SmaranaDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/ironleg-shstri5de81053-c32f-48b5-a349-41134414a93b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/ironleg-shstri5de81053-c32f-48b5-a349-41134414a93b-415x250-IndiaHerald.jpgఎంతోమంది నటీనటులు ఎన్నోకలలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం అలా సినీ ఇండస్ట్రీలోకి రావడం కోసం ఎన్నో కష్టాలు పడి, అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఆ తర్వాత స్టార్ గా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. మరికొంతమంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో అడుగుపెట్టి ఒకటి రెండు సినిమాలకే దూరమైతే, మరి కొంతమంది స్టార్స్ గా కొనసాగుతున్నారు. కొంతమంది హాస్యనటులుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తమ ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నారు. అయితే కొంతమంది నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ, ప్రIRONLEG SHSTRI{#}ironleg sastri viswanath sastri;Darsakudu;Director;Chitram;Cinema;Iron;Yevaru;prasad;job;Brahmanandam;Heart;June;sampoornesh babu;sundeep kishanస్మరణ : ఐరన్ లెగ్ శాస్త్రి మరణం వెనుక వున్న రహస్యం ఇదే..స్మరణ : ఐరన్ లెగ్ శాస్త్రి మరణం వెనుక వున్న రహస్యం ఇదే..IRONLEG SHSTRI{#}ironleg sastri viswanath sastri;Darsakudu;Director;Chitram;Cinema;Iron;Yevaru;prasad;job;Brahmanandam;Heart;June;sampoornesh babu;sundeep kishanWed, 09 Jun 2021 07:00:00 GMT
ఎంతోమంది నటీనటులు ఎన్నోకలలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం అలా సినీ ఇండస్ట్రీలోకి రావడం కోసం ఎన్నో కష్టాలు పడి, అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఆ తర్వాత స్టార్ గా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. మరికొంతమంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో అడుగుపెట్టి ఒకటి రెండు సినిమాలకే దూరమైతే, మరి కొంతమంది స్టార్స్ గా కొనసాగుతున్నారు. కొంతమంది హాస్యనటులుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తమ ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నారు. అయితే కొంతమంది నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ, ప్రేక్షకులకు మాత్రం జీవితాంతం గుర్తుండేలా నటించి స్వర్గస్థులు అవుతూ ఉంటారు.


ఇక అలాంటి వారిలో ఐరన్ లెగ్ శాస్త్రి కూడా ఒకరు. ఈయన తన కామెడీతో ప్రేక్షకులను ఎంతగా నవ్వించేవారంటే చూసినవారి కడుపు చెక్కలవ్వాల్సిందే. ఐరన్ లెగ్ శాస్త్రి అసలు పేరు గునుపూడి విశ్వనాథశాస్త్రి. తాడేపల్లిగూడెం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన మొదట్లో సినిమాల ప్రారంభోత్సవానికి పౌరహిత్యం వహించేవారు. మొదట సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ, ఈయనకు సినిమాలో అవకాశం కల్పించారు.

1991లో అప్పుల అప్పారావు చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఆయన పేరు ఐరన్ లెగ్ శాస్త్రి. ఆ చిత్రంలో ఆయన నటించిన తీరుకు గానూ ఆయనకు ఐరన్ లెగ్ శాస్త్రి గా పేరు పడిపోయింది. ఇప్పుడు ఎవరు చూసినా ఐరన్లెగ్ అంటేనే గుర్తు పడతారు. అంతలా ఈయన పేరు స్థిరపడిపోయింది. ఇక ఈయన కొడుకు ప్రసాద్ ఎంబీఏ పూర్తి చేసి, ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు అడపాదడపా  సినిమాలలో కూడా నటిస్తున్నారు.


ఇక దాదాపు 30 సినిమాల వరకు నటించి, అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. నటించింది మాత్రం కొన్ని చిత్రాలే అయినప్పటికీ ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం" ఏవండీ ఆవిడ వచ్చింది". ఇక ఈ చిత్రంలో బ్రహ్మానందం లో ఆట పట్టిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇక అయితే చివరకు 2006లో గుండె సమస్యతో బాధపడుతూ జూన్ 19వ తేదీన మరణించారు.  ఈయన చనిపోయే ముందు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయారు. ఇక ఈయన కుటుంబం ఆర్థికంగా  ప్రభుత్వాన్ని కూడా సహాయం కోరినట్లు సమాచారం. ఇక వీరి కుటుంబం ఆర్థిక పరిస్థితుల్లో ఉండడం గమనించిన సంపూర్ణేష్ బాబు వీరి కుటుంబానికి 25 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇక సందీప్ కిషన్ కూడా కొంత సహాయం చేశారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోదీ చెప్పిన 'ఫ్రీ' విలువ@1.45 లక్షల కోట్లు.?

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>