PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/nara-lokesh33548449-4dea-40c0-b5d9-06eecba067b9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/nara-lokesh33548449-4dea-40c0-b5d9-06eecba067b9-415x250-IndiaHerald.jpgఏపీలో ప్రతి అంశంపై రాజకీయం చేయడం అధికార, ప్రతిపక్షాలకు బాగా అలవాటైపోయినట్లుంది. గత రెండేళ్లుగా ఏదొక విషయంలో వైసీపీ, టీడీపీలు రాజకీయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో కూడా రెండు పార్టీలు బాగానే రాజకీయం చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో పిల్లల ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు వాయిదా వేయాలని టీడీపీ నేత లోకేష్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.nara lokesh{#}TDP;Lokesh;Lokesh Kanagaraj;Andhra Pradesh;Minister;Suresh;central government;Nara Lokesh;Government;Jagan;YCPచినబాబు వాళ్ళని వదిలేలా లేరుగా!చినబాబు వాళ్ళని వదిలేలా లేరుగా!nara lokesh{#}TDP;Lokesh;Lokesh Kanagaraj;Andhra Pradesh;Minister;Suresh;central government;Nara Lokesh;Government;Jagan;YCPWed, 09 Jun 2021 02:00:00 GMTఏపీలో ప్రతి అంశంపై రాజకీయం చేయడం అధికార, ప్రతిపక్షాలకు బాగా అలవాటైపోయినట్లుంది. గత రెండేళ్లుగా ఏదొక విషయంలో వైసీపీ, టీడీపీలు రాజకీయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో కూడా రెండు పార్టీలు బాగానే రాజకీయం చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో పిల్లల ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు వాయిదా వేయాలని టీడీపీ నేత లోకేష్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.


పిల్ల భవిష్యత్ కోసం పరీక్షలు పెడతామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెబుతున్నారు. అయితే కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 10, 12వ తరగతి పరీక్షలని రద్దు చేసింది. అలాగే దేశంలో ఇతర రాష్ట్రాలు సైతం ఇదే పని చేశాయి. పక్కనే ఉన్న తెలంగాణలో సైతం టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసి, విద్యార్ధులని నేరుగా పాస్ చేసింది. కానీ ఏపీ ప్రభుత్వం పరీక్షల విషయంలో గట్టిగా నిలబడుతుంది.


కానీ పరీక్షలు రద్దు చేయాలని నారా లోకేష్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై విద్యార్ధులతో ఆన్‌లైన్‌లో సమావేశమై, పరీక్షలపై వారి ఒపీనియన్ తెలుసుకుంటున్నారు. అటు విద్యార్ధుల తల్లిదండ్రులతో కూడా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇక విద్యార్ధులు కూడా పరీక్షలు రద్దు చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఉన్నారు. ఒకవేళ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్ విషయంలో లోకేష్ గట్టిగా నిలబడకపోతే, ఏపీ ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసేదేమో అని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


లోకేష్ ఈ విషయంలో కలుగజేసుకోవడం వల్ల, ఏపీ ప్రభుత్వం పట్టుదలతో పరీక్షలు పెడుతున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో పరీక్షలు రద్దు చేస్తే, ఆ క్రెడిట్ లోకేష్‌కు వెళుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు మొగ్గుచూపి ఉండొచ్చని చెబుతున్నారు.


కేంద్రంతో పలు రాష్ట్రాలు పరీక్షలని రద్దు చేసి, విద్యార్ధులకు ఊరటనిచ్చిన, జగన్ ప్రభుత్వం అలా చేయడం లేదు. పైగా పరీక్షలని వాయిదా వేసింది. ఇలా వాయిదా వేసి పరీక్షలు నిర్వహించడం వల్ల, విద్యార్ధులకు నెక్స్ట్ విద్యా సంవత్సరం ఆలస్యమైపోతుందని అంటున్నారు. మరి లోకేష్ విద్యార్ధులని వదిలేస్తే, వైసీపీ ప్రభుత్వం పరీక్షలని రద్దు చేసేందుకు మొగ్గు చూపుతుందేమో అని పరిశీలకులు భావిస్తున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీటు విషయంలో పవన్‌కు క్లారిటీ లేదా? వాళ్ళ పరిస్తితి ఏంటి?

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>