PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp63817ec0-9949-4907-8529-1a10f5d87b71-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp63817ec0-9949-4907-8529-1a10f5d87b71-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో హిందూపురం ఒకటి. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలం బాగానే ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ పార్లమెంట్ స్థానంలో టీడీపీ మంచి విజయాలే సాధించింది. కానీ గత ఎన్నికల్లో మాత్రం జగన్ దెబ్బకు సైకిల్ చిత్తు అయిపోయింది. పార్లమెంట్ స్థానంతో పాటు, 6 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. కేవలం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణ మరోసారి విజయం సాధించారు.tdp{#}Cycle;Telugu Desam Party;Parliment;Hindupuram;Assembly;Party;TDP;Jagan;Balakrishna;YCP;Dharmavaram;paritala ravindra;Minister;Reddyహిందూపురంలో సైకిల్ లైన్ అయినట్లేనా?హిందూపురంలో సైకిల్ లైన్ అయినట్లేనా?tdp{#}Cycle;Telugu Desam Party;Parliment;Hindupuram;Assembly;Party;TDP;Jagan;Balakrishna;YCP;Dharmavaram;paritala ravindra;Minister;ReddyWed, 09 Jun 2021 01:00:00 GMTతెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో హిందూపురం ఒకటి. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలం బాగానే ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ పార్లమెంట్ స్థానంలో టీడీపీ మంచి విజయాలే సాధించింది. కానీ గత ఎన్నికల్లో మాత్రం జగన్ దెబ్బకు సైకిల్ చిత్తు అయిపోయింది. పార్లమెంట్ స్థానంతో పాటు, 6 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. కేవలం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణ మరోసారి విజయం సాధించారు.


అయితే ఎన్నికలై రెండేళ్లు దాటేసింది. ఈ రెండేళ్ల కాలంలో పార్లమెంట్ పరిధిలో టీడీపీ బలోపేతం అయిందా? టీడీపీ నాయకులు యాక్టివ్‌గానే ఉంటూ సైకిల్ స్పీడ్ పెంచారా? అంటే కాస్త అవునని, కాస్త కాదని చెప్పొచ్చు. ఎందుకంటే పార్లమెంట్ పరిధిలో నాయకులు బాగానే యాక్టివ్‌గా ఉంటున్నారు. కానీ ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పార్టీని గెలిపించలేకపోయారు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉండటం, పథకాలు అమలులో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ప్రజలు వైసీపీ వైపుకు మొగ్గు చూపారు.


అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఆ పరిస్తితి ఉండదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న బి‌కే పార్థసారథి, పార్టీని బలోపేతం చేయడానికి బాగానే కష్టపడుతున్నారు. ఓ వైపు తన సొంత నియోజకవర్గం పెనుగొండలో పార్టీని నడిపిస్తూనే, పార్లమెంట్ పరిధిలో పనిచేసుకుంటున్నారు. అటు హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య పనితీరు ఏంటో చెప్పాల్సిన పని లేదు.


ఇక రాప్తాడు, ధర్మవరం బాధ్యతలని పరిటాల శ్రీరామ్ చూసుకుంటున్నారు. ఇందులో రాప్తాడులో టీడీపీ పరిస్తితి కాస్త మెరుగైనట్లే ఉంది. ధర్మవరంలో శ్రీరామ్‌కు పెద్ద ఛాన్స్ దొరకడం లేదు. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి దూకుడుగా ఉండటం లేదు. వయసు మీద పడటంతో పల్లె కాస్త సైలెంట్‌గా ఉన్నారు. కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలనే కసితో పనిచేస్తున్నారు. అటు మడకశిరలో ఈరన్న సైతం పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. మొత్తానికైతే హిందూపురంలో సైకిల్ కాస్త గాడిలో ఉన్నట్లే కనిపిస్తోంది.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>