BirthdayDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/birthday/125/hbd-giribabu4bace37b-9780-4ec4-95c9-a44d52dfcfb9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/birthday/125/hbd-giribabu4bace37b-9780-4ec4-95c9-a44d52dfcfb9-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంత మంది నటులు నటనకే పరిమితం అయిపోతే, మరికొంత మంది నిర్మాతలుగా, దర్శకులుగా తన సత్తా ఏంటో చూపిస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలోనే ఎంతోమంది నటులను, మనం మన తెలుగు సినీ ఇండస్ట్రీలో చూస్తూనే ఉన్నాం. అయితే మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలై ఆయన సినీ ప్రస్థానం, ఆ తరువాత నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన 30 సంవత్సరాల జీవితాన్ని అత్యద్భుతంగా రాణించారు. ఆయన ఎవరో కాదు గిరిబాబు. గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. ఈయన 1946 జూన్ 8వ తేదీన ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో నాగయ్య, HBD GIRIBABU{#}Manam;Telugu;June;Prakasam;CBN;madhavi;Wife;maya;Cinema;Chitram78 వ పుట్టినరోజు జరుపుకుంటున్న గిరిబాబు..78 వ పుట్టినరోజు జరుపుకుంటున్న గిరిబాబు..HBD GIRIBABU{#}Manam;Telugu;June;Prakasam;CBN;madhavi;Wife;maya;Cinema;ChitramTue, 08 Jun 2021 08:40:30 GMT
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంత మంది నటులు నటనకే పరిమితం అయిపోతే,  మరికొంత మంది నిర్మాతలుగా, దర్శకులుగా తన సత్తా ఏంటో చూపిస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలోనే ఎంతోమంది నటులను, మనం మన తెలుగు సినీ ఇండస్ట్రీలో చూస్తూనే ఉన్నాం. అయితే మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలై ఆయన సినీ ప్రస్థానం, ఆ తరువాత నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన 30 సంవత్సరాల జీవితాన్ని అత్యద్భుతంగా రాణించారు. ఆయన ఎవరో కాదు గిరిబాబు. గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. ఈయన 1946 జూన్ 8వ తేదీన ప్రకాశం జిల్లా,  రావినూతల గ్రామంలో నాగయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు.

ఇక ఈయనకు 1963లో శ్రీదేవితో వివాహం జరిగింది. ఇక వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఇక కుమారులు కూడా మనకు బాగా సుపరిచితులే.. ఒకరు రఘుబాబు, మరొకరు బోసు బాబు. అందులో రఘుబాబు, బోసు బాబు ఇద్దరూ సినీ ఇండస్ట్రీలోకి రాగా, కూతురు మాధవి మాత్రం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. ఈయన భార్య 2016 మే 12వ తేదీన మూత్రపిండాల సమస్యతో మరణించారు.

గిరి బాబుకు చిన్నతనం నుండే సినిమాలపై, నాటక రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఇక ఆ ఆసక్తి తోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొట్టమొదటిసారి నటుడుగా 1973లో విడుదలైన "జగమే మాయ " అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. ఇక తరువాత 1977లో వచ్చిన దేవతలారా దీవించండి అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఇక నటుడిగా ఎన్నో చిత్రాలలో నటించి, అందరి చేత మన్ననలు పొందారు.

ఇక అంతేకాదు అగ్ర నటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,మోహన్ బాబు వంటి ఎంతో మంది స్టార్ లతో కలిసి నటించారు . ఇక 1978లో సింహగర్జన అనే చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. దర్శకుడిగా  మొత్తం నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన ఒక పక్క నటుడిగా, మరోవైపు దర్శకుడిగా, ఇంకోవైపు నిర్మాతగా ఇలా అన్ని రంగాలలోనూ తన ప్రతిభను చాటుతూ వస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అరుణ మాటల్లో ఆంతర్యం ఏంటి..? ఈటల వర్గంలో కలవరం ఎందుకు..?

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>