PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chiana-elephents4b53561e-97a2-4a3a-878d-af4b3e6c15e4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chiana-elephents4b53561e-97a2-4a3a-878d-af4b3e6c15e4-415x250-IndiaHerald.jpgఅదో ఏనుగుల గుంపు.. ఎక్కడో అడవుల్లో ఉండే ఏనుగుల గుంపు.. కానీ ఇప్పుడది చైనా పాలకులను కన్ ఫ్యూజ్ చేస్తోంది. ఎందుకంటే.. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు గుంపు ఇప్పుడు అడవులు వదిలి నగరాల బాట పట్టాయి. ఏకంగా నగరాల బాట పట్టాయి. అంతే కాదు.. నిరంతరాయంగా పాదయాత్ర చేస్తున్నాయి. అదేంటి.. ఏనుగుల పాదయాత్ర ఏంటి అంటారా.. అవును ఇప్పుడు చైనాలో అదే జరుగుతోంది. ఆ ఏనుగుల గుంపు అడవులను వదిలి వచ్చి.. ఏకంగా 500 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశాయి. అంతేకాదు.. ఈ పాదయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదు.. రోజూ పాదయాత్ర చేయడం.. ఎక్కడో ఒకచోట వchiana-elephents{#}Avunu;Raccha;Yatra;Government;mediaచైనా పాలకులను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న ఏనుగులు..?చైనా పాలకులను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న ఏనుగులు..?chiana-elephents{#}Avunu;Raccha;Yatra;Government;mediaWed, 09 Jun 2021 10:18:00 GMTఅదో ఏనుగుల గుంపు.. ఎక్కడో అడవుల్లో ఉండే ఏనుగుల గుంపు.. కానీ ఇప్పుడది చైనా పాలకులను కన్ ఫ్యూజ్ చేస్తోంది. ఎందుకంటే.. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు గుంపు ఇప్పుడు అడవులు వదిలి నగరాల బాట పట్టాయి. ఏకంగా  నగరాల బాట పట్టాయి. అంతే కాదు.. నిరంతరాయంగా పాదయాత్ర చేస్తున్నాయి. అదేంటి.. ఏనుగుల పాదయాత్ర ఏంటి అంటారా.. అవును ఇప్పుడు చైనాలో అదే జరుగుతోంది. ఆ ఏనుగుల గుంపు అడవులను వదిలి వచ్చి.. ఏకంగా 500 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశాయి.

అంతేకాదు.. ఈ పాదయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదు.. రోజూ పాదయాత్ర చేయడం.. ఎక్కడో ఒకచోట విశ్రాంతి తీసుకోవడం.. మళ్లీ లేచి పాదయాత్ర చేయడం.. ఇదీ ఈ ఏనుగుల గుంపు చేస్తున్నది.. అంతే కాదు.. దారిలో ఎక్కడైనా ఆకలేస్తే పంట పొలాలపై పడి నానా రచ్చ చేయడం కూడా వీటికి అలవాటుగా మారింది. ఈ యాత్ర ఎందాకా అన్నది మాత్రం అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. అందుకే ఇప్పడు చైనాలో పాలకులు జుట్టు పీక్కుంటున్నారు. అందుకే చేసేది లేక.. ఆ గుంపును ఫాలో అవుతున్నారు.

ఇలా ఈ ఏనుగుల గుంపును ఫాలో అయ్యేందుకు చైనా ప్రభుత్వం ఓ పెద్ద టీమ్‌నే ఏర్పాటు చేసింది. 410 మందితో కూడిన ప్రత్యేక టీమ్ ఈ ఏనుగులను గమనిస్తోంది. పెద్ద సంఖ్యలో వాహనాలు, 14 డ్రోన్లు ఈ టీమ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏనుగుల గుంపు పాదయాత్ర అంశం ఇంటర్నేషనల్ మీడియా దృష్టికి కూడా వెళ్లింది. సోషల్ మీడియా  నిండా ఆ గజరాజులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కనిపిస్తున్నాయి.

అయితే ఇలా ఎందుకు జరుగుతోందన్న దానికి మాత్రం కారణాలు తెలియరాలేదు.  సాధారణంగా ఏనుగులు అడవిల నుంచి బయటకు రావు. మరి ఈ ఏనుగుల గుంపు ఇలా సుదీర్ఘంగా నడుచుకుంటూ వెళ్తుందో అంతుపట్టడం లేదు. వీటి పాదయాత్రతో నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యలు  ఏర్పడుతున్నాయి. అయితే కొందరు మొక్కజొన్న ల వంటి పంటలు కోసమే ఈ పయనం అంటున్నారు. మరికొందరు గుంపు నాయకుడైన ఏనుగు తప్పే అంటున్నారు. ఏది నిజమో.. ఆ ఏనుగులకే తెలియాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్

డాక్టర్ల కోసం భారీ ప్లాన్ రెడీ చేస్తున్న నాని..!!

జూన్ 9వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

వైరల్ వీడియో! నీళ్లలో కూల్ గా రిలాక్స్ అవుతున్న పాండాలు ..

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>