MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaliseathupathi-tolliwood-47f34e3c-b3f5-47d7-9aac-1ea15fb32eb9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaliseathupathi-tolliwood-47f34e3c-b3f5-47d7-9aac-1ea15fb32eb9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ విలన్ గా పేరు ప్రఖ్యాతలు ఘడించిన ఏకైక వ్యక్తి విజయ్ సేతుపతి. ఇటీవల కాలంలో అటు బుల్లితెర పైన, తమిళ్ ఇండస్ట్రీలో, ఇటు తెలుగు ఇండస్ట్రీలో బాగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. విజయ్ సేతుపతి అసలు పేరు విజయ గురునాథ సేతుపతి కలి ముత్తు. ఈయన 1978 జనవరి 16వ తేదీన చెన్నై లోని రాజపాలయం లో పుట్టి పెరిగారు. ఇక ఈయన విద్యాభ్యాసం ఎంజీఆర్ హయ్యరు సెకండరీ స్కూల్ అలాగే లిటిల్ ఏంజెల్స్ మాట్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ముగిసింది. అయితే పెద్దగా చదివేవారు కాదు. ఈయనకు ఎక్కువగా ఆటలపైనే శ్రద్ధ ఉండేది. VIJALISEATHUPATHI TOLLIWOOD{#}Wanted;Joseph Vijay;Tamil;Telugu;vijay sethupathi;January;Chennai;School;Dubai;job;Hindi;Cinema;Hanu Raghavapudi;Chiranjeevi;Saira Narasimhareddy;Tollywoodవిజయ్ సేతుపతి దెబ్బకి వణికిపోతున్న టాలీవుడ్..విజయ్ సేతుపతి దెబ్బకి వణికిపోతున్న టాలీవుడ్..VIJALISEATHUPATHI TOLLIWOOD{#}Wanted;Joseph Vijay;Tamil;Telugu;vijay sethupathi;January;Chennai;School;Dubai;job;Hindi;Cinema;Hanu Raghavapudi;Chiranjeevi;Saira Narasimhareddy;TollywoodTue, 08 Jun 2021 21:00:00 GMT
ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ విలన్ గా పేరు ప్రఖ్యాతలు ఘడించిన ఏకైక వ్యక్తి విజయ్ సేతుపతి. ఇటీవల కాలంలో అటు బుల్లితెర పైన, తమిళ్ ఇండస్ట్రీలో, ఇటు తెలుగు ఇండస్ట్రీలో బాగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. విజయ్ సేతుపతి అసలు పేరు విజయ గురునాథ సేతుపతి కలి ముత్తు. ఈయన 1978 జనవరి 16వ తేదీన చెన్నై లోని రాజపాలయం లో పుట్టి పెరిగారు. ఇక ఈయన విద్యాభ్యాసం ఎంజీఆర్ హయ్యరు సెకండరీ స్కూల్ అలాగే లిటిల్ ఏంజెల్స్ మాట్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ముగిసింది. అయితే పెద్దగా చదివేవారు కాదు. ఈయనకు ఎక్కువగా ఆటలపైనే శ్రద్ధ ఉండేది. విజయ్ సేతుపతి కి పదహారవ యేట 1994లో నమ్మవార్ చిత్రంలో ఒక పాత్ర కోసం సంప్రదించారు. కానీ పొట్టిగా ఉండడం చేత తీసుకోలేకపోయారు.


 ఇక ఆ తర్వాత పాకెట్ మనీ కోసం కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, జీవనం గడిపేవారు. ఇక తర్వాత దుబాయ్ వెళ్లి ఉద్యోగం లో కూడా చేరాడు. అక్కడ నచ్చకపోవడంతో తిరిగి  వచ్చి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి  చిన్న చిన్నగా సహాయకుడి పాత్రలలో సినిమాలలో నటించడం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత తమిళ్, తెలుగు,మలయాళం, హిందీ చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈయన నటించిన సినిమాలలో దాదాపు హిట్ కాలేదనే చెప్పవచ్చు. ఇక చిన్న చిన్న పాత్రలు చేస్తూ, ఆ తర్వాత తెన్మేర్కు పరుకావత్రు సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఇక  తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, గాయకుడిగా, పాటల రచయితగా, ప్రతినాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు.


ఇక మొట్టమొదటిసారి తెలుగులో 2019 లో మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక అప్పటితో పెద్దగా విజయం రాకపోయినప్పటికీ, 2021లో  వచ్చిన ఉప్పెన సినిమా ద్వారా మంచి పాపులారిటీని తెచ్చుకున్నాడు. ఇక అంతే కాదు తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక ఇటీవల కాలంలో ఈయనకు తెలుగులో ప్రతినాయకుడి పాత్రలో ఆఫర్లు గట్టిగా వస్తుండటంతో, ఇక రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచేసాడు. సుమారు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ ను అడుగుతున్నట్లు సమాచారం. ఇక ఈయన దెబ్బకు టాలీవుడ్ వర్గాలు సైతం భయపడుతున్నాయట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>