PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jyothula-nehru14c161b7-a976-43dd-820f-bb17ac823550-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jyothula-nehru14c161b7-a976-43dd-820f-bb17ac823550-415x250-IndiaHerald.jpgజ్యోతుల నెహ్రూ....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జ్యోతుల...జగ్గంపేట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతుల 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యంలోకి వెళ్ళి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2014 ఎన్నికల్లో మరోసారి జగ్గంపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు.jyothula nehru{#}రాజీనామా;TDP;Jaggampeta;YCP;Party;CBN;Hanu Raghavapudi;Jagan;Kumaar;kakinada;Varasuduలైన్‌లో జ్యోతుల వారసుడు...ఫిక్స్ అయినట్లేనా?లైన్‌లో జ్యోతుల వారసుడు...ఫిక్స్ అయినట్లేనా?jyothula nehru{#}రాజీనామా;TDP;Jaggampeta;YCP;Party;CBN;Hanu Raghavapudi;Jagan;Kumaar;kakinada;VarasuduTue, 08 Jun 2021 03:00:00 GMTజ్యోతుల నెహ్రూ....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జ్యోతుల...జగ్గంపేట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  రెండుసార్లు టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతుల 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యంలోకి వెళ్ళి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2014 ఎన్నికల్లో మరోసారి జగ్గంపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు.


అయితే అప్పుడు వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో జ్యోతుల పార్టీ జంప్ కొట్టేశారు. చంద్రబాబు ఆపరేష్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీలో చేరిపోయారు. బాబు మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపడంతో జ్యోతుల జంప్ కొట్టేశారు. కానీ బాబు, జ్యోతులకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. కానీ అధికారం ఉండటంతో జ్యోతుల టీడీపీలో కొనసాగారు. అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున బరిలో దిగారు. కానీ జగన్ వేవ్‌లో జ్యోతుల ఘోరంగా ఓడిపోయారు.


ఇక ఓడిపోయాక జ్యోతుల టీడీపీలో అంత దూకుడుగా పని చేయడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే పార్టీలో కనిపిస్తున్నారు. అయితే చంద్రబాబు, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకోవడాన్ని పూర్తిగా వ్యతిరేకించిన జ్యోతుల టీడీపీలో సైలెంట్ అయిపోయారు. అలాగే ఎన్నికల బహిష్కరణకు వ్యతిరేకంగా టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో జ్యోతుల పార్టీ మారిపోవడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ జ్యోతుల ఎటు వెళ్లకుండా సైలెంట్‌గా ఉండిపోయారు.


ఇదే సమయంలో జ్యోతుల తనయుడు నవీన్ కుమార్ టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. ఇక నవీన్ టీడీపీలో లైన్‌లో ఉన్నారు కాబట్టి, జ్యోతుల పార్టీ మారడం కష్టమని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిన జ్యోతులకు వచ్చే ప్రయోజనం లేదనే చెప్పొచ్చు. పైగా వచ్చే ఎన్నికల్లో జ్యోతుల తనయుడు నవీన్ కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. మొత్తానికైతే జ్యోతుల దూకుడుగా లేకపోయిన ఆయన వారసుడు మాత్రం దూకుడుగా ఉన్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>