MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ramcharan-movie-gossipce012982-a60f-4fc1-807a-fcf4534752c5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ramcharan-movie-gossipce012982-a60f-4fc1-807a-fcf4534752c5-415x250-IndiaHerald.jpgఒకప్పుడు హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరో తొట్టెంపూడి వేణు ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చక్కటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత వెంకటేష్ నారప్ప సినిమాలో గుర్తించదగ్గ రోల్ లో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. RAMCHARAN MOVIE GOSSIP{#}Comedian;Telugu;Hero;Venu Thottempudi;Venkatesh;News;Ram Charan Teja;Heroine;Annayya;Darsakudu;Director;prasanth;Prashant Kishor;Cinema;Swayamvaram;Wife;gopika;Successరామ్ చరణ్ సినిమాలో సీనియర్ హీరోకి చోటు ?రామ్ చరణ్ సినిమాలో సీనియర్ హీరోకి చోటు ?RAMCHARAN MOVIE GOSSIP{#}Comedian;Telugu;Hero;Venu Thottempudi;Venkatesh;News;Ram Charan Teja;Heroine;Annayya;Darsakudu;Director;prasanth;Prashant Kishor;Cinema;Swayamvaram;Wife;gopika;SuccessTue, 08 Jun 2021 13:00:00 GMTఒకప్పుడు హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరో తొట్టెంపూడి వేణు ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చక్కటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత వెంకటేష్ నారప్ప సినిమాలో గుర్తించదగ్గ రోల్ లో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ నటించబోయే తదుపరి చిత్రంలో హీరోయిన్ కి అన్నయ్య పాత్రలో వేణు ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం లో ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న చెర్రీ, ఆ తర్వాత కేజీఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇదే చిత్రంలో వేణుకి అవకాశం ఇవ్వనున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు ఎంత వేగంగా అయితే హీరో గా టాప్ పొజిషన్ కి చేరుకుంటారో, పలు కారణాలతో అంతే వేగంగా కనుమరుగై పోతుంటారు. అలాంటి వారిలో ఒకరు తొట్టెంపూడి వేణు. పొడవైన ఈ హీరో ఒకప్పుడు హీరోగా, కమెడియన్ గా రాణించిన విషయం తెలిసిందే. 1999 లో తొలిసారిగా స్వయంవరం సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చెప్పవే చిరుగాలి , చిరునవ్వుతో, కళ్యాణరాముడు, పెళ్ళాం ఊరెళితే, గోపి గోపిక గోదావరి  వంటి సినిమాలలో హీరోగా చేసి తన దైన శైలిలో అభిమానుల్ని అలరించాడు. హనుమాన్ జంక్షన్ సినిమాలో కమెడియన్ గా అభిమానులను కడుపుబ్బ నవ్వించారు. ఇలా పాత్ర ఏదైనా తన టాలెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి తనవంతు కృషి చేస్తారు వేణు. అప్పట్లో ఈయన సినిమా గ్రాఫ్ చాలా హైలో ఉండేది.
 
అలా సినీ ప్రయాణంలో సక్సెస్ మార్గంలో ఉండగానే పలు కారణాల వల్ల కాస్త గ్యాప్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత అవకాశం దొరకడం చాలా కష్టం అయింది. చాలా కాలం తర్వాత దమ్ము, రామాచారి వంటి సినిమాల్లో నటించినా ఆశించిన ఫలితం దక్కలేదు. దాంతో సినిమాలకు పూర్తిగా ప్యాకప్ చెప్పి వ్యాపార వేత్తగా మారిన హీరో వేణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలో మళ్లీ అవకాశం దొరకాలే కానీ,  రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు.  అయితే వస్తున్న రూమర్స్ ప్రకారం రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం వస్తే మళ్లీ కెరీర్ లో పుంజుకునే అవకాశం ఉంది. ఏమి జరగనుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మామిడి పులుపును ఆస్వాదిస్తూన్న సామ్..!

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>