PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan6cb7059d-2a7b-4ce9-aec2-8a6b0237e180-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan6cb7059d-2a7b-4ce9-aec2-8a6b0237e180-415x250-IndiaHerald.jpgగతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు జగన్‌కు షాక్ ఇచ్చి, చంద్రబాబుకు జై కొట్టిన విషయం తెలిసిందే. అయితే అధికారం కోసం ఆశపడి ఆ నాయకులు వైసీపీలో గెలిచి, టీడీపీలో చేరారు. అలా అప్పుడు టీడీపీలో చేరిన నాయకులు పరిస్తితి 2019 ఎన్నికల్లో ఏమైందో అందరికీ తెలిసిందే. ఒక్క గొట్టిపాటి రవికుమార్ తప్ప టీడీపీ తరుపున పోటీ చేసిన జంపింగ్ ఎమ్మెల్యేలంతా ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయాక ఆ నాయకులు పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది.jagan{#}Jagan;Telugu Desam Party;Hanu Raghavapudi;K S Ravikumar;TDP;ashok;sunil;YCP;Anna Rambabuఆ ఇద్దరు జంపింగ్ నేతలకు జగన్ దెబ్బ గట్టిగా తగిలిందా?ఆ ఇద్దరు జంపింగ్ నేతలకు జగన్ దెబ్బ గట్టిగా తగిలిందా?jagan{#}Jagan;Telugu Desam Party;Hanu Raghavapudi;K S Ravikumar;TDP;ashok;sunil;YCP;Anna RambabuWed, 09 Jun 2021 13:00:00 GMTగతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు జగన్‌కు షాక్ ఇచ్చి, చంద్రబాబుకు జై కొట్టిన విషయం తెలిసిందే. అయితే అధికారం కోసం ఆశపడి ఆ నాయకులు వైసీపీలో గెలిచి, టీడీపీలో చేరారు. అలా అప్పుడు టీడీపీలో చేరిన నాయకులు పరిస్తితి 2019 ఎన్నికల్లో ఏమైందో అందరికీ తెలిసిందే. ఒక్క గొట్టిపాటి రవికుమార్ తప్ప టీడీపీ తరుపున పోటీ చేసిన జంపింగ్ ఎమ్మెల్యేలంతా ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయాక ఆ నాయకులు పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది.


ఇప్పటికీ ఆ నాయకులు టీడీపీలో పుంజుకోలేకపోతున్నారు. జగన్ హవా ఇంకా కొనసాగుతుండటంతో, ఆ ఎమ్మెల్యేలకు ఇంకా కష్టకాలం నడుస్తోంది. జగన్ దెబ్బకు వారి రాజకీయ భవిష్యత్ కష్టంగా అయిపోయింది. ముఖ్యంగా ముత్తుముల అశోక్ రెడ్డి, పాశం సునీల్ కుమార్‌లు టీడీపీలో పుంజుకోలేపోతున్నారు.  2014 ఎన్నికల్లో అశోక్ రెడ్డి వైసీపీ తరుపున గిద్దలూరులో పోటీ చేసి అన్నా రాంబాబుపై గెలిచారు.


కానీ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో, ఇటు వచ్చేశారు. అధికారం ఉన్నన్ని రోజులు అశోక్ రెడ్డి రాజకీయం బాగానే నడిచింది. కానీ 2019 ఎన్నికల్లోనే సీన్ రివర్స్ అయింది. అశోక్ టీడీపీ నుంచి పోటీ చేస్తే, అన్నా రాంబాబు వైసీపీలోకి వచ్చి పోటీ చేశారు. దాదాపు 81 వేల భారీ మెజారిటీతో రాంబాబు, అశోక్‌పై గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా రాంబాబు దూకుడుగా ఉన్నారు. కానీ అశోక్ రెడ్డి మాత్రం టీడీపీలో పెద్దగా కనిపించడం లేదు. ఒకవేళ టీడీపీలో మళ్ళీ పోటీ చేసిన అశోక్‌కు విజయం దక్కుతుందనేది కాస్త డౌటే.


అటు పాశం సునీల్ 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున గూడూరులో పోటీ చేసి గెలిచారు. సునీల్ కూడా నెక్స్ట్ టీడీపీలోకి వచ్చేశారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. జగన్ వేవ్‌లో దాదాపు 40 వేల ఓట్ల పైనే మెజారిటీతో సునీల్, వరప్రసాద్‌పై ఓడిపోయారు. ఓడిపోయాక సునీల్ పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకిత ఉన్నా సరే, సునీల్‌కు జగన్ ఇమేజ్ దెబ్బ వేస్తుంది. ఫలితంగా గూడూరులో సునీల్ పుంజుకోలేదు. మొత్తానికైతే ఈ ఇద్దరు జంపింగ్ ఎమ్మెల్యేలకు జగన్ దెబ్బ గట్టిగానే తగిలింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పోలీస్ తో భార్య ఎఫైర్... భర్త ఏం చేసాడో తెలుసా?

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>