MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya274430ce-44b5-4c14-8d16-f1ae08e74563-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya274430ce-44b5-4c14-8d16-f1ae08e74563-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు అందరూ అన్ని భాషల్లో తాము తెలియడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అన్ని భాషల్లో తమ సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా అన్ని భాషల్లో సినిమాలు వచ్చేలా చూసుకోవడమే కాకుండా తమ గత చిత్రాలు యూట్యూబ్ లో ఇతర భాషల్లో డబ్ అయ్యేలా కూడా చూసుకుంటున్నారట. ఇకపోతే ఈ కోవలోకే నాగచైతన్య కూడా చేరబోతున్నాడు. naga chaitanya{#}Naga Chaitanya;Aamir Khan;vijay sethupathi;Episode;war;Forest Gump;Oscar;Hollywood;Tamil;Tollywood;bollywood;you tube;Chaitanya;India;Director;Darsakudu;Hero;Cinemaనాగ చైతన్య డెబ్యూ ఇప్పట్లో అయ్యేలా లేదే!!నాగ చైతన్య డెబ్యూ ఇప్పట్లో అయ్యేలా లేదే!!naga chaitanya{#}Naga Chaitanya;Aamir Khan;vijay sethupathi;Episode;war;Forest Gump;Oscar;Hollywood;Tamil;Tollywood;bollywood;you tube;Chaitanya;India;Director;Darsakudu;Hero;CinemaWed, 09 Jun 2021 17:56:10 GMTప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు అందరూ అన్ని భాషల్లో తాము తెలియడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా  సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అన్ని భాషల్లో తమ సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా అన్ని భాషల్లో సినిమాలు వచ్చేలా చూసుకోవడమే కాకుండా తమ గత చిత్రాలు యూట్యూబ్ లో ఇతర భాషల్లో డబ్  అయ్యేలా కూడా చూసుకుంటున్నారట. ఇకపోతే ఈ కోవలోకే నాగచైతన్య కూడా చేరబోతున్నాడు. 

బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డుకు ఎంపికైన హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా అమీర్ ఖాన్ స్నేహితుడి పాత్ర కోసం మొదట తమిళ స్టార్ విజయ్ సేతుపతి తీసుకున్నారు కానీ డేట్స్ కుదరక పోవడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ పాత్రను నాగచైతన్య చేయనున్నాడు.

చైతన్యకు ఇదే బాలీవుడ్ డెబ్యూ సినిమా.లాక్ డౌన్ మూలంగా ఈ సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం కాగా వీలైనంత త్వరగా చిత్రీకరణ  స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట చిత్రబృందం. జూలై మొదటి వారం నుంచి మొదలు పెట్టాలని అనుకున్నారు. ముందుగా ఒక వార్ సీన్ షూటింగ్ ప్లాన్ చేశారు. ఇందులో చైతు కూడా జాయిన్ కావాల్సి ఉండగా ఈ ఎపిసోడ్ మొత్తం చైతన్య అమీర్ పక్కనే ఉంటాడట. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. ఇంకా కరోనా పూర్తిగా అదుపులోకి రాలేదు కాబట్టి  వందలమంది ఆరోగ్యాలను రిస్క్ లో పెట్టి షూటింగ్ చేయడం ఎందుకని భావించిన అమీర్ ఖాన్ కొన్ని రోజులు ఎదురు చూడాలని తీసుకున్నారట. దీంతో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇంకొన్ని రోజులు వాయిదా పడుతుంది. దీనిపై ఫ్యాన్స్ ఏమని స్పందిస్తారో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు జనాలకు బాగా ఎక్కేస్తున్న మలయాళీ సినిమాలు ఇవే

బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..?

జంబలకడిపంబ.. సుధీర్ తప్ప అందరూ మారిపోయారు?

రకుల్ పరువు తీసిన తమ్ముడు.. ఆ వీడియో పోస్టు చేసి?

మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

నటి జయంతి మూడు పెళ్లిళ్ల వెనక అసలు కథ.. !

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>