PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/karanam-balarameec377df-c1db-4c52-9140-a679031440af-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/karanam-balarameec377df-c1db-4c52-9140-a679031440af-415x250-IndiaHerald.jpgగత ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయాక, ఆ పార్టీకి చెందిన నేతలు వరుసపెట్టి అధికార వైసీపీలోకి జంప్ కొట్టేసిన విషయం తెలిసిందే. అధికారం దక్కుతుందనే ఉద్దేశంతో టీడీపీలోని సీనియర్ నేతలు సైతం, తమ వారసులని వెంటబెట్టుకుని మరీ జగన్ చెంత చేరారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్న సీనియర్ నేతలు కరణం బలరాం, శిద్ధా రాఘవరావులు సైతం వైసీపీ వైపుకు వెళ్లారు.karanam balaram{#}Jagan;TDP;Prakasam;YCP;KARANAM BALARAMA KRISHNA MURTHY;Party;chirala;MLA;Varasudu;MADDISETTY VENUGOPALకరణం, శిద్ధా వారసులకు జగన్ ఛాన్స్ ఇస్తారా?కరణం, శిద్ధా వారసులకు జగన్ ఛాన్స్ ఇస్తారా?karanam balaram{#}Jagan;TDP;Prakasam;YCP;KARANAM BALARAMA KRISHNA MURTHY;Party;chirala;MLA;Varasudu;MADDISETTY VENUGOPALWed, 09 Jun 2021 14:00:00 GMTగత ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయాక, ఆ పార్టీకి చెందిన నేతలు వరుసపెట్టి అధికార వైసీపీలోకి జంప్ కొట్టేసిన విషయం తెలిసిందే. అధికారం దక్కుతుందనే ఉద్దేశంతో టీడీపీలోని సీనియర్ నేతలు సైతం, తమ వారసులని వెంటబెట్టుకుని మరీ జగన్ చెంత చేరారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్న సీనియర్ నేతలు కరణం బలరాం, శిద్ధా రాఘవరావులు సైతం వైసీపీ వైపుకు వెళ్లారు.


గతంలో ఈ ఇద్దరు టీడీపీలో ఎంత కీలకంగా ఉన్నారో తెలిసిందే. కానీ టీడీపీ అధికారం కోల్పోవడంతో కరణం బలరాం దశాబ్దాల పాటు టీడీపీతో ఉన్న బంధాన్ని తెంపుకుని మరీ వైసీపీలోకి వెళ్లారు. తాను ఎమ్మెల్యేగా ఉండటంతో నేరుగా పార్టీలో చేరకుండా, తన తనయుడు కరణం వెంకటేష్‌కి పార్టీ కండువా వేయించారు. కరణం సైతం అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.


అయితే వైసీపీలోకి వచ్చాక కరణం ఫ్యామిలీకి అధికారమైతే దక్కింది గానీ, ఫ్యూచర్‌లో ఎలాంటి పొజిషన్ ఉంటుందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ప్రస్తుతం కరణం చీరాల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సైతం వైసీపీలో దూకుడుగా ఉన్నారు. దీంతో కరణం, ఆమంచిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అసలు నెక్స్ట్ చీరాల టిక్కెట్ ఎవరికి దక్కుతుందనేది తెలియడం లేదు. అదేవిధంగా కరణం వారసుడు వెంకటేష్ పరిస్తితి ఏంటి అనే విషయంపై కూడా క్లారిటీ రావడం లేదు.


అటు శిద్ధా రాఘవరావుది అదే పరిస్తితి. గత ఎన్నికల్లో శిద్ధా టీడీపీ తరుపున ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక తన తనయుడు సుధీర్‌తో కలిసి వైసీపీలోకి వచ్చారు. వైసీపీలోకి వచ్చాక శిద్ధా ఫ్యామిలీకి ఎలాంటి పదవి దక్కలేదు. అలాగే భవిష్యత్‌లో ఏ పొజిషన్ వస్తుందనేది తెలియదు. శిద్ధా గతంలో దర్శి ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ అక్కడ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్తితుల్లో వైసీపీలో శిద్ధాకు గానీ, ఆయన వారసుడుకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్తితి ఉంది. మరి చూడాలి కరణం, శిద్ధా ఫ్యామిలీలకు ఫ్యూచర్‌లో జగన్ ఎలాంటి ఛాన్స్ ఇస్తారో?  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్నటికీ చెరగని సంగీత కిరణం ఈ ‘స్వాతి కిరణం’

ఐసీసీ పాత రూల్ తెరమీదికి.. ఐపీఎల్ కు చిక్కులు తప్పవా?

చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?

మనీ : మీకు తెలియకుండానే మీ డబ్బు పొరపాటున ఇతరుల అకౌంట్ కు చేరిందా ?

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలుగు రాష్ట్రాలకు మొదలైన వరద ప్రవాహం!

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌కు సిద్ధం..కానీ : నరేంద్ర సింగ్ తోమర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>