MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanf999f271-03d1-4f33-ba0a-0540f4d4c539-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanf999f271-03d1-4f33-ba0a-0540f4d4c539-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో చక్కటి సినిమాల్లో నటించిన హీరో సుమన్. చక్కటి రూపం మంచి నటన అంతకుమించి డాన్సులు కూడా చేయగలడు. మార్షల్ ఆర్ట్స్ లో కూడా అందెవేసిన చేయి కావడంతో ఆయన కు వచ్చే అవకాశాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ తాను ఎందుకో టాలీవుడ్ లో స్టార్ హీరో గా నిలదొక్కుకోలేకపోయాడు. సరైన అవకాశాలు అందుకోలేకపోయాడు. దీనికితోడు ఆయనపై కేసులు కూడా చాలా రావడంతో జైలు కి కూడా వెళ్ళాడు దీంతో టాప్ హీరో అవలేకపోయాడు. suman{#}Teluguసుమన్ ని కావాలనే ఆ నలుగురు హీరోలు తొక్కేసారా.. ?సుమన్ ని కావాలనే ఆ నలుగురు హీరోలు తొక్కేసారా.. ?suman{#}TeluguWed, 09 Jun 2021 13:00:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో చక్కటి సినిమాల్లో నటించిన హీరో సుమన్. చక్కటి రూపం మంచి నటన అంతకుమించి డాన్సులు కూడా చేయగలడు. మార్షల్ ఆర్ట్స్ లో కూడా అందెవేసిన చేయి కావడంతో ఆయన కు వచ్చే అవకాశాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ తాను ఎందుకో టాలీవుడ్ లో స్టార్ హీరో గా నిలదొక్కుకోలేకపోయాడు. సరైన అవకాశాలు అందుకోలేకపోయాడు. దీనికితోడు ఆయనపై కేసులు కూడా చాలా రావడంతో జైలు కి కూడా వెళ్ళాడు దీంతో టాప్ హీరో అవలేకపోయాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ లకు ఏ మాత్రం తీసిపోదు సుమన్. ఆయన మీద ముక్కోపి అనే ముద్ర ఉండటం, దర్శక నిర్మాతలను కొడతాడు అన్న కేసులు రావడంతో ఆయన వీరితోపాటు సినిమాలు చేయడంలో వెనకబడ్డాడు. బ్లూ ఫిలిమ్స్ కూడా చేస్తాడని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే అవన్నీ తనను ప్లాన్ ప్రకారం ఇరికించారని చెప్పాడు చాలాసార్లు సుమన్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించాడు ఆయన. 

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తే కొంతమంది జెలసీ గా ఫీల్ అవ్వడం కామన్ అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలోని మిగతా టాప్ హీరోలతో తానెప్పుడు ఫ్రెండ్లీ గా నే ఉన్నట్లు చెప్పాడు. పలువురు హీరోలతో మంచి సంబంధాలు లేవనే వార్తలను ఆయన కొట్టిపారేశారు. అయితే తనను కావాలనే కొందరు బ్యాడ్ గా చిత్రీకరించే ప్రయత్నం మాత్రం చేశారని చెప్పాడు. వారెవరో మాత్రం బయటకి చెప్పలేదు. అటు టాలీవుడ్ హీరో కి దక్కని గౌరవం ఆయనకు దక్కింది. హాలీవుడ్ లో నటించిన ఏకైక తెలుగు హీరో సుమన్. అమెరికా అల్లుడు సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లాడు సుమన్. తన నటన చూసి ఇంగ్లీష్ మూవీలో అవకాశం ఇచ్చారు ఓ ఫారన్ డైరెక్టర్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన బిజీగా గడుపుతున్నాడు. శివాజీ సినిమా లో విలన్ క్యారెక్టర్ చేసి మంచి మార్కులు కొట్టేశాడు సుమన్.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు జనాలకు బాగా ఎక్కేస్తున్న మలయాళీ సినిమాలు ఇవే

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>