జేసీబీని ఢీకొట్టిన బస్సు: 17కు పెరిగిన మృతుల సంఖ్య -ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి -కేంద్రం రూ.2లక్షల పరిహ

India

oi-Madhu Kota

|

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. లక్నో నుంచి ఢిల్లీ వెళుతోన్న యూపీ ఆర్టీసీ బస్సు కాన్పూర్ సిటీకి దగ్గర్లోని సచేంది వద్ద ఎదురుగా వచ్చిన జేసీబీని ఢీకొట్టింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాన్పూర్ బస్సు దుర్ఘటపై కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ, మృతుల సంఖ్య 17కు పెరిగిందని, గాయపడ్డ ఇతరులకు కాన్పూర్ లోని ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తున్నామని, అతి వేగమే ప్రమాదానికి కారణంగా ప్రధామిక దర్యాప్తును బట్టి వెల్లడైందని, దీనిపై మరింత దర్యాప్తు చేస్తామని ఐజీ తెలిపారు. కాగా,

ఘోరం: జేసీబీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -15మంది దుర్మరణం, 24 మందికి గాయాలుఘోరం: జేసీబీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -15మంది దుర్మరణం, 24 మందికి గాయాలు

kanpur-road-accident-death-toll-raise-to-17-pm-modi-shah-grief-rs-2-lakh-ex-gratia-pmnrf

కాన్పూర్ ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం బాధకలిగించిందని, చనిపోయివారి కుటుంబాలకు సంతాపాన్ని తెలుపుతున్నానని, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2లక్షల నష్టపరిహారాన్ని అందిస్తున్నామని మోదీ ట్వీట్ చేశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం కాన్పూర్ బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికార బీజేపీ నేతలంతా దుర్ఘటనపై వేగంగా స్పందించారు.

CJI NV Ramana మరో సంచలనం? -హైకోర్టు జడ్జిలుగా సుప్రీం లాయర్లకు ఎలివేషన్! -ఒకే చెప్పారన్న బార్CJI NV Ramana మరో సంచలనం? -హైకోర్టు జడ్జిలుగా సుప్రీం లాయర్లకు ఎలివేషన్! -ఒకే చెప్పారన్న బార్

English summary

Expressing condolences over the road accident in Uttar Pradesh’s Kanpur, Prime Minister Narendra Modi on Tuesday announced an ex-gratia of Rs 2 lakh each from the Prime Minister’s National Relief Fund (PMNRF) for the next of kin of those who have lost their lives in the tragedy. Death toll in kanpur bus accident has rose to 17, says police.

Story first published: Wednesday, June 9, 2021, 1:36 [IST]

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *