PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-fe5af9fe-395d-4a51-91bb-fffbefb5bd56-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-fe5af9fe-395d-4a51-91bb-fffbefb5bd56-415x250-IndiaHerald.jpgతెలుగు దేశానికి భావి నాయకుడు లోకేష్ అన్నది తెలిసిందే. లోకేష్ ప్రత్యక్ష రాజకీయ జీవితం 2014 నుంచి ప్రారంభమైందని అంటారు. అంటే గట్టిగా ఏడేళ్ళు అన్న మాట. ఇక ఆయన 2017లో ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తరువాత ఆయన మంత్రి గా కూడా రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. lokesh{#}Telugu;Lokesh;Lokesh Kanagaraj;Minister;media;YCP;Shakti;S Radhakrishna;Government;TDPలోకేష్ కి గోల్డెన్ చాన్స్... ?లోకేష్ కి గోల్డెన్ చాన్స్... ?lokesh{#}Telugu;Lokesh;Lokesh Kanagaraj;Minister;media;YCP;Shakti;S Radhakrishna;Government;TDPTue, 08 Jun 2021 21:00:00 GMTతెలుగు దేశానికి భావి నాయకుడు లోకేష్ అన్నది తెలిసిందే. లోకేష్ ప్రత్యక్ష రాజకీయ జీవితం 2014 నుంచి ప్రారంభమైందని అంటారు. అంటే గట్టిగా ఏడేళ్ళు అన్న మాట. ఇక ఆయన 2017లో ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తరువాత ఆయన మంత్రి గా కూడా రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు.

ఎంతో కొంత పాలనానుభవం, రాజకీయ అనుభవం సంపాదించిన లోకేష్ తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న వేళ రాటు దేలాలని అంతా కోరుకుంటున్నారు. అయితే దానికి తగినట్లుగానే లోకేష్ తన బాడీ లాంగ్వేజ్ తో పాటు అన్నీ కూడా మెల్లగా మార్చుకుంటున్నారు. అదే విధంగా లోకేష్ మీడియాను కూడా బాగా ఫేస్ చేస్తున్నారు. ఆయన గతంలో మాదిరిగా తడబాటు పడడంలేదు.

జగన్ సర్కార్ మీద గట్టిగానే బాణాలు వేస్తున్నారు. వరసపెట్టి సమస్యలను పట్టుకుని పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. లోకేష్ కి ఎంత పట్టుదల ఉందంటే మూడు నెలలుగా ఆయన ఒకే ఒక ఇష్యూ మీద పోరాడుతున్నారు. ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు పరీక్షలు పెట్టవద్దని లోకేష్ గట్టిగా కోరుకుంటున్నారు. ఆ మేరకు ఆయన మీడియా ముందుకు పలు మార్లు వచ్చి డిమాండ్ చేశారు కూడా. కరోనా వేళ పరీక్షలు ఏంటి, విద్యార్ధుల జీవితాలతో ఆటలా అంటూ లోకేష్ నిలదీశారు.

పరీక్షలు వాయిదా పడినా రద్దు కాకపోవడంతో లోకేష్ రద్దు చేయాల్సిందే అంటూ పోరాడుతున్నారు. ఒక రకంగా వైసీపీని వదలకుండా ఆయన టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ కూడా లోకేష్ లో ఇంతటి పోరాట శక్తి ఎక్కడిది అని ఆశ్చర్యపోతోంది. అయితే చినబాబు ఇపుడిపుడే  రాటుదేలుతున్నారు. తనను తాను తీర్చిదిద్దుకునే పనిలో పడుతున్నారు. ప్రజల సమస్యలను ఆయన ఎక్కడా వదలకుండా ప్రస్తావిస్తున్నారు. దానికి తగినట్లుగానే ప్రభుత్వం కూడా లోకేష్ కి అనేక రకాల ఆఫర్లను ఇచ్చేస్తోంది.

అడ్డగోలు విధానాలతో సర్కార్ ఒక్కోసారి దొరికేస్తోంది. మరి ఈ గోల్డెన్ చాన్స్ ని లోకేష్ కనుక ఉపయోగించుకుంటే ఆయన కచ్చితంగా మరో మూడేళ్ళలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నాయకుడిగా అటు టీడీపీలోనే కాదు, జనంలోనూ గట్టిగా నిలబడగలరు. లోకేష్ కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో అయితే టీడీపీ లేకపోతే వైసీపీ అన్నట్లుగానే పొలిటికల్ సీన్ ఉంది కాబట్టి చినబాబు కష్టపడితే బెస్ట్ ఫ్యూచర్ ఉండొచ్చు అన్న విశ్లేషణలు ఉన్నాయి.
       





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయ్ సేతుపతి దెబ్బకి వణికిపోతున్న టాలీవుడ్..

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>