PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrb99410a6-a842-49ad-a888-b10a45eceb57-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrb99410a6-a842-49ad-a888-b10a45eceb57-415x250-IndiaHerald.jpgతెలంగాణ మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్‌ కొన్నాళ్ల నుంచి దూరం పెడుతున్న సంగతి తెలిసిందే.. ఈ మధ్య మళ్లీ హరీశ్ రావు కాస్త సీఎంకు క్లోజ్‌గా మూవ్ అవుతున్నా.. 2,3 ఏళ్ల క్రితం హరీశ్‌ను కేసీఆర్ బాగా ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు ఏకంగా ఏ మంత్రి పదవీ ఇవ్వకుండా దూరంగా ఉంచారు. పార్టీలో పదవి లేకుండా చేశారు. ఇదంతా కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ఫ్యూచర్ కోసమే చేశారని అంటుంటారు. అయితే కొన్నిరోజులుగా మళ్లీ హరీశ్ రావు.. కేసీఆర్‌ టీమ్‌లో క్రియాశీలకంగా ఉంటున్నారు. మళ్లీ సీఎం కేసీఆర్ పార్టీలో కీలక బాధ్యkcr{#}Thanneeru Harish Rao;Telangana;CM;KCR;Minister;KTR;Reddy;Chief Minister;MLA;kusuma jagadish;Partyఅలా... హరీశ్ రావు మళ్లీ కేసీఆర్‌కు దగ్గరయ్యారా..?అలా... హరీశ్ రావు మళ్లీ కేసీఆర్‌కు దగ్గరయ్యారా..?kcr{#}Thanneeru Harish Rao;Telangana;CM;KCR;Minister;KTR;Reddy;Chief Minister;MLA;kusuma jagadish;PartyWed, 09 Jun 2021 07:00:00 GMTతెలంగాణ మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్‌ కొన్నాళ్ల నుంచి దూరం పెడుతున్న సంగతి తెలిసిందే.. ఈ మధ్య మళ్లీ హరీశ్ రావు కాస్త సీఎంకు క్లోజ్‌గా మూవ్ అవుతున్నా.. 2,3 ఏళ్ల క్రితం హరీశ్‌ను కేసీఆర్ బాగా ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు ఏకంగా ఏ మంత్రి పదవీ ఇవ్వకుండా దూరంగా ఉంచారు. పార్టీలో పదవి లేకుండా చేశారు. ఇదంతా కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ఫ్యూచర్ కోసమే చేశారని అంటుంటారు.

అయితే కొన్నిరోజులుగా మళ్లీ హరీశ్ రావు.. కేసీఆర్‌ టీమ్‌లో క్రియాశీలకంగా ఉంటున్నారు. మళ్లీ సీఎం కేసీఆర్ పార్టీలో కీలక బాధ్యతలు హరీశ్ కు అప్పగిస్తున్నారు. అయితే ఈ మార్పు వెనుక ఓ కథ ఉందని తాజాగా ప్రచారం సాగుతోంది. అదేంటంటే.. సీఎంకు బాగా నమ్మకస్తుడైన మంత్రి జగదీష్ రెడ్డి ఇటీవల హంపీలో తన కుమారుడి పుట్టినరోజు ఉత్సవం నిర్వహించారట. అక్కడకు కొంతమంది టిఆర్ఎస్ నేతలు, నలుగురు ఎమ్మెల్యేలు కూడా వెళ్లారట. ఆ సందర్భంగా కొందరు నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ తీరును ఆక్షేపిస్తూ మాట్లాడారట.

అంతే కాదు.. ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా పాట పాడారట. ఇలా జరుగుతున్నా మంత్రి జగదీష్ రెడ్డి వారిని వారించలేదని, మౌనంగా ఉన్నారన్నది అభియోగం. ఈ నేపధ్యంలో తదుపరి టార్గెట్ జగదీష్ రెడ్డి అవుతారా అన్న కథనాలు పత్రికల్లో వస్తున్నాయి. అయితే అసలు ఈ పార్టీ విషయం అందులో పాల్గొన్న ఓ వ్యక్తి ద్వారా మంత్రి హరీశ్ రావుకు తెలిసిందట. ఆయన దీన్ని చక్కగా వాడుకున్నారని ప్రచారం జరుగుతోంది.

పార్టీలో పెద్ద కుట్ర జరుగుతోందని.. హరీశ్‌ రావు కేసీఆర్ అపాయిట్ మెంట్ తీసుకుని మొత్తం వివరించారట. ఈ కారణంగానే మంత్రి ఈటలను కేసీఆర్ టార్గెట్ చేసి బయటకు పంపారని చెబుతున్నారు. అంతే కాదు.. ఇప్పుడు మంత్రి జగదీశ్ రెడ్డిని కూడా బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేశారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని జగదీశ్ రెడ్డి కూడా ఖండించినట్టు లేరు. మొత్తానికి హరీశ్ రావు ఈ విధంగా మామకు దగ్గరైనట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరి వాస్తవం ఏంటో వారికే తెలియాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోదీ చెప్పిన 'ఫ్రీ' విలువ@1.45 లక్షల కోట్లు.?

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>