EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nirmala-sitharamanc3b06c19-70a1-4082-b87b-5d0820dc55ea-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nirmala-sitharamanc3b06c19-70a1-4082-b87b-5d0820dc55ea-415x250-IndiaHerald.jpgదేశం పూర్తిగా కష్టాల్లో ఉంది. దేశంలో జనం కరోనా తెచ్చిన ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా యాక్టివ్‌గా పని చేయాల్సింది ప్రభుత్వాలే. అందులోనూ ఇది దేశం మొత్తానికి సంబంధించిన సమస్య కాబట్టి కేంద్రానికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. మరి ఇలాంటి కీలక సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి పని తీరుపై విమర్శలు వస్తున్నాయి. అసలు ఆమె మంత్రిగా ఉన్నారా.. ఏం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆమె మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైంది. మీడియా ముందుకు రాకపోయినా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్న దాnirmala-sitharaman{#}central government;Minister;media;Indiaనిర్మలమ్మా.. జనం గోడు వినవమ్మా..?నిర్మలమ్మా.. జనం గోడు వినవమ్మా..?nirmala-sitharaman{#}central government;Minister;media;IndiaTue, 08 Jun 2021 23:00:00 GMTదేశం పూర్తిగా కష్టాల్లో ఉంది. దేశంలో జనం కరోనా తెచ్చిన ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా యాక్టివ్‌గా పని చేయాల్సింది ప్రభుత్వాలే. అందులోనూ ఇది దేశం మొత్తానికి సంబంధించిన సమస్య కాబట్టి కేంద్రానికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. మరి ఇలాంటి కీలక సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి పని తీరుపై విమర్శలు వస్తున్నాయి. అసలు ఆమె మంత్రిగా ఉన్నారా.. ఏం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఎందుకంటే ఆమె మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైంది. మీడియా ముందుకు రాకపోయినా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో అనేక ప్యాకేజీలు ఆమె ప్రకటించినా.. ఆ సొమ్ముతో బాగుపడిందేవరో.. సాయం పొందిందెవరో అర్థం కాని పరిస్థితి. మరోవైపు లక్షల కోట్ల రూపాయలు రుణాలను కూడా సాయం కింద చూపించి జిమ్మిక్కులు చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి.

ఇప్పుడు జనం ఇన్ని కష్టాల్లో ఉన్నా.. నిర్మలాసీతారామన్ మాత్రం కనిపించడం లేదు. ఢిల్లీలోనే ఉన్నారా.. తమిళనాడులో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. నిర్మలాసీతారామన్‌ ను మంత్రి వర్గంలోకి తీసుకున్నప్పుడు చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆమె సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తుందని ఆశించారు. కానీ.. ఆమెను రక్షణ శాఖ మంత్రిగా నియమించిన సమయంలో పుల్వామా దాడి జరగడం కూడా విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనకు నేరుగా మంత్రిని బాధ్యురాలిని చేయకపోయినా ఆమె కూడా విమర్శలపాలవ్వక తప్పలేదు.

ఇక ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ప్రజలను ఆమె ఆదుకోవడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. కీలమైన మందులకు సబ్సిడీలు ఇవ్వడం.. నిత్యావసరాలపై పన్నులు తగ్గించడం వంటి చర్యలతో ప్రజలపై కాస్త భారం తగ్గించవచ్చు. కానీ ఆ దిశగా నిర్మలా సీతారామన్ ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. చివరకు ఈ మంత్రి ఉన్నారా.. ఉంటే ఎక్కడ ఉన్నారు అని జనం అనుకునే పరిస్థితి దాపురించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆంధ్రాలో దారుణం.. మహిళపై లైంగిక దాడి..  దేహశుద్ధి చేసి..

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>