PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anandayya-krishnapatnamff6bb7d6-86c3-4dc0-880e-0fd83f224587-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anandayya-krishnapatnamff6bb7d6-86c3-4dc0-880e-0fd83f224587-415x250-IndiaHerald.jpgచెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే. ఈయన మహా నాటు నాయకుడు. ఆయన వ్యవహారశైలి కూడా అంతే.. గట్టిగా నోరు తెరిచి ప్రత్యర్థులపై విమర్శలు మొదలు పెడితే.. ఆ సంస్కృతం వినలేక పారిపోవాల్సిందే. కానీ.. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. జనం కష్టాల్లో ఉన్నప్పుడు కాస్త జనంలో ఉండే నాయకుడు ఈ చెవిరెడ్డి.. ఈ విషయం గతంలోనూ అనేకసార్లు రుజువైంది. ఇప్పుడు తాజాగా కరోనా సమయంలో తన నియోజకవర్గం ప్రజలకు ఆనందయ్య మందు ఇప్పించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాపత్రయం మెచ్చుకోదగిందే. అసలanandayya-krishnapatnam{#}Chevireddy Bhaskarareddy;Chittoor;Chandragiri;Maha;Reddy;bhaskar;Baba Bhaskar;Ayurveda;High court;MLAఆనందయ్యను ఫుల్లుగా వాడేస్తున్న చెవిరెడ్డి..?ఆనందయ్యను ఫుల్లుగా వాడేస్తున్న చెవిరెడ్డి..?anandayya-krishnapatnam{#}Chevireddy Bhaskarareddy;Chittoor;Chandragiri;Maha;Reddy;bhaskar;Baba Bhaskar;Ayurveda;High court;MLATue, 08 Jun 2021 07:00:00 GMTచెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే. ఈయన మహా నాటు నాయకుడు. ఆయన వ్యవహారశైలి కూడా అంతే.. గట్టిగా నోరు తెరిచి ప్రత్యర్థులపై విమర్శలు మొదలు పెడితే.. ఆ సంస్కృతం వినలేక పారిపోవాల్సిందే. కానీ.. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. జనం కష్టాల్లో ఉన్నప్పుడు కాస్త జనంలో ఉండే నాయకుడు ఈ చెవిరెడ్డి.. ఈ విషయం గతంలోనూ అనేకసార్లు రుజువైంది.

ఇప్పుడు తాజాగా కరోనా సమయంలో తన నియోజకవర్గం ప్రజలకు ఆనందయ్య మందు ఇప్పించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాపత్రయం మెచ్చుకోదగిందే. అసలు ఆనందయ్య మందు గురించి వెలుగులోకి వచ్చిన వెంటనే చెవిరెడ్డి.. కృష్టపట్నం వెళ్లారు. కొందరు ఆయుర్వేద నిపుణులను వెంటబెట్టుకుని కృష్ణపట్నంలో పర్యటించాడు. స్థానికులు చెప్పిన దాన్ని బట్టి చెవిరెడ్డికి ఈ మందుపై గురి కుదిరింది.

అంతే అప్పటి నుంచి ఆనందయ్య మందు తయారీ గురించి చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. తన నియోజక వర్గ ప్రజలందరికీ ఆనందయ్య మందు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాడు. ఆనందయ్య మందు పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. అప్పటికే సిద్ధంగా ఉన్న దినుసులతో ఆనందయ్య, ఆయన శిష్యులతో మందు తయారీ ప్రయత్నాల జోరు పెంచేశారు. ఇక ఇప్పుడు ఏకంగా  సీఎం, చెవిరెడ్డి, ఆనందయ్య  బొమ్మలు ఉన్న మందు డబ్బాలు కూడా తయారు చేయించేసి మందు పంపిణీకి రెడీ అవుతున్నారు.

ఈ ఆనందయ్య మందు పని చేస్తుందో.. చేయదో తర్వాత సంగతి.. కానీ తన నియోజక వర్గ ప్రజలకు ఆనందయ్య మందు ఇప్పించాలన్న చెవిరెడ్డి ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఈ మందు పని చేయడం మొదలైతే చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి గ్రాఫ్ ఇంకాస్త పెరుగుతుంది. పని చేయకపోయినా.. తమ ఎమ్మెల్యే తమ కోసం ఇంత శ్రద్ధ తీసుకున్నాడన్న మంచి పేరైనా మిగులుతుంది. ఏమంటారు..? నాయకులు ఎవరైనా ప్రజల్లో పేరు కోసం పని చేస్తుంటారు. దాని ద్వారా ప్రజలకు మేలు జరిగితే మంచిదే కదా.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అరుణ మాటల్లో ఆంతర్యం ఏంటి..? ఈటల వర్గంలో కలవరం ఎందుకు..?

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>