QuotesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/mannchimaatab4d4594e-0fcd-44ef-a0ca-65570d980dfd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/mannchimaatab4d4594e-0fcd-44ef-a0ca-65570d980dfd-415x250-IndiaHerald.jpgసాధారణంగా మన ప్రవర్తన ఇతరుల ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది అని పెద్దలు అంటారు. కానీ అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రవర్తన అనేది మన మీదే ఆధారపడుతుంది. ఇతరులను ఎప్పుడూ అనుకరించరాదు అనేది మాత్రం నిజం. కానీ ఇతరులు ప్రవర్తన మంచిగా ఉండి, నలుగురికి ఉపయోగపడేలాగా ఉంటే తప్పకుండా అనుసరించవచ్చు. అయితే మన ప్రవర్తన బాగోలేదని ఇతరుల ప్రవర్తనను అనుకరిస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. అనగనగా ఒక ఊరిలో ఒక కుమ్మరి ఉండేవాడు. ఆయన దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉండేవి. ఆ కుమ్మరి తను చేసిన కుండలు అన్నింటిని గాడిద నడ్డి మీMANNCHIMAATA{#}Nijam;Dogs;prema;Love;Eveningమంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.మంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.MANNCHIMAATA{#}Nijam;Dogs;prema;Love;EveningTue, 08 Jun 2021 14:00:00 GMT
సాధారణంగా మన ప్రవర్తన ఇతరుల ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది అని పెద్దలు అంటారు. కానీ అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రవర్తన అనేది మన మీదే ఆధారపడుతుంది. ఇతరులను ఎప్పుడూ అనుకరించరాదు అనేది మాత్రం నిజం. కానీ ఇతరులు ప్రవర్తన మంచిగా ఉండి,  నలుగురికి ఉపయోగపడేలాగా ఉంటే తప్పకుండా అనుసరించవచ్చు. అయితే మన ప్రవర్తన బాగోలేదని ఇతరుల ప్రవర్తనను అనుకరిస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం.


అనగనగా ఒక ఊరిలో ఒక కుమ్మరి ఉండేవాడు. ఆయన దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉండేవి. ఆ కుమ్మరి తను చేసిన కుండలు అన్నింటిని గాడిద నడ్డి మీద వేసి బజారుకి తీసుకెళ్లి విక్రయించేవాడు. అది త్వరగా నడవాలని దారిపొడవునా దాన్ని కొడుతూ ఉండేవాడు. ఇక ఆ గాడిద, కుమ్మరి.. తన పట్ల దయ లేకుండా ప్రవర్తిస్తున్నాడని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఒక రోజు గాడిద ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఇలా అనుకుంది." ప్రతిరోజు బోలెడన్ని కుండలను బజార్ కి మోసుకెళ్తుంటాను. ఇక నేను ఎంత కష్టపడినప్పటికీ యజమానికి నా మీద దయ కలగడం లేదు. ప్రేమ కూడా లేదు ఎప్పుడూ నన్ను చితకబాదుతుంటాడు.

చెడిపోయినవి, మిగిలిపోయినవి, పాచిపోయినవి, కుళ్లి పోయినవి ఇలా ఏవి పడితే అవి నా మొహాన పడేస్తూ ఉంటాడు. కానీ ఆ కుక్క ని మాత్రం ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా,అభిమానంగా చూసుకుంటాడు. దానికి మాంసం పెట్టి మరీ మేపుతున్నాడు. పాలు కూడా దగ్గరుండి తాగిస్తున్నాడు. అయితే నేను ఒక పని చేస్తా..! అది మొరిగినట్లు నేను కూడా మొరుగుతాను. కుక్క అతనిపై పడి నాకినట్లు నేను కూడా అతనిని నాకుతాను. అప్పుడతను సంతోషించి నా వీపు నిమురుతాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అని అనుకుంది.

ఇక సాయంత్రం యజమాని ఇంటికి తిరిగి రాగానే కుక్కలాగా గట్టి గట్టిగా అరుస్తూ, యజమాని దగ్గర మీద పడి నాకడం మొదలు పెట్టింది. ఇక తనపై దాడి చేయడానికి వస్తోందని భావించిన యజమాని కర్ర తీసుకొని చితకబాదాడు. కాబట్టి ఎవరి ప్రవర్తన వారిదే.. ఇతరులను చూసి అనుకరించరాదు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>