MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/new-051e230b-9d77-45e1-b873-eab8ea47bc9c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/new-051e230b-9d77-45e1-b873-eab8ea47bc9c-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరోలు, టాప్ రేంజ్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు, కొత్త హీరోలు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ రకమైన కేటగిరీలు ఉన్నాయి. ఇందులో అరవైలు దాటిన హీరోలూ దూకుడు చేస్తున్నారు. చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఇక టాప్ హీరోల సంగతి చెప్పనవసరం లేదు. new{#}Tollywood;Dookudu;Telugu;Mini;Santhossh Jagarlapudi;Viswak sen;Cinema;naveen polishetty;Heroineకుర్ర హీరోలకు డోర్స్ ఓపెన్... ?కుర్ర హీరోలకు డోర్స్ ఓపెన్... ?new{#}Tollywood;Dookudu;Telugu;Mini;Santhossh Jagarlapudi;Viswak sen;Cinema;naveen polishetty;HeroineTue, 08 Jun 2021 18:58:27 GMTసీనియర్ హీరోలు, టాప్ రేంజ్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు, కొత్త హీరోలు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ రకమైన కేటగిరీలు ఉన్నాయి. ఇందులో అరవైలు దాటిన హీరోలూ దూకుడు చేస్తున్నారు. చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఇక టాప్ హీరోల సంగతి చెప్పనవసరం లేదు.

వారి కాల్షీట్ల కోసం అలా క్యూ ఉంటూనే ఉంది. మిడిల్ రేంజ్ హీరోలు కూడా తమను నమ్ముకున్న నిర్మాతలతో పాటు అలా సాగుతున్నారు. సినిమాలు చేసుకుంటున్నారు. ప్రతీ ఏడూ కొత్త హీరోలు వస్తూంటారు. అందులో కొంతమంది మాత్రమే నిలబడతారు. ఆ విధంగా చూసుకుంటే టాలీవుడ్ లో కేరాఫ్ అడ్రస్ లతో కాకుండా సొంతంగా వచ్చి ఎదిగిన వారు పూర్తిగా టాలెంట్ తోనే సాగుతున్నారు.

ఇపుడు వారికి ఎక్కడలేని డిమాండ్ వచ్చిపడుతోంది. ఎందుకంటే వారికి ఉన్నదే టాలెంట్. ఇక జనంలో కూడా వారి పట్ల కొత్త మోజు ఉంది. దాంతో అనుకున్న బడ్జెట్ లో సినిమాలు తీస్తే హిట్ అవుతుంది అన్న ఆశ మేకర్స్ లో ఎక్కువగా ఉందిట. టాలీవుడ్ లో మారుతున్న ఆలోచనలతో కుర్ర హీరోలకు యమ డిమాండ్ వచ్చి పడింది అంటున్నారు. వీరితోనే సినిమాలు తీయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.

వీరి ఫ్రెష్ లుక్ అన్నదే పెద్ద అసెట్. అలాగే వీరి మీద ఏ రకమైన ప్రయోగాలైనా చేయవచ్చు. ఏ విధమైన ముద్ర అసలు ఉండదు. ఇక వీరు మేకర్స్ తో పాటుగానే నడుస్తారు. అలాగే కరోనా వేళ థియేటర్లు సరిగ్గా తెరచుకోకపోయినా వేరే విధమైన ఇబ్బందులు ఎదురైనా ఓటీటీ ఫ్లాట్ ఫారం మీద కూడా వీరి సినిమాలు హ్యాపీగా రిలీజ్ చేసేయవచ్చు. దానికి వీరు కూడా ఏమి అభ్యంతరం చెప్పరు. దాంతో ఇపుడు వీరి వెంట తెలుగు సినిమా లోకం పడుతోంది అంటున్నారు.

ఏక్ మినీ కధతో వచ్చిన సంతోష్ శోభన్ అదరగొట్టే పెర్ఫార్మెన్స్ చూపించాడు అని పేరు తెచ్చుకున్నాడు. దాంతో ఆయనకు వరసపెట్టి ఆఫర్స్ వస్తున్నాయి. ఇందులో బడా మేకర్స్ కూడా ఉన్నారు. అలాగే విశ్వక్ సేన్ కూడా యమ జోరు మీద ఉన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ  పాగల్  మంచి అంచనాలను అందుకునేలా ఉంది. దాంతో ఆయన మీద పెట్టుబడి పెడితే ఢోకా లేదని మేకర్స్ భావిస్తున్నారుట. ఇక నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలతో ఎంతో ఎదిగిపోయాడు. ఆయనతో ఏకంగా స్టార్ హీరోయిన్ అనుష్కను కలిపి మరీ మొవీ తీయడానికి రెడీ అవుతున్నారు. వీరితో పాటు న్యూ టాలెంట్ చాలా మంది ఉన్నారు. వీరందరికీ ఒక్కసారిగా మంచి రోజులు వచ్చేశాయిట. ఇక డోర్స్ ఓపెన్ అయితే దూసుకుపోవడమే కదా.

 













Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"రంగం" హీరోయిన్ ఆ రంగంలో బాగా సెటిల్ అయ్యిందిగా ?

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>