SatireChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/jagan9a3e10f2-befe-4c28-82ab-55cefe514bac-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/jagan9a3e10f2-befe-4c28-82ab-55cefe514bac-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో అధికార పచ్చానికి ఎంత ప్రాధాన్యత ఉంటదో.. పెతి పచ్చానికి కూడా అంతే పాధాన్యత ఉంటదన్న సంగతి మీకు మా బాగా తెల్సు కదండే.. పతిపచ్చనేత అంటే.. ఏంజేయాల.. అధికార పార్టీని చెడుగుడు ఆడుకోవాల.. సీఎంను కూడా నువ్వెంత అంటే నవ్వెంతహే అంటూ సవాలు ఇసరాల. అధికారంలో ఉన్నోళ్లు సేత్తన్న తప్పులన్నీ విప్పి విప్చి సెప్పాల.. అంతేనా.. ఢీ అంటే ఢీ అంటూ సిద్దపడిపోవాల. ఇయన్నీ సేత్తేనే పతిపచ్చనేత అవుతారు.. మరి ఈ లెక్కన ఏపీలో పతిపచ్చ నేత ఎవరో తెలుసా.. రఘురామ కృష్ణంరోజు గోరే.. అదేంటి. ఆయన కూడా వైసీపీ ఎంపీయే కదా అనుకుంjagan{#}Narsapuram;YCP;Avunu;CM;king;Letter;Maha;Jaganసెటైర్ : నర్సాపురం రాజు గోరిని పతిపచ్చనేత సేసేత్తే పోలా..?సెటైర్ : నర్సాపురం రాజు గోరిని పతిపచ్చనేత సేసేత్తే పోలా..?jagan{#}Narsapuram;YCP;Avunu;CM;king;Letter;Maha;JaganWed, 09 Jun 2021 06:00:00 GMTరాజకీయాల్లో అధికార పచ్చానికి ఎంత ప్రాధాన్యత ఉంటదో.. పెతి పచ్చానికి కూడా అంతే పాధాన్యత ఉంటదన్న సంగతి మీకు మా బాగా తెల్సు కదండే.. పతిపచ్చనేత అంటే.. ఏంజేయాల.. అధికార పార్టీని చెడుగుడు ఆడుకోవాల.. సీఎంను కూడా నువ్వెంత అంటే నవ్వెంతహే అంటూ సవాలు ఇసరాల. అధికారంలో ఉన్నోళ్లు సేత్తన్న తప్పులన్నీ విప్పి విప్చి సెప్పాల.. అంతేనా.. ఢీ అంటే ఢీ అంటూ సిద్దపడిపోవాల. ఇయన్నీ సేత్తేనే పతిపచ్చనేత అవుతారు..

మరి ఈ లెక్కన ఏపీలో పతిపచ్చ నేత ఎవరో తెలుసా.. రఘురామ కృష్ణంరోజు గోరే.. అదేంటి. ఆయన కూడా వైసీపీ ఎంపీయే కదా అనుకుంతన్నారా.. అవును ఐతే నేం.. రాజుగోరిలా జగన్‌ ను నిలదేసే మొనగాడు ఎవరున్నారు సెప్పండి.. లెక్క పకారం అయితే  సెంద్రబాబే.. పతిపచ్చనేత.. ఆ సంగతి నాకూ తెలుసండోయ్.. కానీ ఇప్పుడు ఏపీలో సెంద్రబాబు కంటే ఎక్కువగా జగన్‌ను బయపెడతోంది రాజుగోరేనంట.

ఆ సీఎం జగన్ ఏం సేద్దారనుకుని ఆ రఘురామ కృష్ణంరాజును అరెస్టు సేసి.. కస్టడీలో ఏయించి.. అరికాళ్లన్నీ వాపులు వచ్చేలాగ.. వేళ్లు ఇరిగేలాగా కొట్టించాడో కానీ.. ఆ.. కొట్టించాడంటే కొట్టించాడని కాదు కానీ.. రాజుగోరికి మాత్రం దెబ్బలయితే తగిలాయి కదా.. ఆ మాట సికింద్రాబాద్ మిలిట్రీ ఆస్పటలు వాళ్లు కూడా సెప్పారు కదా.. అప్పటి నుంచి రాజు గోరు ఆట మొదలెట్టీసినారు.. రాజు గోరు తలుసుకుంటే దెబ్బ లకు కొదవా అన్నట్టు మాంచి ఫేమసు లాయర్లతో కేసులు ఏయించి.. మొత్తానికి బెయిల్ తెచ్చుకున్నారు.

ఇగ అప్పట్నుంచి సూసుకోండి రాజుగోరు.. విజృంభణ.. ఈ జగను నన్నే కొట్టిత్తాడా.. నాతోనే పెట్టుకుంటాడా అన్నట్టు మాంచి కసిగా డిల్లీలో కూకుని పావులు కదిపేత్తన్నారు. దేశంలోని గొప్పోళ్లందరికీ లేఖలు రాసేత్తన్నారు. ఈ జగను మహా కిరాతకుడండీ బాబో.. ఎంపీనని కూడా సూడకుండా కుమ్మేయించినాడు బాబో.. మీ దర్మం సెప్పాల.. నేయం సేయాల అంటూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేత్తన్నారు. జగన్ బెయిల్ రద్దు సేయించాలని పట్టు మీద ఉండాడు.. ఈ మొత్తం యవ్వారం సూత్తే.. అసలు రాజోరే ఆంధ్రా పతిపచ్చనేతగా కరెట్టు అనిపిత్తాంది నాకైతే.. మరి మీకో..?



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీటు విషయంలో పవన్‌కు క్లారిటీ లేదా? వాళ్ళ పరిస్తితి ఏంటి?

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>