PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpa44c11f6-b0b7-44de-abb7-184c80544033-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpa44c11f6-b0b7-44de-abb7-184c80544033-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీలో మహిళా నాయకులకు ప్రాధాన్యత తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మునుపటిలా టీడీపీలో మహిళా నేతలు ఎక్కువ సంఖ్యలో కనిపించడం లేదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, మహిళా నేతలు ఎక్కువగానే ఉండేవారు. అందులోనూ ఫైర్ బ్రాండ్ నేతలు చాలామందే ఉన్నారు.TDP{#}Telugu Desam Party;TDP;Parliment;Andhra Pradesh;anitha singer;Party;Vijayawada;television;mediaటీడీపీలో ఆ లేడీ ఫైర్‌బ్రాండ్ సైలెంట్...కారణం అదేనా?టీడీపీలో ఆ లేడీ ఫైర్‌బ్రాండ్ సైలెంట్...కారణం అదేనా?TDP{#}Telugu Desam Party;TDP;Parliment;Andhra Pradesh;anitha singer;Party;Vijayawada;television;mediaTue, 08 Jun 2021 04:00:00 GMTతెలుగుదేశం పార్టీలో మహిళా నాయకులకు ప్రాధాన్యత తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మునుపటిలా టీడీపీలో మహిళా నేతలు ఎక్కువ సంఖ్యలో కనిపించడం లేదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, మహిళా నేతలు ఎక్కువగానే ఉండేవారు. అందులోనూ ఫైర్ బ్రాండ్ నేతలు చాలామందే ఉన్నారు.


కానీ టీడీపీ అధికారం కోల్పోయాక చాలామంది మహిళా నేతలు, పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. పార్టీలో సెపరేట్‌గా పదవులు పంపకాలు చేసిన మహిళా నాయకులు కంటికి కనబడటం లేదు. పార్లమెంట్ స్థానాల వారీగా మహిళా అధ్యక్షులని నియమించిన కూడా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా టీడీపీలో ఫైర్ బ్రాండ్ మహిళా నేతలు అడ్రెస్ లేకుండా పోయారు. ప్రస్తుతం ఏపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న అనిత మాత్రమే కాస్త కనిపిస్తున్నారు.


మిగిలిన వారు పూర్తి స్థాయిలో రాజకీయం చేస్తున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా ఎప్పటినుంచో పార్టీ వాయిస్‌ని బలంగా వినిపిస్తున్న పంచమర్తి అనురాధా, ఈ మధ్య పార్టీలో కనిపించడం లేదు. గతంలో విజయవాడ మేయర్‌గా పనిచేసిన అనురాధా, ఎప్పటికప్పుడు పార్టీ తరుపున బలమైన వాయిస్ వినిపించేవారు. ప్రత్యర్ధి పార్టీపై దూకుడుగా విమర్శలు చేసేవారు. ఒకానొక సమయంలో అలా విమర్శలు చేసి, ప్రత్యర్ధుల చేత తిట్టించుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ పార్టీ కోసం ఆమె గట్టిగా నిలబడేవారు. అలా పార్టీ తరుపున బలంగా నిలబడిన అనురాధా ఈమధ్య అసలు కనిపించడం లేదు.


పార్టీలో కీలక పదవులు దక్కకే ఆమె సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనురాధాకు ఎమ్మెల్సీ దక్కాల్సి ఉంది. కానీ అనూహ్య పరిణామాలతో ఆమెకు పదవి దక్కలేదు. ఇక ప్రతిపక్షానికి పరిమితమయ్యాక ఏపీ మహిళా అధ్యక్షురాలి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే ఆ పదవి వంగలపూడి అనితకు దక్కింది. దీంతో అనురాధా పార్టీలో చాలావరకు సైలెంట్ అయిపోయారు. ఈ మధ్య టీవీ డిబేట్లలో గానీ, మీడియా సమావేశాల్లో గానీ అసలు కనిపించడం లేదు. మరి చూడాలి రానున్న రోజుల్లో అనురాధా మళ్ళీ పార్టీలో దూకుడుగా ఉంటారేమో.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏమైనా.. బాబు ఆ విషయంలో గొప్పోడబ్బా?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>