EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan-rrre30a8125-0101-45d1-9bec-431fac547a83-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan-rrre30a8125-0101-45d1-9bec-431fac547a83-415x250-IndiaHerald.jpgరఘురామ కృష్ణంరాజు.. నర్సాపురం ఎంపీ.. అందులోనూ జగన్‌ సొంతపార్టీ ఎంపీ.. కానీ ఇప్పుడు అదే ఎంపీ రచ్చ రచ్చ చేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజును ఆ మధ్య ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి కష్టడీలో పెట్టారు.. అదే సమయంలో తనను ఎంపీ అని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. అదే విషయం కోర్టుల్లో చెప్పారు. మొత్తానికి అదే గ్రౌండ్స్ పై బెయిల్ కూడా పొందారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అయితే.. ఇప్పుడు అదే రఘురామ కృష్ణంరాజు జగన్‌కు చుక్కలు చూపిస్తానని పరోక్షంగా చెబుతున్నారు. రఘురామ కృష్ణంjagan-rrr{#}Raccha;Narsapuram;MP;Andhra Pradesh;police;Kanumuru Raghu Rama Krishnam Raju;Letter;Jaganరచ్చ రచ్చ చేస్తున్న రాజు.. జగన్‌ గ్యాంగ్‌ గుండెల్లో గుబులు..?రచ్చ రచ్చ చేస్తున్న రాజు.. జగన్‌ గ్యాంగ్‌ గుండెల్లో గుబులు..?jagan-rrr{#}Raccha;Narsapuram;MP;Andhra Pradesh;police;Kanumuru Raghu Rama Krishnam Raju;Letter;JaganTue, 08 Jun 2021 06:00:00 GMTరఘురామ కృష్ణంరాజు.. నర్సాపురం ఎంపీ.. అందులోనూ జగన్‌ సొంతపార్టీ ఎంపీ.. కానీ ఇప్పుడు అదే ఎంపీ రచ్చ రచ్చ చేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజును ఆ మధ్య ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి కష్టడీలో పెట్టారు.. అదే సమయంలో తనను ఎంపీ అని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టారని  రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. అదే విషయం కోర్టుల్లో చెప్పారు. మొత్తానికి అదే గ్రౌండ్స్ పై బెయిల్ కూడా పొందారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అయితే.. ఇప్పుడు అదే రఘురామ కృష్ణంరాజు జగన్‌కు చుక్కలు చూపిస్తానని పరోక్షంగా చెబుతున్నారు.

రఘురామ కృష్ణంరాజు ఓ ఎంపీ.. ఇప్పుడు అదే హోదాతో ఆయన ఢిల్లీలో జగన్‌కు వ్యతిరేకంగా ప్లాన్ రూపొందిస్తున్నారు. ఓ ఎంపీని దారుణంగా కొట్టారు చూశారా అంటూ మొత్తం దేశంలోని ఎంపీలందరికీ లేఖలు రాశారు. తనకు సంఘీభావం తెలపాలని కోరుతున్నారు. జగన్ ప్రభుత్వం తనను ఎంతగా వేధిస్తుందో చూడండని చెబుతున్నారు. మొదట ఎంపీలకే లేఖలు రాసిన రఘురామ కృష్ణంరాజు ఇప్పడు దేశంలోని ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాశారు. ఒక్క జగన్‌కు మినహా.

మొత్తం మీద.. జగన్ సర్కారు తనను చిత్రహింసలు పెడుతోందన్న వాదనను ఆయన దేశంలోని అన్ని వేదికలపై వినిపించాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. అయితే.. ఇలాంటి రచ్చతో జగన్‌కు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా.. జగన్‌కు ఏమైనా నష్టం కలుగుతుందా అన్నదే అసలైన చర్చ. తనపై జగన్ కక్ష సాధింపును రుజువు చేసి తద్వారా జగన్ బెయిల్ రద్దు చేయాలన్న తన పిటిషన్‌కు మరింత బలం చేకూర్చాలని రఘురామ కృష్ణంరాజు ప్రయత్నిస్తున్నారు.  

మరి రఘురామ ప్రయత్నాలతో జగన్ బెయిల్ రద్దవుతుందా.. జగన్ జైలుకు వెళ్లే అవకాశం ఉంటుందా.. అసలు రఘురామ కృష్ణంరాజు వాదనలు కోర్టుల్లో నిలుస్తాయా.. ప్రజాప్రతినిధుల్లో సానుభూతి సాధించడం కోర్టులను ప్రభావితం చేస్తుందా.. అన్నది ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. ఏదేమైనా రఘురామ కృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయిస్తారో లేదో చెప్పలేం కానీ.. తన శాయశక్తులా జగన్‌ ను ఇబ్బంది పెట్టేందుకు మాత్రం కృషి చేస్తున్నారు. మరి ఆ దిశగా ఆయన ఎంత సక్సస్‌ అవుతారో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అధ్యక్షుడే వెళ్ళిపోతే.. పార్టీ నట్టేట మునిగినట్టే?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>