PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan18843453-2c0b-4c62-b66f-337506a5ff1b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan18843453-2c0b-4c62-b66f-337506a5ff1b-415x250-IndiaHerald.jpgఏపీలో బీజేపీ నేతలకంటూ ఓ స్పష్టమైన వైఖరి ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఏపీలో బీజేపీది ప్రతిపక్ష పాత్ర. ఆ పార్టీకి ఒక్కశాతం ఓట్లు రాకపోయినా సరే, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏపీలో కాస్త ఉనికి ఉందని చెప్పొచ్చు. అయితే ఏపీలో ప్రతిపక్ష పాత్రలో ఉన్న బీజేపీ నేతలు ఒక లైన్‌లో వెళుతున్నట్లు కనిపించరు. ఎందుకంటే ఏపీలో కొందరు బీజేపీ నేతలు జగన్‌కు అనుకూలంగా ఉన్నారని విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో మరికొందరు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని కూడా విమర్శలు వస్తున్నాయి.jagan{#}Kanna Lakshminarayana;Bharatiya Janata Party;YCP;Andhra Pradesh;Jagan;Episode;vishnuజగన్‌ని టార్గెట్ చేసిన మరో రాజుగారు..మధ్యలో కన్నా ఎంట్రీ..జగన్‌ని టార్గెట్ చేసిన మరో రాజుగారు..మధ్యలో కన్నా ఎంట్రీ..jagan{#}Kanna Lakshminarayana;Bharatiya Janata Party;YCP;Andhra Pradesh;Jagan;Episode;vishnuTue, 08 Jun 2021 15:00:00 GMTఏపీలో బీజేపీ నేతలకంటూ ఓ స్పష్టమైన వైఖరి ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఏపీలో బీజేపీది ప్రతిపక్ష పాత్ర. ఆ పార్టీకి ఒక్కశాతం ఓట్లు రాకపోయినా సరే, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏపీలో కాస్త ఉనికి ఉందని చెప్పొచ్చు. అయితే ఏపీలో ప్రతిపక్ష పాత్రలో ఉన్న బీజేపీ నేతలు ఒక లైన్‌లో వెళుతున్నట్లు కనిపించరు. ఎందుకంటే ఏపీలో కొందరు బీజేపీ నేతలు జగన్‌కు అనుకూలంగా ఉన్నారని విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో మరికొందరు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని కూడా విమర్శలు వస్తున్నాయి.


ఇక జగన్‌కు అనుకూలంగా ఉన్నవారు...అధికారంలో ఉన్న వైసీపీ కంటే, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీపైనే ఎక్కువ విమర్శలు చేస్తారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవారు, వైసీపీని గట్టిగానే టార్గెట్ చేసి మాట్లాడతారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలతో పాటు మరికొందరు నేతలు చంద్రబాబునే టార్గెట్ చేసి మాట్లాడతారు. అటు విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ లాంటివారు జగన్‌పై విరుచుకుపడతారు.


అయితే ఇటీవల కాలంలో విష్ణుకుమార్ రాజు, ఓ రేంజ్‌లో జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతూ వస్తున్నారు. రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ నుంచి విష్ణు మీడియా ముందుకొచ్చి, జగన్ ప్రభుత్వాన్ని ఏకీపారేస్తున్నారు. రఘురామకు సపోర్ట్ చేసి జగన్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. తాజాగా విశాఖలో మానసిక వికలాంగులు స్కూలు కూల్చే విషయంపై విష్ణు, జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఏపీలో నియంత పాలన నడుస్తుందని అంటున్నారు.


ఇలా ఓ వైపు విష్ణు, జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే, మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ ఎంట్రీ ఇచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపోయాక కాస్త సైలెంట్ అయిన కన్నా, మళ్ళీ ఎంట్రీ ఇచ్చి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్, ప్రజల సొమ్ముతో ప్రజలనే కొంటున్నారని ఫైర్ అయిపోయారు.  ఈ విధంగా విష్ణు, కన్నాలు జగన్ టార్గెట్‌గా రాజకీయం చేయడం మొదలుపెట్టారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తల్లిని హత్యచేసే విధంగా రఘురామ ప్రవర్తన!

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !

టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలు వీళ్ళే

మంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>