PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona73bf13e0-0fbd-40b7-9a15-305ac256bea2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona73bf13e0-0fbd-40b7-9a15-305ac256bea2-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాల్లో వ్యాక్సినేషన్ కూడా ఒకటి. వ్యాక్సిన్ టీకాలు వేయడం ద్వారా ఈ మహమ్మరిని పూర్తిగా నిలువరించవచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. కానీ ఈ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు అనేక మంది వెనుకాడుతున్నారు. వివిధ సందేహాలను కారణాలుగా చూపిస్తూ వీరంతా టీకాలు వేయించుకోవ..corona{#}Newsమందే ముద్దు వ్యాక్సిన్ వద్దు..మందే ముద్దు వ్యాక్సిన్ వద్దు..corona{#}NewsTue, 08 Jun 2021 14:35:10 GMTకరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాల్లో వ్యాక్సినేషన్ కూడా ఒకటి. వ్యాక్సిన్ టీకాలు వేయడం ద్వారా ఈ మహమ్మరిని పూర్తిగా నిలువరించవచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. కానీ ఈ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు అనేక మంది వెనుకాడుతున్నారు. వివిధ సందేహాలను కారణాలుగా చూపిస్తూ వీరంతా టీకాలు వేయించుకోవడం లేదు. తమకు వచ్చే సందేహాలను నివృతి చేసుకోకుండా టీకాలు వేయించుకోవడం మానేస్తున్నారు. దీనిపై స్పందించిన నిపుణులు వీటిలో అధికంగా వినిపిస్తున్న ప్రశ్నలుకు సమాధానాలు ఇచ్చారు. అంతేకాకుండా వాటికి తగ్గ సూచనలను చేశారు.


టీకా విషయంలో ఎక్కువగా వినిపిస్తున్న వదంతి టీకా వేయించుకున్నా కూడా కరోనా వస్తుందని, అందుకనే వ్యాక్సిన్ వేయించుకున్నా సరే వస్తున్నప్పుడు ఇక ఎందుకనుకొని కొందరు వ్యాక్సిన్ విషయం నిర్లక్షం వహిస్తున్నారు. అయితే టీకా వేసుకుంటే కరోనా రాదని నిపుణులు చెబుతున్నారు. ఇది వరకే కరోనా ఉండి, లక్షణాలు కనిపించకుండా ఉన్న కరోనా టీకా వేసిన తరువాత తన లక్షణాలను చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా టీకా వేయించుకోవడం కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వారు చెబుతున్నారు. వీటితో పాటుగా మహిళలు నెలసరి సమయంలో టీకాలు వేయించుకుంటే ప్రమాదమని కూడా వార్తలు వస్తున్నాయని, అటువంటిదేమీ లేదని, నెలసరి సమయంలో టీకా వేయించుకున్నా వారికి ఎటువంటి ఇబ్బంది రాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



అయితే టీకాను వేయించుకోని వారిలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మద్యం సేవించడం. అవును.. మద్యం సేవించడమే.. టీకా వేసుకున్నాక మద్యం సేవించ కూడదని అనేక మంది టీకాలు వేయించుకోవడం మానేశారట. అయితే దీనిపై స్పందించిన నిపుణులు అది నిజమేనని తేల్చి చెప్పారు. టీకా వేయించుకున్న తరువాత 12 గంటలపాటు మద్యానికి దూరంగా ఉండాలని, 48 గంటలు మద్యానికి దూరం పాటిస్తే మరింత మంచిదని వారు అంటున్నారు. కానీ టీకా వేయించుకున్న తరవాత 12 గంటలు మాత్రం మద్యం సేవించకూడదని వారు చెబుతున్నారు. మరి ఈ సందేహాలకు సమాధానాలు వచ్చాక అయినా టీకాలు వేయించుకునే వారి సంఖ్య పెరుగుతుందేమో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రేపు మోడీ కేబినెట్ కీల‌క భేటీ.. !

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !

టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలు వీళ్ళే

మంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>