PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/sharmila-party-updatede1a48af-a8ca-43eb-85a5-57552f25480a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/sharmila-party-updatede1a48af-a8ca-43eb-85a5-57552f25480a-415x250-IndiaHerald.jpgదివంగత రాజకీయ నాయకుడు మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైయస్ షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టబోతోందన్న విషయం తెలిసిందే. దీనిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకులు మరియు మహిళల నుండి మద్దతు బాగానే ఉంది. SHARMILA PARTY UPDATE{#}Sharmila;CM;Reddy;Party;Andhra Pradesh;Telangana;gold;central government;Jayanthi;Father;Jaganవైఎస్ షర్మిల వారి ధాటికి నిలుస్తుందా ?వైఎస్ షర్మిల వారి ధాటికి నిలుస్తుందా ?SHARMILA PARTY UPDATE{#}Sharmila;CM;Reddy;Party;Andhra Pradesh;Telangana;gold;central government;Jayanthi;Father;JaganTue, 08 Jun 2021 15:00:00 GMTదివంగత రాజకీయ నాయకుడు మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైయస్ షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టబోతోందన్న విషయం తెలిసిందే. దీనిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకులు మరియు మహిళల నుండి మద్దతు బాగానే ఉంది. మొత్తానికి వైయస్సార్ ఇచ్చిన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ని జగనన్న ముందుకు నడిపిస్తూ ఉండగా, తెలంగాణ రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు  వైఎస్ షర్మిల. అయితే తెలంగాణలో పార్టీ అనౌన్స్మెంట్ కోసం పనులు చకచక జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా అయిపోయినట్లు సమాచారం. వైయస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరును వైయస్సార్ తెలంగాణ పార్టీగా ఫిక్స్ అయిపోవచ్చు అనే అంటున్నారు షర్మిల పార్టీ టీం సభ్యులు కొందరు.
 
పార్టీ పేరు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వద్ద రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ పేరు పరంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పత్రికా ముఖంగా ప్రకటన కూడా ఇచ్చింది వైయస్ షర్మిల టీం. అయితే సిఈసి వైపు నుంచి కూడా దీనిపై ఎటువంటి అభ్యంతరాలు లేవని దాదాపుగా ధ్రువీకరణ అయిపోయినట్లే అని చెబుతున్నారు. అయితే జూలై 8న వైయస్సార్ జయంతి సందర్భంగా పార్టీ పేరును, జెండాను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సూచనలు  కనిపించాయి కానీ ఇంకా క్లారిటీ రాలేదు. ఇదంతా ఒక ఎత్తయితే కరోనా కాస్త తగ్గుముఖం పట్టాక తెలంగాణలో తన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట షర్మిల.  తండ్రి చెప్పిన రాజకీయ సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రజల బాగోగులే ప్రధానలక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లు పలుమార్లు వ్యక్తపరిచారు షర్మిల.

మరో వైపు వైయస్సార్ బాటలోనే పాదయాత్ర చేపట్టబోయే అవకాశం లేకపోలేదు అంటూ రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఏదేమైనా తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ, జగనన్నను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సంపాదించే దిశగా పార్టీ అజెండా ఉండబోతుందట. కాగా ఈ పార్టీ  గురించి మరిన్ని విషయాల పై త్వరలో క్లారిటీ రానుంది. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అధికారంలో ఉన్న తెరాసా ము మరియు జాతీయ పార్టీ అయిన బీజేపీని దాటుకుని షర్మిల అనుకున్నది సాధించగలదా  అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇరి పార్టీలను తట్టుకుని ప్రజల అభివృద్ధి  కోసం తన రాజకీయ ప్రయాణాన్ని సాగించగలదా ? లేదా ఏపీలో జగన్ లాగే మొక్కవోని దీక్షతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా ?   భవిష్యత్తులో ఏమి జరగనుందో తెలియాల్సి ఉంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీఆర్ఎస్ అవినీతికి బీజేపీ రక్షణ : జీవ‌న్ రెడ్డి

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !

టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలు వీళ్ళే

మంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>