందుకు క్రింది మంత్రాలను జపించి  ముక్తి పొందగలరు.

 ఓం శం శనయేనమ
 ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః

 కోణస్ధః పింగళ బభ్రు: కృష్ణో రౌద్రంతకో యమ: సౌరి శనైశ్చరో మంద: పిప్పలాదేవ సంస్తుత:

నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం

ఓం సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష: శివప్రియ: మందచార: ప్రసనాత్మ పీడాం హరతుమే శని

శని జయంతి నాడు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ మంత్రాన్ని పఠించి శనీశ్వరుని దైవ భక్తితో పూజిస్తే శని యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. అంతే కాకుండా మీరు శని గృహాల చుట్టూ ప్రతి శని వారం ప్రదక్షిణలు చేయడం ద్వారా కూడా ఆ దేవుని ప్రసన్నం చేసుకోగలరు మరియు మీ కష్టాలను కూడా తొలగించుకోవచ్చు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోదీ చెప్పిన 'ఫ్రీ' విలువ@1.45 లక్షల కోట్లు.?

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>